భారత్ ఆర్ధిక వ్యవస్థ 8 శాతం వృద్ధి సాధించడమన్నది ఇక గతమేనని రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. 2015 ద్వితీయార్థానికి దేశం 6.5 శాతం
భారత్ ఆర్థిక వ్యవస్థపై మూడీస్
Oct 18 2013 12:43 AM | Updated on Sep 1 2017 11:44 PM
ముంబై: భారత్ ఆర్ధిక వ్యవస్థ 8 శాతం వృద్ధి సాధించడమన్నది ఇక గతమేనని రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. 2015 ద్వితీయార్థానికి దేశం 6.5 శాతం వృద్ధి రేటు సాధన సామర్థ్యానికి చేరుకోగలదని గురువారం వెలువరించిన తన తాజా నివేదికలో పేర్కొంది. భారత్ వృద్ధి రేటు ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరిపోయినట్లేనని, ఇంతకంటే దిగువకు పడిపోదని భావిస్తున్నామని కూడా పేర్కొంది. ఇక్కడ నుంచి ఇక రికవరీ బాట పడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అయితే నాల్గవ క్వార్టర్ నుంచీ పెట్టుబడులు పెరగాల్సి ఉంటుందని మూడీస్ ఆర్థికవేత్త గ్లాన్ లివీన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Advertisement
Advertisement