కొనసాగిన బుల్‌ రికార్డులు | Sakshi
Sakshi News home page

కొనసాగిన బుల్‌ రికార్డులు

Published Tue, Mar 5 2024 4:59 AM

Sensex, Nifty scale fresh record highs, rise for fourth day in a row - Sakshi

సూచీలకు నాలుగో రోజూ లాభాలే 

ఇంధన, బ్యాంకింగ్‌ షేర్లకు డిమాండ్‌

ముంబై: పరిమిత శ్రేణి ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ.., స్టాక్‌ సూచీల రికార్డుల ర్యాలీ సోమవారమూ కొనసాగింది. ఆకర్షణీయ స్థూల ఆర్థిక డేటా నమోదు కారణంగా అంతర్జాతీ య రేటింగ్‌ సంస్థ మూడీస్‌ 2024 ఏడాదికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటును 6.1% నుంచి 6.8 శాతానికి పెంచింది. మూడీస్‌ అప్‌గ్రేడ్‌ రేటింగ్‌తో బ్యాంకింగ్, ఇంధన, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్ద తు లభించింది.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 243 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్‌ చివరికి 66 పాయింట్ల లాభంతో 73,872 వద్ద ముగిసింది. ఒక దశలో 184 పాయింట్లు బలపడి 73,990 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 22,441 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 27 పాయింట్లు లాభంతో 22,406 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ముగింపు స్థాయిలు సరికొత్త రికార్డుతో పాటు వరుసగా నాలుగో రోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.564 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,543 కోట్ల షేర్లు కొన్నారు.

► డిజిట్‌ ఐపీవోకు గ్రీన్‌ సిగ్నల్‌
► డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది. ఈ ఇష్యూ కింద
రూ. 1,250 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్‌హోల్డర్లు 10.94 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయించనున్నారు.   

పబ్లిక్‌ ఇష్యూకి బ్లాక్‌బక్‌
లాజిస్టిక్స్‌ అంకుర సంస్థ బ్లాక్‌బక్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు 300 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 2,500 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు విక్రయించనుండగా, కొత్తగా మరికొన్ని షేర్లను కూడా సంస్థ జారీ చేయనున్నట్లు వివరించాయి. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సరీ్వసుల వ్యాపార విభాగాన్ని విస్తరించేందుకు బ్లాక్‌బక్‌ వినియోగించుకోనుంది. బ్లాక్‌బక్‌ను నిర్వహించే జింకా లాజిస్టిక్‌ సొల్యూషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్‌ పెట్టుబడులు ఉన్నాయి.

Advertisement
Advertisement