
న్యూఢిల్లీ: భారత్ 2019 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం తగ్గించింది. కేవలం 5.6 శాతమే వృద్ధి నమోదవుతుందని తాజా అంచనాల్లో పేర్కొంది. 2018లో భారత్ వృద్ధి 7.4 శాతం. వ్యవస్థలో వినియోగ డిమాండ్ పేలవంగా ఉందనీ, డిమాండ్ పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలు ఇవ్వకపోవడం తమ తాజా అంచనాలకు కారణమని మూడీస్ పేర్కొంది. 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తంగా భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను అక్టోబర్ 10వ తేదీన మూడీస్ 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించింది. భారత్ అవుట్‌లుక్‌ను కూడా గతవారం ‘స్టేబుల్’ నుంచి ‘నెగెటివ్’కు తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment