ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన 'మేక్ ఇన్ ఇండియా' గ్రాండ్ సక్సెస్ అయ్యిందట.
ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన 'మేక్ ఇన్ ఇండియా' గ్రాండ్ సక్సెస్ అయ్యిందట. దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వెల్లువెత్తుతున్నాయట. భారతదేశంలోకి ఎఫ్‌డీఐల ప్రవాహం 2016లో గరిష్ఠ స్థాయిని తాకింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. 2004 నుంచి పోలిస్తే ఈ ఏడాది కరెంట్ అకౌంట్ లోటు కంటే ఎఫ్‌డీఐ ప్రవాహాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీనివల్ల భారత్ మళ్లీ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని మూడీస్ తెలిపింది.
వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సరళీకరణ విధానాలు, మేకిన్ ఇండియా విజయవంతం కావడం లాంటివి ఎక్కువ నిధుల ప్రవాహానికి తోడ్పడాయని మూడీస్ పేర్కొంది. 2016 జనవరిలో నికర విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని, 12 నెలల కాలంలో 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఇప్పటివరకు వచ్చాయని చెప్పింది. కరెంట్ ఖాతా లోటును విదేశీ పెట్టుబడులు పూరిస్తున్నాయని మూడీస్ తెలిపింది.