
అంతర్జాతీయ వేదికపై భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో 'మేక్ ఇన్ ఇండియా' చొరవ అనన్య సామాన్యమని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రభావం చూపుతున్నాయో అని చెప్పే విషయాన్ని మై గవర్నమెంట్ ఇండియా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిని మోదీ రీ పోస్ట్ చేశారు.
మై గవర్నమెంట్ ఇండియా తన ఎక్స్ ఖాతాలో ఫోటో షేర్ చేస్తూ.. లోకల్ క్రాఫ్ట్ నుంచి గ్లోబల్ ఇంపాక్ట్ వరకు మేడ్ ఇన్ ఇండియా సక్సెస్ స్టోరీ అని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులు అద్భుతమైన ఆదరణ పొందుతున్నాయి. సైకిల్స్ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు ఇండియా వేగంగా దూసుకెళ్తోంది. అంటూ ట్వీట్ చేసింది.
మేక్ ఇన్ ఇండియా అనేది భారతదేశంలో ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి మరియు సమీకరించడానికి.. పెట్టుబడులను ప్రోత్సహించడానికి కంపెనీలను రూపొందించడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభమైన ఓ చొరవ. ఈ కార్యక్రమం ఉద్యోగ కల్పన, నైపుణ్య పెరుగుదల కోసం 25 ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకుంది. అంతే కాకుండా భారతదేశాన్ని ప్రపంచ రూపకల్పన, ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రారంభమైంది.
2014లో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా.. తయారీ రంగం వృద్ధి రేటును సంవత్సరానికి 12 శాతం నుంచి 14 శాతానికి పెంచడం. 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలో మిలియన్ల అదనపు ఉత్పాదక ఉద్యోగాలను సృష్టించడం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది. అనుకున్న విధంగానే తయారీ రంగంలో భారత్ వేగంగా దూసుకుపోతోంది. దీన్ని మోదీ ప్రశంసించారు
ఒకప్పుడు ఇండియా 80 శాతం మొబైల్ ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు 99.9 శాతం మనదేశంలోనే తయారవుతున్నాయి. యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా మొదలైన దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ ఎగుమతి అవుతున్నాయి. రక్షణ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, స్పేస్, ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్, సెమీ కండక్టర్ మొదలైన రంగాలలో గణనీయమైన పెట్టుబడులు సమకూరుతున్నాయి.
బీహార్ రాష్ట్రంలో తయారైన బూట్లు.. రష్యన్ ఆర్మీ ఉపయోగిస్తోంది. ఇది కూడా మేక్ ఇన్ ఇండియా చొరవతో భాగమే. గతేడాది బీహార్ ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ జతల బూట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ఈ కంపెనీల వల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు.
A glimpse of how 'Make In India' is propelling India's economy onto the global stage! https://t.co/xCfE4WYwmW
— Narendra Modi (@narendramodi) July 16, 2024