Global economic growth
-
అమెరికా సుంకాలు ప్రపంచానికే ప్రమాదం
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలనే నిర్ణయం వల్ల ప్రపంచ వృద్ధి ప్రభావం చెందుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ప్రకారం, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య భాగస్వాములు తమ సొంత టారిఫ్‌లను పెంచుతూ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇప్పటికే మందకొడిగా 2.7%గా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2025లో 0.3 శాతం పడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.ఇతర దేశాలు అనుసరిస్తే ప్రమాదంఅమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వివరాల ప్రకారం.. ప్రపంచ దిగుమతులపై 10 శాతం సుంకం, కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా వస్తువులపై 60 శాతం సుంకాన్ని విధించబోతున్నట్లు సమాచారం. ప్రపంచ స్థూల ఆర్థిక నమూనా ప్రకారం ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రపంచ వృద్ధి 0.3 శాతం తగ్గిపోనుంది. ఇతర దేశాలు కూడా ఇదే పంథాను అనుసరిస్తే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.కుంటుపడనున్న వృద్ధిరేటుఅభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2000 సంవత్సరం తర్వాత అత్యంత బలహీనమైన దీర్ఘకాలిక వృద్ధి సమస్యను ఎదుర్కొంటున్నాయని నివేదిక ఎత్తిచూపింది. అధిక రుణ భారాలు, బలహీనమైన పెట్టుబడులు, ఉత్పాదకతలో తగ్గుతున్న వృద్ధి, పెరుగుతున్న వాతావరణ మార్పుల ఖర్చుల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2025-26 ఏడాదికిగాను వృద్ధి రేటు 4%గా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్‌లోకి యాపిల్వచ్చే 25 ఏళ్లు మరిన్ని సవాళ్లుపెట్టుబడులను ప్రోత్సహించడానికి, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వివిధ దేశాలు మెరుగైన సంస్కరణలను అవలంబించాలని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ ఇందర్మిత్ గిల్ నొక్కి చెప్పారు. గత 25 సంవత్సరాలతో పోలిస్తే వచ్చే 25 ఏళ్లు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కఠినమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వీటిని తగ్గించుకునేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సైతం ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న అనిశ్చితుల గురించి హెచ్చరించింది. -
ప్రపంచ వృద్ధికి కీలకం.. ఏఐ
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ప్రపంచ ఎకానమీ వృద్ధికి, భౌగోళిక రాజకీయాలకు కృత్రిమ మేథ (ఏఐ) కీలక చోదకశక్తిగా ఉంటుందని భావిస్తున్నట్లు భారతి గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. ఏఐని ఉపయోగించుకోలేని కంపెనీలు, దేశాలు వెనుకబడిపోతాయని వ్యాఖ్యానించారు. ‘‘ఈ కొత్త టెక్నాలజీలో మంచి, చెడూ రెండూ ఉన్నాయి. దీనితో కొత్త సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ఇది దుర్వినియోగమయ్యే అవకాశాలు కూడా ఉన్నందున మరింత అప్రమత్తంగా వ్యవహరించాయి’’ అని చెప్పారాయన. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఒక అనుభవాన్ని ఆయన తెలియజేస్తూ... ‘‘దుబాయ్‌లోని మా సీనియర్ ఫైనాన్షియల్ అధికారికి నా గొంతును అనుకరిస్తూ, భారీ మొత్తంలో నగదును ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒక ఫేక్ కాల్ వెళ్లింది. ఆ అధికారి అప్రమత్తంగా వ్యవహరించి, ఫ్రాడ్‌ను వెంటనే గుర్తించడంతో ముప్పు తప్పింది. ఆ వాయిస్ రికార్డింగ్ విన్నప్పుడు అది అచ్చం నా గొంతులాగే ఉండటం నన్ను ఆశ్చర్యపర్చింది‘ అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇందులోని మంచిని వాడుకోవాలని, చెడు కోణం వల్ల తలెత్తే దు్రష్పభావాల నుంచి సమాజాన్ని కాపాడుకోవాలని మిట్టల్ చెప్పారు. అయితే, మొత్తం మీద కృత్రిమ మేథతో ఒనగూరే ప్రయోజనాలపై తాను ఆశావహంగా ఉన్నట్లు ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. వ్యాపారాలపరంగా చూస్తే రొటీన్‌గా, పునరావృతమయ్యే విధులను నిర్వర్తించే ఉద్యోగాల్లో ఏఐ వల్ల కోత ఉంటోందని, కానీ వాటికి సమానంగా కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయని మిట్టల్ వివరించారు. కాల్ సెంటర్లు, వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ మొదలైన వాటిలో ఏఐతో గణనీయంగా మార్పులు వస్తున్నాయని తెలిపారు. కృత్రిమ మేథ రాకతో కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాలు రాగలవని, వాటి నుంచి కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని మిట్టల్ ధీమా వ్యక్తం చేశారు.ఆదాయం పెరగాలిదేశీయంగా టెలికం మౌలిక సదుపాయాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటే సగటున యూజర్లపై వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) ఇంకా పెరగాల్సి ఉంటుందని మిట్టల్ చెప్పారు. ఇటీవలి పెంపు తర్వాత 2.5 డాలర్ల స్థాయిలో స్థిరపడిన ఏఆర్పీయు 5 డాలర్లకు చేరాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, ఎడారులు, అడవులతో నిండిపోయిన 25 శాతం భూభాగంలో ఉంటున్న 5 శాతం జనాభాకు ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదని మిట్టల్ చెప్పారు. అలాంటి ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు శాటిలైట్ కమ్యూనికేషన్ ఒక ’మ్యాజిక్ బులెట్’గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ‘తయారీ’లో మరిన్ని ఆవిష్కరణలు రావాలి: భారత్ ఫోర్జ్ ఛైర్మన్ బాబా కల్యాణి 2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలని భారత్ నిర్దేశించుకున్న నేపథ్యంలో గణనీయంగా వృద్ధి సాధించాలంటే తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలంటే నవకల్పనలు అత్యంత కీలకమని, నూతన సాంకేతికతలను స్థానికంగా అభివృద్ధి చేస్తే పరిశ్రమకు దన్నుగా ఉంటుందని పేర్కొన్నారు. ‘విదేశాల్లో తయారైన వాటిని కాపీ కొట్టడం కాకుండా మనం కూడా టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను రూపొందించాలి. ఇతర దేశాలు మన నుంచి కాపీ కొట్టేలా మన సొంత ఉత్పత్తులను తయారు చేయాలి‘ అని కల్యాణి చెప్పారు. ఏఐతో ఉత్పాదకత, సమర్ధత, ఉత్పత్తుల నాణ్యత మెరుగుపడగలదన్నారు.వైద్య విధానాల్లో వినూత్నత: అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీత రెడ్డివైద్యానికి సంబంధించి ప్రస్తుత టెక్నాలజీలను మరింత మందికి చేరువ చేసేందుకు వైద్య విధానాల్లో వినూత్నమైన ఆవిష్కరణలు అవసరమని అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీత రెడ్డి చెప్పారు. విదేశీ అధ్యయనాలపై ఆధారపడకుండా దేశీయంగా ఫండమెంటల్ రీసెర్చ్ జరగాలని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సంరక్షణ మెరుగుపడాలంటే పరిశోధనలపై గణనీయంగా వెచ్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జీడీపీలో ఒక్క శాతం కన్నా తక్కువే వెచ్చిస్తున్నామని సునీత రెడ్డి తెలిపారు. మరోవైపు, పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే సంచలనాత్మక మార్పులు కీలకమని డీసీఎం శ్రీరామ్ సీఎండీ అజయ్ శ్రీరామ్ చెప్పారు. జనధన యోజన, ఆధార్, మొబైల్ (జామ్ ట్రినిటీ) వంటి ప్రభుత్వ కార్యక్రమాలు రైతులతో కనెక్టివిటీ మెరుగుపడేందుకు గణనీయంగా తోడ్పడ్డాయని పేర్కొన్నారు. వ్యవసాయ ముడిపదార్థాలు, పనిముట్లు రైతులకు అందుబాటులోకి ఉండేందుకు ఈ–కామర్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. -
రానున్న దశాబ్దంలో భారత్‌దే హవా!
న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 20 శాతం వాటను కలిగి ఉంటుందని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఏఐఎంఏ సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని, ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో భారత్ ఎకానమీ జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న భరోసాను ఇచ్చారు. ప్రపంచ ఎకానమీకి భారత్ ఛోదక శక్తిగా ఆవిర్భవిస్తోందని పేర్కొన్నారు. ‘‘ఈ రోజు మనం చూస్తున్నది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక తరానికి ఒకసారి జరిగే మార్పు. కొన్ని సంవత్సరాల క్రితం భారత్ బలహీనమైన ఐదు దేశాల్లో ఉంది. బలహీనమైన ఐదు నుంచి ఒక దశాబ్దంలో మొదటి ఐదు స్థానాలకు చేరుకున్నాము’’అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరగాలి.. మూడు దశాబ్దాల్లో 9–10 శాతం వృద్ధి సాధించి, 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను మార్చాలని, ఆరోగ్య రంగం మెరుగుపడాలని, పోషకాహార ప్రమాణాలు పెరగాలని అమితాబ్ కాంత్ ఉద్ఘాటించారు. భవిష్యత్ వృద్ధిని సాధించడానికి భారత్‌లో రాష్ట్రాల పాత్ర కీలకమని అన్నారు. ‘‘అంటే దేశ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది’’ అని ఈ వివరించారు. ‘‘మనం వాటిని మార్చడం చాలా క్లిష్టమైనది. ఎన్ని అవరోధాలు ఎదురయినప్పటికీ, ఆయా రాష్ట్రాలు మానవ అభివృద్ధి సూచికలో మెరుగుదలకు కీలకమైన ఛోదక శక్తిగా మారడం చాలా ముఖ్యం’’ అని కాంత్ అన్నారు. భారతదేశ జనాభాలో 50 శాతం మంది వృద్ధిని సృష్టిలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే దిగువ 50 శాతం మంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక జీవన ప్రమాణాలను సాధించడానికి వ్యవసాయ కూలీ లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడుతున్నారని ఆయన తెలిపారు.ఈ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం చాలా ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందిన దేశమంటే... ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. ఆ స్థాయి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. -
ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాలు.. వాటి ఆదాయాలు
ఒకప్పుడు వేలు, లక్షల్లో పెట్టుబడిపెట్టి ప్రారంభించిన కంపెనీలు ప్రపంచంలోనే అత్యున్నత సంస్థలుగా ఎదిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. నిత్యం టెక్నాలజీలో వస్తోన్న మార్పులు, వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, యువతలో పెంపొందుతున్న నైపుణ్యాలు, కొత్త ఆవిష్కరణలు..వంటి ఎన్నో కారణాల వల్ల గ్లోబల్ ఎకానమీ దూసుకుపోతోంది. వివిధ రంగాలు వృద్ధిపథంలోకి వెళుతున్నాయి. దాంతో ఆయా రంగాల వార్షిక ఆదాయం క్రమంగా హెచ్చవుతోంది. అందులో ప్రపంచాన్ని శాసిస్తున్న కొన్ని రంగాల గురించి తెలుసుకుందాం.ఇంటర్నెట్ అండ్ డిజిటల్ అడ్వర్టైజింగ్వార్షిక ఆదాయం: రూ.377 లక్షల కోట్లు.ఇంటర్నెట్, ఇ-కామర్స్, క్లౌడ్ సేవలు, డిజిటల్ ప్రకటనలు..వంటి సర్వీసులతో ఈ ఆదాయం సమకూరుతోంది. ఈ రంగంలో గూగుల్(ఆల్ఫాబెట్), ఫేస్బుక్(మెటా), అమెజాన్ వంటి కంపెనీలు సేవలందిస్తున్నాయి.ఈ-కామర్స్వార్షిక ఆదాయం: రూ.419 లక్షల కోట్లు.అమెజాన్, అలిబాబా, ఈబే, ఫ్లిప్‌కార్ట్..వంటి కంపెనీలు ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైన రంగాలలో ఇది ఒకటి.ఆటోమొబైల్వార్షిక ఆదాయం: రూ.226 లక్షల కోట్లు.కార్ల తయారీ, విడిభాగాల తయారీ, సర్వీసు విభాగాల్లో ఈ రంగం వృద్ధి చెందుతోంది. టయోటా, ఫోక్స్‌వ్యాగన్, టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీసుజుకీ..వంటి కంపెనీలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఫార్మాస్యూటికల్స్ అండ్ మోడ్రన్ మెడిసిన్వార్షిక ఆదాయం: రూ.117 లక్షల కోట్లు.ఔషధ పరిశ్రమ, మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాల అభివృద్ధి, విక్రయాలు ఈ రంగాన్ని వృద్ధిబాటలు వేస్తున్నాయి. దేశీయంగా హైదరాబాద్ వంటి నగరాలు ఫార్మా తయారీకి ప్రధాన వనరుగా మారుతున్నాయి.స్మార్ట్ఫోన్లు, మొబైల్ టెక్నాలజీవార్షిక ఆదాయం: రూ.125 లక్షల కోట్లు.ప్రస్తుతం దాదాపు అందరివద్ద స్మార్ట్పోన్లున్నాయి. 3జీ టెక్నాలజీ వచ్చినపుడు అందుకు తగిన ఫోన్లు వాడారు. 4జీ ప్రారంభంలో తిరిగి ఆ టెక్నాలజీకి అనువైన ఫోన్లు వినియోగించారు. ఇప్పుడు 5జీ ఫోన్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రంగంలో యాపిల్, సామ్సంగ్, మోటోరోలా..వంటి కంపెనీలు సర్వీసులిస్తున్నాయి.విద్యుత్వార్షిక ఆదాయం: రూ.251 లక్షల కోట్లు.పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతున్న కొద్దీ విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కరెంట్‌కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. సంప్రదాయంగా దీని ఉత్పత్తికి బొగ్గు వాడుతున్నారు. కానీ వాతావరణ కాలుష్యం వల్ల క్రమంగా బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తున్నారు. దీనిస్థానే పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తున్నారు.క్లౌడ్ కంప్యూటింగ్వార్షిక ఆదాయం: రూ.33 లక్షల కోట్లు.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. అందుకోసం కంపెనీలు నిత్యం వాటి కౌడ్ సర్వీసులను అప్డేట్ చేస్తూంటాయి. ఈ రంగంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటివి సేవలందిస్తున్నాయి.టెలికమ్యూనికేషన్స్వార్షిక ఆదాయం: రూ.142 లక్షల కోట్లు.మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలు ఈ రంగం పరిధిలోకి వస్తాయి. టెలికమ్యూనికేషన్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది.పర్సనల్ కంప్యూటింగ్వార్షిక ఆదాయం: రూ.41 లక్షల కోట్లు.ఇంట్లో ఉపయోగించే కంపూటర్లు, వాటి సర్వీసులు, ల్యాప్‌టాప్‌లు, అనుబంధ సాఫ్ట్వేర్ విక్రయాలు పర్సనల్ కంప్యూటింగ్ మార్కెట్ కిందకు వస్తాయి. ఈ రంగంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, లెనోవో, హెచ్‌పీ..వంటి కంపెనీలు దూసుకుపోతున్నాయి.సోషల్ మీడియా ప్లాట్ఫామ్లువార్షిక ఆదాయం: రూ.12 లక్షల కోట్లు.ఈ రంగంలో పేస్బుక్(మెటా), ట్విటర్, టిక్‌టాక్..వంటి కంపెనీలు సర్వీసులు అందిస్తున్నాయి. ఈ ప్లాట్ఫామ్ల్లో ప్రకటనలు, డేటా మానిటైజేషన్ ద్వారా ఆదాయం వస్తోంది.ఇదీ చదవండి: ఏడాదిలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంస్ట్రీమింగ్ సేవలువార్షిక ఆదాయం: రూ.8.3 లక్షల కోట్లు.ఈ విభాగంలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్, స్పాటిఫై, ఆహా, అమెజాన్, జియో సినిమా వంటి స్ట్రీమింగ్ కంపెనీలు సర్వీసులు అందిస్తున్నాయి. సబ్స్క్రిప్షన్లు, ప్రకటనల ద్వారా ఇవి ఆదాయం పొందుతున్నాయి. -
మేక్ ఇన్ ఇండియా.. ప్రశంసించిన మోదీ
అంతర్జాతీయ వేదికపై భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో 'మేక్ ఇన్ ఇండియా' చొరవ అనన్య సామాన్యమని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రభావం చూపుతున్నాయో అని చెప్పే విషయాన్ని మై గవర్నమెంట్ ఇండియా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిని మోదీ రీ పోస్ట్ చేశారు.మై గవర్నమెంట్ ఇండియా తన ఎక్స్ ఖాతాలో ఫోటో షేర్ చేస్తూ.. లోకల్ క్రాఫ్ట్ నుంచి గ్లోబల్ ఇంపాక్ట్ వరకు మేడ్ ఇన్ ఇండియా సక్సెస్ స్టోరీ అని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులు అద్భుతమైన ఆదరణ పొందుతున్నాయి. సైకిల్స్ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు ఇండియా వేగంగా దూసుకెళ్తోంది. అంటూ ట్వీట్ చేసింది.మేక్ ఇన్ ఇండియా అనేది భారతదేశంలో ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి మరియు సమీకరించడానికి.. పెట్టుబడులను ప్రోత్సహించడానికి కంపెనీలను రూపొందించడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభమైన ఓ చొరవ. ఈ కార్యక్రమం ఉద్యోగ కల్పన, నైపుణ్య పెరుగుదల కోసం 25 ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకుంది. అంతే కాకుండా భారతదేశాన్ని ప్రపంచ రూపకల్పన, ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రారంభమైంది.2014లో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా.. తయారీ రంగం వృద్ధి రేటును సంవత్సరానికి 12 శాతం నుంచి 14 శాతానికి పెంచడం. 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలో మిలియన్ల అదనపు ఉత్పాదక ఉద్యోగాలను సృష్టించడం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది. అనుకున్న విధంగానే తయారీ రంగంలో భారత్ వేగంగా దూసుకుపోతోంది. దీన్ని మోదీ ప్రశంసించారుఒకప్పుడు ఇండియా 80 శాతం మొబైల్ ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు 99.9 శాతం మనదేశంలోనే తయారవుతున్నాయి. యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా మొదలైన దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ ఎగుమతి అవుతున్నాయి. రక్షణ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, స్పేస్, ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్, సెమీ కండక్టర్ మొదలైన రంగాలలో గణనీయమైన పెట్టుబడులు సమకూరుతున్నాయి.బీహార్ రాష్ట్రంలో తయారైన బూట్లు.. రష్యన్ ఆర్మీ ఉపయోగిస్తోంది. ఇది కూడా మేక్ ఇన్ ఇండియా చొరవతో భాగమే. గతేడాది బీహార్ ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ జతల బూట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ఈ కంపెనీల వల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు.A glimpse of how 'Make In India' is propelling India's economy onto the global stage! https://t.co/xCfE4WYwmW— Narendra Modi (@narendramodi) July 16, 2024 -
చైనాను భారత్ భర్తీ చేస్తుందనడం తొందరపాటే..
దావోస్: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని భావించడం.. తొందరపాటే (ప్రీమెచ్యూర్) అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం అన్నారు. భారత్ ఎకానమీ చాలా చిన్నదని పేర్కొంటూ, ప్రపంచ ఎకనామీని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడే దేశానికి లేదని పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందుతూ, పరిస్థితి (ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో) మున్ముందు మారే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్నే ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఒక నివేదిక సందర్భంగా రాజన్ విలేకరులతో మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్ధరణ జరిగితే, అది ఖచ్చితంగా ప్రపంచ వృద్ధి అవకాశాలను పెంచుతుందని అన్నారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు కార్మిక మార్కెట్‌తో పాటు హౌసింగ్ మార్కెట్ పరిస్థితులపై కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. అమెరికాను ప్రస్తావిస్తూ, అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదని, అయితే ధరలు కూడా తగ్గడం లేదని అన్నారు. ‘ఇదంతా అంధకారమా లేక వినాశనమా? బహుశా కాకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా పరిస్థితి అంతా మారిపోతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ‘‘2023లో ఇంకా 12 నెలల సమయం ఉంది. రష్యా యుద్ధం నిలిచిపోయినా, చైనా పురోగతి సాధించినా ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతుంది’’’ అని ఆయన విశ్లేషించారు. చైనా ఎకానమీ మార్చి, ఏప్రిల్ నుంచి రికవరీ సాధించే అవకాశం ఉందని కూడా రాజన్ అంచనా వేశారు. -
ప్రపంచ ఆర్థిక పరిణామాలపై జాగరూకత
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిణామాలు వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అవుట్‌లుక్‌ను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్వే నివేదిక శుక్రవారం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నవంబర్ నెలవారీ నివేదిక హెచ్చరించింది. అయితే కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాస) కట్టడిలోనే ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. బలమైన సేవల ఎగుమతులు, దేశానికి వచ్చే రెమిటెన్సులు ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు 100 బిలియన్ డాలర్లకు తాకే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్ పేర్కొన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. -
క్రూడ్‌కు కోవిడ్ దెబ్బ!
న్యూయార్క్: కోవిడ్–19 ప్రపంచ ఆర్థిక వృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందన్న భయాందోళనలు క్రూడ్ ధరలపై ప్రభావం చూపాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో గురువారం ఒక దశలో క్రూడ్ ధర 5 శాతానికి పైగా పడిపోయింది. ఈ వార్త రాసే రాత్రి 11 గంటల సమయానికి నైమెక్స్ లైట్ స్వీట్ ధర బ్యారెల్‌కు 47.10 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ 54.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ ధరలు వరుసగా 45.88 డాలర్లు, 50.39 డాలర్లనూ తాకడం గమనార్హం. నైమెక్స్ క్రూడ్‌కు కీలక మద్దతు 42 డాలర్లు కాగా, ఇదీ కోల్పోతే 26 డాలర్లను తాకే అవకాశం ఉంది. ఇదే జరిగితే క్రూడ్‌కు ఇది మూడేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. 250 బిలియన్ డాలర్ల నష్టం: పీహెచ్‌డీసీసీఐ ఇదిలావుండగా, పారిశ్రామిక చాంబర్ పీహెచ్‌డీసీసీఐ గురువారం కరోనా వైరెస్ వ్యాధిపై తమ అంచనాలను విడుదల చేస్తూ, దీనివల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటుపై 30 బేసిస్ పాయింట్ల ప్రతికూల ప్రభావం లేదా 250 బిలియన్ డాలర్ల మేర నష్టం జరుగుతుందని అంచనా వేసింది. సరఫరాపరమైన సమస్య ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతుందని వివరించింది. -
రెండో రోజూ నష్టాలే
కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఈక్విటీ మార్కెట్లు నష్టపోయాయి. వైరస్ కారణంగా చైనాలో పెరిగిపోతున్న మరణాలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై దీని ప్రతికూల ప్రభావాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. దీంతో మన మార్కెట్లతోపాటు నికాయ్, హాంగ్‌కాంగ్, సియోల్, తైపీ, జకార్తా మార్కెట్లు అర శాతం వరకు నష్టపోయాయి. సిడ్నీ 0.1 శాతంతో ముగియగా.. కరోనా బాధిత దేశం చైనాలోని షాంఘై మార్కెట్లు తొలుత అర శాతం నష్టపోగా, ఆ తర్వాత కోలుకుని అర శాతం లాభంతో ముగిశాయి. యూరోప్ మార్కెట్లు కూడా నష్టాలతోనే ఆరంభమయ్యాయి. చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు సోమవారం విడుదల కాగా, వినియోగ ఉత్పత్తుల ధరలు ఎనిమిదేళ్లలోనే అత్యధికంగా పెరిగాయి. ఆహార ఉత్పత్తుల ధరలు 20 శాతం పెరిగాయి. కరోనా వైరస్ ప్రభావం ద్రవ్యోల్బణ గణాంకాల రూపంలో ప్రతిఫలించింది. చైనా వ్యాప్తంగా ముఖ్యమైన తయారీ కేంద్రాలను కూడా మూసేస్తున్నారు. యాపిల్‌కు సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్, వాహన దిగ్గజం టయోటాకూ సరఫరా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రసరించడంతో సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 40,980 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 373 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 67 పాయింట్ల నష్టంతో 12,031 వద్ద క్లోజయింది. ప్రధానంగా మెటల్, ఆటో రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఎంఅండ్ఎం 7 శాతం డౌన్ అత్యధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 7% నష్టపోయింది. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండడం భారీ నష్టాలకు దారితీసింది. టాటా స్టీల్ 6%, ఓఎన్జీసీ 3%, సన్‌ఫార్మా, హీరో మోటోకార్ప్ 2 శాతం చొప్పున క్షీణించాయి. లాభపడిన వాటిల్లో టీసీఎస్, బజాజ్‌ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. జనవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 6 శాతానికి పైగా తగ్గినట్టు సియామ్ గణాంకాలను విడుదల చేయడం ఆటో రంగ స్టాక్స్‌పై ప్రభావం చూపింది. కరోనా వైరస్ వల్ల మరణాలు సార్స్ మరణాలను దాటుతుండడం దాని తీవ్రతపై ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. -
1,300 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం!
అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 4వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో కీలక నిరోధ స్థాయి 1,300 డాలర్లను తాకింది. ఆర్థిక అనిశ్చితి వార్తల నేపథ్యంలో వారం మొత్తంలో నైమెక్స్‌లో పెరుగుతూ వచ్చిన పసిడి, ఆఖరిరోజు శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఆరు నెలల గరిష్టస్థాయి 1,300.35 డాలర్లను తాకింది. అయితే అటు తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాదాపు 21 డాలర్లు పతనమై, చివరకు కొంత కోలుకుని 1,286 డాలర్ల వద్ద ముగిసింది. దీనితో మొత్తంగా వారంలో పసిడి దాదాపు ఆరు డాలర్లు పెరిగినట్లయ్యింది. 1,300 డాలర్ల స్థాయిని తాకిన తర్వాత వెలువడిన అమెరికా డిసెంబర్ ఉపాధి అవకాశాల గణాంకాలు సానుకూలంగా ఉండడం, ఆర్థిక వ్యవస్థపై చిగురించిన ఆశలు పసిడి ఆరు నెలల గరిష్ట స్థాయి నుంచి కిందకు జారడానికి కారణమని నిపుణుల విశ్లేషణ. ఇక టెక్నికల్‌గా చూస్తే, 1,300 కీలక నిరోధ స్థాయి కావడాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ వారం కీలక పరిణామాలు... అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు (ప్రస్తుతం 2.25–2.5 శాతం శ్రేణి) తుది దశకు చేరుకుందనీ, రేటు పెంపు స్పీడ్ ఇకపై ఉండబోదని వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డాలర్ ఇండెక్స్ బలహీనతకూ దారితీస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో బుధవారం ఫెడ్ మినిట్స్ (డిసెంబర్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమావేశాల వివరాలు) వెల్లడికానున్నాయి. ఆమరుసటి రోజు ఫెడ్ చైర్మన్ పావెల్ కీలక ప్రకటన వెలువడనుంది. శుక్రవారం అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడవుతాయి. ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంబంధించి ఈ సందర్భంగా వెల్లడికానున్న అంశాల ఆధారంగా పసిడి ధర తదుపరి కదలికలు ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా రూపాయి కదలికలు ఆధారం... ఇక దేశీయంగా పసిడి కదలికలు డాలర్ మారకంలో రూపాయి విలువ మార్పులకు అనుగుణంగా ఉంటుందని విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన డాలర్ మారకంలో చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసిన రూపాయి ప్రస్తుతం 69పైకి (శుక్రవారం 69.72) కోలుకుంది. ఈ పరిణామం అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరిగినా దేశీయంగా ఈ మెటల్ ధరల కట్టడికి దోహదపడింది. ముంబై మార్కెట్లో శుక్రవారం 24, 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ.32,840, రూ.31,280 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ. 42,600గా ఉంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్‌లో పసిడి ధర శుక్రవారం 31,456 వద్ద ముగిసింది. -
ఈ ఏడాది భారత వృద్ధి 5.6%
వచ్చే ఏడాది 6.4 శాతం ఐఎంఎఫ్ అంచనాలు వాషింగ్టన్: భారత్ ఈ ఏడాది 5.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. వచ్చే ఏడాది 6.4 శాతం వృద్ధి సాధ్యమవుతుందని వివరించింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఎగమతులు, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయని, వృద్ధిరేటు పరుగులు పెడుతోందని పేర్కొంది. ఐఎంఎఫ్ రూపొందించిన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్(డబ్ల్యూఈఓ) ఈ వివరాలను వెల్లడించింది. అలాగే ద్రవ్యోల్బణం ఈ ఏడాది 7.8 శాతంగానూ, వచ్చే ఏడాది 7.5 శాతంగానూ ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. ఎన్నికల అనంతరం భారత్‌లో వాణిజ్య విశ్వాసం పెరుగుతోందని, తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ఫలితంగా వృద్ధి పెరుగుతోందని ఐఎంఎఫ్ పేర్కొంది. ఈ ఏడాది మిగిలిన మూడు నెలలు, వచ్చే ఏడాది వృద్ధి పరుగులు పెడుతుందని వివరించింది. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో మందగించిన వ్యవసాయ వృద్ధి ప్రభావాన్ని పెరుగుతున్న ఎగుమతులు, పెట్టుబడులు భర్తీ చేశాయని పేర్కొంది. ఎన్నికల అనంతరం భారత్‌లో ప్రాదుర్భవించిన వాణిజ్య విశ్వాసం భవిష్యత్‌లో అవసరమైన వ్యవస్థాగత సంస్కరణలకు తగిన ఊతాన్ని ఇచ్చిందని తెలిపింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాల కంటే మందగిస్తుందని పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్న తాత్కాలిక సమస్యలు దీనికి కారణమని వివరించింది. సంక్షోభాల ప్రభావం కారణంగా యూరో దేశాల్లో కూడా రికవరీ బలహీనంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.