మూడీస్ తో భారత్ లాలూచీ..!
మూడీస్ తో భారత్ లాలూచీ..!
Published Fri, Dec 23 2016 1:09 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
దేశ ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి గురించి రేటింగ్స్ ఇచ్చే దిగ్గజ సంస్ధ మూడీస్ పై విమర్శలు గుప్పించిన భారత్.. ఆ సంస్ధతో లాలూచీ పెట్టుకోవడానికి ప్రయత్నించిందా?. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక పురోభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అందుకు కారణం భారతీయ బ్యాంకులేనని పలుమార్లు మూడీస్ పేర్కొంది.
మూడీస్ వ్యాఖ్యలపై స్పందించిన భారత్.. సంస్ధ రేటింగ్స్ ఇచ్చే విధానంలో ఉన్న తప్పుల కారణంగానే భారత్ ఆర్ధికంగా వృద్ధి చెందుతోందన్న విషయాన్ని మూడీస్ గుర్తించలేకపోతోందని పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ లో మూడీస్ కు లేఖ రాసిన ఆర్ధికశాఖ క్రమంగా భారత్ లో క్రమంగా తగ్గుతున్న అప్పుల భారాన్ని సంస్ధ గుర్తించడం లేదని ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కానీ అందుకు విభిన్నంగా స్పందించిన మూడీస్.. ప్రఖ్యాత మీడియా సంస్ధ రూటర్స్ షోలో భారత్ కు భారీగా అప్పులున్నాయని, దేశ జాతీయ బ్యాంకులు సులువుగా స్ధిమితాన్ని కోల్పోతాయని మళ్లీ పేర్కొంది. దీంతో మూడీస్ రేటింగ్స్ పై భారత్ మరోసారి అసహనం వ్యక్తం చేసింది.
భారతీయ బ్యాంకులు 136 బిలియన్ డాలర్ల లోన్లను ఇచ్చాయని అదే వారి కొంపముంచే అవకాశం ఉందని మూడీస్ చెప్పింది. అయితే, ఈ విషయంపై మూడీస్, భారత ఆర్ధికశాఖలు ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఓ రేటింగ్ సంస్ధకు భారత ఆర్ధిక శాఖ లేఖ రాయడంపై ఆర్ధిక శాఖ మాజీ అధికారి అరవింద్ మయారం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రేటింగ్ సంస్ధలపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశమే లేదని చెప్పారు.
అప్పుల బాధలు
గత రెండేళ్లుగా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధికవ్యవస్ధల్లో భారత్ మొదటి స్ధానంలో ఉంది. అయితే, ఒక్కసారిగా పెరిగిన వృద్ధి రేటు ప్రభుత్వ రెవెన్యూను పెంచుకునేలా చేసింది. భారత్ వృద్ధి కదలికలను క్షుణ్ణంగా పరిశీలించిన మూడీస్ భారత్ కు బీఏఏ3 రేటింగ్ ను ఇచ్చింది. అప్పుల బాధలు పడే దేశాలకు ఇచ్చే రేటింగులలో బీఏఏ3 ఆఖరిది.
తమ సంస్ధ ఇచ్చిన రేటింగ్ లపై చర్చించేందుకు ఆర్ధిక శాఖ కార్యాలయానికి వచ్చిన మూడీస్ ప్రతినిధితో ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తో సమావేశమయ్యారు. సమావేశం మొత్తం మూడీస్ రేటింగ్స్ గురించి ఇరువురు పెద్ద ఎత్తున చర్చించినట్లు సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి చెప్పారు. సమావేశం ముగిసిన అనంతరం భారత్ రేటింగ్స్ లో ముందుకు పోవడానికి మరికొద్ది సంవత్సరాలు పడుతుందని సదరు మూడీస్ ప్రతినిథి మీడియాతో పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఏ ప్రాతిపదికన ఓ దేశానికి రేటింగ్స్ ఇస్తారో మూడీస్ భారత అధికారులకు వివరించింది.
లాలూచీ
అప్పుల బాధలు కలిగిన దేశంగా భారత్ కు రేటింగ్ ఇవ్వడంపై మరోసారి భారత్ మూడీస్ ప్రతినధికి ఈ మెయిల్ చేసింది. జపాన్, పోర్చుగల్ లాంటి దేశాలు వాటి ఆర్ధిక వ్యవస్ధ పరిమాణం కంటే రెండు, మూడు రెట్లు అధికంగా అప్పులు కలిగి ఉన్నా మంచి రేటింగ్స్ ఇవ్వడంపై ప్రశ్నించింది. 2004 తర్వాత భారత అప్పులు క్రమంగా తగ్గుతూ వస్తున్నా ఆ విషయం మాత్రం రేటింగ్స్ లో ఎందుకు కనిపించడంలేదని వాదించింది.
భారత్ కు సంబంధించి మూడీస్ తన పద్దతిని మార్చుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన మూడీస్ భారత్ కేవలం అప్పులు కలిగివుండటం మాత్రమే కాకుండా, అప్పులు ఇచ్చే స్ధితిలో కూడా వెనుకబడి ఉందని సమాధానంగా పంపింది. మూడీస్ ఈ మెయిల్ కు స్పందనగా ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ మూడీస్ కు ఆరు పేజీల లేఖను రాశారు. భారత ఆర్ధిక వ్యవస్ధ గురించిన కొన్ని కీలక అంశాలను అందులో ప్రస్తావించారు. భారత్ కు మూడీస్ ఇస్తున్న రేటింగ్ లు ప్రస్తుత పరిస్ధితికి అద్దం పట్టేలా ఉండాలని కోరారు.
Advertisement
Advertisement