
న్యూఢిల్లీ: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి (2023 నవంబర్ నాటి) వృద్ధి అంచనాలను 6.6% నుంచి 8 శాతానికి పెంచుతున్నట్లు రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. పటిష్ట దేశీయ వినియోగం, మూలధన వ్యయా లు తమ అంచనాల పెంపునకు కారణంగా పేర్కొంది. జీ20 దేశాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు వివరించింది.
వచ్చే ఏడాది 6.8 శాతమే: క్రిసిల్
కాగా, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే రానున్న ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 6.8 శాతంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనావేసింది. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యలోటు కట్టడికి చర్యలు వంటి అంశాలు వృద్ధి స్పీడ్‌కు బ్రేకులు వేస్తాయని విశ్లేíÙంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును క్రిసిల్ 7.6 శాతంగా అంచనావేస్తోంది.