భారత్ రేటింగ్పై ఎన్పీఏల ప్రభావం: మూడీస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య భారత్ సావరిన్ క్రెడిట్ రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ పేర్కొంది. మొండి బకాయిల సమస్య పరిష్కారంలో ప్రభుత్వం నుంచి తగిన చొరవలు అవసరమని అభిప్రాయపడింది. మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ కష్టమవుతున్న తరుణంలో బడ్జెట్ కేటాయింపులకన్నా అధికంగా... భారీ మూలధన కల్పన విషయంలో ప్రభుత్వం నుంచే తగిన చర్యలు అవసరమని అభిప్రాయపడింది. వచ్చే నాలుగేళ్లలో బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధనం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2015 ఏప్రిల్‌లో మూడీస్ భారత్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే రేటింగ్‌ను ‘బీఏఏ3’గానే ఉంచింది. ‘చెత్త’స్థాయికి ఇది ఒక మెట్టు అధికం.