భారత్ రేటింగ్ ‘స్థిరం’: మూడీస్ | Moody's retains stable outlook on sovereign rating | Sakshi
Sakshi News home page

భారత్ రేటింగ్ ‘స్థిరం’: మూడీస్

Published Thu, Mar 12 2015 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

భారత్ రేటింగ్ ‘స్థిరం’: మూడీస్

భారత్ రేటింగ్ ‘స్థిరం’: మూడీస్

ముంబై: భారత్ సార్వభౌమ పరపతి రేటింగ్‌కు ఇప్పుడున్న స్థిరమైన అంచనాను (స్టేబుల్ అవుట్‌లుక్) కొనసాగిస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్ దిగ్గజం మూడీస్ బుధవారం ప్రకటించింది. ‘బీఏఏ3 (స్టేబుల్ అవుట్‌లుక్)’ రేటింగ్‌లో మార్పులేవీ లేవని పేర్కొంది. ప్రధానంగా మెరుగైన ప్రైవేటు పొదుపు రేటు, భారీ, విభిన్న రంగాలతో కూడిన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు మూడీస్ విశ్లేషకుడు (సావరీన్ క్రెడిట్) అత్సి సేథ్ పేర్కొన్నారు.

కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చని తాజా నోట్‌లో ఆయన అంచనా వేశారు. అదే విధంగా సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 2016 మార్చిచివరినాటికి 6.5 శాతానికి పెరగవచ్చని (ఈ ఏడాది మార్చి నాటికి అంచనా 4.6 శాతం) అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ అతితక్కువ స్థాయి తలసరి ఆదాయాలు, బలహీన మౌలిక సదుపాయాలను చూస్తే.. భవిష్యత్తులో వృద్ధికి మరింత ఆస్కారం ఉందని సేథ్ పేర్కొన్నారు. స్టేబుల్ అవుట్‌లుక్ అంటే రానున్న కాలంలో రేటింగ్ పెంపునకు(అప్‌గ్రేడ్) ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లే లెక్క.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement