మూడో ఫ్రంట్ వస్తే మూడినట్లే: మూడీస్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మూడవ ఫ్రంట్ అధికారంలోకి వస్తే, పెట్టుబడులు తరలిపోయే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేస్తోంది. ఆర్థిక రికవరీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఉమ్మడి ఆర్థిక సంస్కరణల ఎజెండా లేకుండా చిన్న, ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటయ్యే సంకీర్ణం వల్ల ఆర్థిక వ్యవస్థ పలు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ ఘోష్ పేర్కొన్నారు.
వృద్ధికి వచ్చే ఎన్నికలు కీలకం: స్టాన్‌చార్ట్ కాగా భారత్ వృద్ధి తీరుకు రానున్న ఎన్నికలు కీలకమని స్టాండెర్డ్ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.7 శాతం వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతానికి మెరుగుపడుతుందని కూడా విశ్లేషించింది.