RK Naidu Shaadi Mubarak Telugu Movie Got Top Rank In IMDB List - Sakshi
Sakshi News home page

Shaadi Mubarak: ఐఎమ్‌డీబీలో టాప్‌ రేటింగ్‌

Published Tue, Mar 9 2021 4:56 PM | Last Updated on Tue, Mar 9 2021 8:07 PM

Shaadi Mubarak Got To Rating At IMDB - Sakshi

గత శుక్రవారం(మార్చి 5) రిలీజ్ అయిన షాదీ ముబారక్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9.1 రేటింగ్ తో టాప్ పోజీషన్ లో నిలిచింది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా కి ప్రేక్షకులు ఆదరణ లభించింది. బుల్లితెరమీద  స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సాగర్ వెండితెర పై కూడా ఈ సారి బలమైన కంటెంట్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఏ సినిమా కయినా కంటెంట్ బేస్ చేసుకొని రేటింగ్ ని అందించే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ ( ఐ ఎమ్ డి బి) షాదీ ముబారక్ కు 9.1 రేటింగ్ ని అందించడం పై యూనిట్  హార్షం వ్యక్తం చేసింది. 

పెళ్ళి కోసం ఇండియాకి వచ్చిన ఎన్నారై కి పెళ్ళి చూపుల్లో ఎదురైన అనుభవాలను  సునిశిత హాస్యంతో మలిచారు దర్శకుడు పద్మశ్రీ. సీరియస్ పాత్రల నుండి ఒక పక్కింటి కుర్రాడు పాత్రకి  సాగర్ మారిన తీరు పై ప్రశంసలు దక్కుతున్నాయి. తొలి చిత్రం తోనే తెలుగులో చాలా మంచి పేరును తెచ్చుకుంది దృశ్య . ఈ అమ్మాయి చలాకీ తనం తెరమీద మరో సాయిపల్లవిని గుర్తు చేసింది.

రొమాంటిక్ కామెడీ జానర్ లో జంట మద్య కెమిస్ట్రీ కుదిరితేనే ఆ కథ లో ప్రేక్షకులు ఇన్వాల్వ్ కాగలరు.  సున్నిపెంట మాధవ్, తుపాకుల సత్యభామ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ లవ్ లో పడతారు. సిట్యువేషనల్ గా వచ్చే కామెడీ తో  ఫ్యామిలీ మొత్తం చూసి ఆస్వాదించతగిన విధంగా రూపొందించడంతో ‘‘ షాదీ ముబారక్’’ ఆల్ టైం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారింది.  తమ కంటెంట్ కి టాప్ రేటింగ్ దక్కడం చిత్ర యూనిట్ కి కొత్త ఉత్సాహం అందించింది.  సాగర్  షాదీ ముబారక్ ఇచ్చిన కిక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో రాబోతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement