shadi mubarak
-
బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం! మంత్రి కొండా సురేఖ
వరంగల్: బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీగార్డెన్, రైల్వే గేట్ శాంతినగర్‌లోని రాజశ్రీగార్డెన్‌లో రెవెన్యూశాఖ, సీ్త్ర శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, విద్యార్థికి 4జీ మొబైల్, దివ్యాంగులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బలహీన వర్గాల ప్రజల మొహా ల్లో చిరునవ్వులు చూడటమే సీఎం రేవంత్‌రెడ్డి ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు ఇక్బాల్ అహ్మద్, బండి నాగేశ్వర్రావు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి శారద, కార్పొరేటర్లు, నేతలు కొత్తపెల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో భాగంగా ప్రైవేట్ ఆస్పత్రులు, అప్రూవల్, మెటర్నల్ డెత్ సర్వేలెన్స్ రిపోర్ట్‌పై బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాతృ, శిశుమరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భిణులు ఆస్పత్రుల్లో నమోదు చేసుకున్న వెంటనే వారికి నిరంతరం సేవలందించాలని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్‌రావు, డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ నిర్మల పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆ రెండింటి డీఎన్ఏ ఒక్కటే -
బడ్జెట్లో కానరాని ‘కల్యాణలక్ష్మి’
సిద్దిపేట జోన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బడ్జెట్లో విస్మరించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారు లకు నగదుతోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదన్నారు. అలాగే మైనార్టీలకు పెద్దపీట వేస్తామని చెప్పి నిధుల కేటాయింపులో మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. బడ్జెట్లో మైనార్టీలకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, నేడు రూ.2,200 కోట్లే కేటాయించిందని, రెండు నెలలుగా వృద్ధులకు పింఛన్లు కూడా అందడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.12 వేల కోట్ల ఆర్థిక సాయం చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయానికి కనీసం 16 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సిద్దిపేట ప్రాంతానికి చెందిన మైనార్టీల ఉమ్రా యాత్ర కోసం తన సొంత డబ్బు వెచ్చిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. -
TS: ‘కల్యాణ’ కానుకేదీ?
నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాములకు చెందిన ఇప్ప లక్ష్మయ్య తన కుమార్తె వివాహం 2022 జూన్‌లో చేశాడు. ఆ తర్వాత కల్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించాడు. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కల్యాణ కానుక అందలేదు. క్రమం తప్పకుండా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు నెలరోజుల్లో వస్తుందని చెబుతున్నా.. అలాంటి నెలలెన్నో గడిచిపోతుండటంతో లక్ష్మయ్య సాయంపై ఆశలు వదులుకునే పరిస్థితికి చేరుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన బి.అమృత తన కుమార్తె వివాహం గతేడాది ఫిబ్రవరి 9న చేసింది. వెంటనే కల్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. పథకం అర్హత, సాయం కోసం అధికారులను అడిగినప్పుడల్లా.. వివరాలను సంబంధిత అధికారులకు పంపించామని, ప్రభుత్వం నిధులు ఇచి్చనప్పుడు అందిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సాయం అందుతుంతో లేదో ఆమెకు అర్థం కావడం లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి పథకం పడకేసింది. కుమార్తెల వివాహాలు చేసి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. ఏడాది, ఏడాదిన్నర దాటుతున్నా ‘కల్యాణ’ కానుక జాడ లేక పోవడంతో..సమీప భవిష్యత్తులోనైనా వస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి రోజు నాటికే వధువు కుటుంబానికి రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని (కానుక) అందించాలనేది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశం. దరఖాస్తు ప్రక్రియలో నిబంధనలు, క్షేత్రస్థాయిలో విచారణ నేపథ్యంలో అర్జీదారులంతా వివాహం తర్వాతే దరఖాస్తు సమర్పిస్తున్నారు. అలా సమర్పించిన దరఖాస్తును పరిశీలించి విచారణ పూర్తి చేసిన తర్వాత అర్హతలను ఖరారు చేసి, లబ్దిదారు కుటుంబానికి చెక్కు రూపంలో సాయం అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పథకాలకు నిధుల విడుదల నిలిచిపోగా.. క్షేత్రస్థాయిలో దరఖాస్తు పరిశీలన కూడా ఆగిపోయింది. ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన అర్జీదారులకు ఎలాంటి సమాచారం అందడం లేదు. దాదాపు నాలుగు నెలలుగా రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చెక్కుల పంపిణీ జరగడం లేదు. రెండు పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా 1,04,613 దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నట్లు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విడుదల కాని నిధులు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి లక్షకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో ఆ మేరకు బకాయిలు కూడా పేరుకుపోయాయి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. 2023–24 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలాఖరు నాటికి రెండు పథకాలకు సంబంధించి 1,32,046 దరఖాస్తులు అందగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మరో 69,715 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ దరఖాస్తులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జత (క్యారీ ఫార్వర్డ్) చేశారు. క్యారీ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులతో 2023–24 డిసెంబర్ నెలాఖరు నాటికి వచ్చిన వాటిని కలిపితే మొత్తం దరఖాస్తులు 2,01,761. వీటిలో 97,148 దరఖాస్తులను అధికారులు విడతల వారీగా పరిష్కరించి క్లియర్ చేశారు. వీటికి సంబంధించి ప్రభుత్వం రూ.972.60 కోట్లు విడుదల చేసింది. కానీ 1,04,613 దరఖాస్తులకు సంబంధించి రూ.1,047.68 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గత నాలుగు నెలలుగా ఎన్నికల కోడ్, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిధుల విడుదల జరగక చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. కాగా ప్రస్తుత బకాయిల్లో బీసీ, ఈబీసీ కేటగిరీల వారి దరఖాస్తులకు సంబంధించినవే సగానికిపైగా ఉండడం గమనార్హం. కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చా? లేదా? రాష్ట్రంలో గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికాకంలోకి వచ్చింది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు గత ప్రభుత్వ హయాంలోనే అమల్లో ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్..అధికారంలోకొస్తే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకాలకు నిధుల విడుదల నిలిచిపోవడంతో బంగారం సంగతి సరే బకాయిల సంగతి ఏమిటనే ఆందోళన, ఆయోమయం దరఖాస్తుదారుల్లో నెలకొంది. ఏడాదిన్నరకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో..ఆయా పథకాలకు అర్హతలున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేటగిరీ వారీగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ బకాయిలు (రూ.కోట్లలో) సంక్షేమ శాఖ పెండింగ్ దరఖాస్తులు చెల్లించాల్సిన బకాయిలు బీసీ, ఈబీసీ 55541 556.29 మైనారిటీ 23599 236.28 ఎస్సీ 14267 142.90 ఎస్టీ 11206 112.21 మొత్తం 104613 1047.68 -
‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’
సాక్షి,కూకట్పల్లి(హైదరాబాద్): పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించడం దేశంలో ఎక్కడా లేదని, అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 15 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించామని, రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు. పింఛన్ డబ్బుల్లో రూ.1900 కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.100 మాత్రమే ఇస్తుందన్నారు. అంతా తామే ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారాలతో బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, చేతనైతే అభివృద్ధిలో పోటీ పడాలని బీజేపీ నేతలకు ఆయన సూచించారు. దేశంలో జాతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో అయినా ప్రస్తుత పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుందని బీజేపీ నాయకులకు హితవు పలికారు. నేడు దేశం అంతా కరెంటు లేక సతమతం అవుతుంటే.. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నేడు తెలంగాణలో 24గంటల విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష బాబురావు, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. చదవండి: దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్ -
ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు
హైదరాబాద్: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండూ కష్టమైనవే. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆరే ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో భాగంగా 10 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.8,421 కోట్లు ఖర్చు చేశాం. ఇగ పెళ్లి చేసుకోవడానికి, ఆ తర్వాత పిల్లల బారసాల చేసుకోవడానికి ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే నిర్మిస్తోంది’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్లో రూ.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, వాణీదేవిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తొలుత ఎస్పీ రోడ్డులోని ప్యాట్నీ నాలాపై రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పాటిగడ్డలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను, ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రూ.45 కోట్లతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను అల్లంతోటబావి, బ్రాహ్మణవాడీలలో ప్రారంభించారు. పాటిగడ్డలో ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం నుంచి పని చేయించుకోవడం, ప్రజలకు ముందుండి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా సనత్‌నగర్ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. పాటిగడ్డలో ఆర్‌అండ్‌బీకి చెందిన 1,200 గజాల స్థలంలో ఇక్కడివారికి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించాలని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఇక్కడి పేదలు బర్త్ డేలు, వివాహాలు.. ఇలా చిన్నా పెద్దా శుభకార్యాలు చేసుకోవాలంటే వేల రూపాయల కిరాయిలు చెల్లిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక్కడ చక్కటి ఫంక్షన్ హాల్ నిర్మించాల్సిందిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ అడిగిన వెంటనే రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే దసరా నాటికి ప్రారంభించుకుందామని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా కేసీఆర్ నాయకత్వంలో రహదారులు, మంచినీటి వ్యవస్థలు బాగుపడుతున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్లు టి.మహేశ్వరి శ్రీహరి, కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు అరుణ, తరుణి, శేషుకుమారి, రూప, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్‌కుమార్ యాదవ్, రాజయ్య, శేఖర్ ముదిరాజ్, శ్రీనివాస్‌గౌడ్, అఖిల్ అహ్మద్ పాల్గొన్నారు. -
ఓటీటీలో హిట్ అయిన ఆ సినిమా.. ఇక తెలుగు ఛానెల్లో..
ఒటిటీలో హిట్ అయిన సినిమాలు మరోసారి టీవీ చానెల్లో ప్రసారం చేయడం అనేది ట్రెండ్‌కు జీ తెలుగు శ్రీకారం చుట్టింది. అదే క్రమంలో ఇప్పటికే ఓటీటీ వేదికగా మంచి పేరు తెచ్చుకున్న షాదీ ముబారక్ సినిమాని జీ తెలుగు చానెల్ తమ వీక్షకులకు అందిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి ఇంట్లో ఉండే వినోదాన్ని ఆస్వాదించాలనే ఆలోచన ప్రజల్లో కలుగుతున్న నేపధ్యంలో వారిని ఆకట్టుకోవడానికి సాగర్ ర్ కే నాయుడు నటించిన ’షాదీ ముబారక్’ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు శిరీషలు నిర్మాతలు కాగా పద్మశ్రీ దర్శకత్వం వహించాడు. కధ సంక్షిప్తంగా... మాధవ్ (సాగర్ ర్ కే నాయుడు) ఆస్ట్రేలియాలో నివసిస్తాడు. అతడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి, వధువును సెలక్ట్ చేసుకునే క్రమంలో హైదరాబాద్ వస్తాడు. అక్కడే ఓ మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో వివరాలు చెప్తాడు. ఈ క్రమంలో మ్యారేజ్ బ్యూరో ఓనర్ కూతురు అయిన తుపాకుల సత్యభామ (దశ్య రఘునాథ్) పరిచయం అవుతుంది. తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో తానే బ్యూరో వ్యవహారాలు చూస్తున్న, ఆమె మాధవ్‌తో కలిసి పెళ్లి చూపులకు హాజరవుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సత్యభామ మాధవ్ ప్రేమలో పడతారు. మరి వారి ప్రేమ ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి పీటలు ఎక్కిందా? సత్యభామ మాధవ్ ఒక్కటయ్యారా లేదా అనేది షాదీ ముబారక్ కధ. -
‘షాదీ ముబారక్’ సరికొత్త రికార్డు
గత శుక్రవారం(మార్చి 5) రిలీజ్ అయిన షాదీ ముబారక్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9.1 రేటింగ్ తో టాప్ పోజీషన్ లో నిలిచింది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా కి ప్రేక్షకులు ఆదరణ లభించింది. బుల్లితెరమీద స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సాగర్ వెండితెర పై కూడా ఈ సారి బలమైన కంటెంట్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఏ సినిమా కయినా కంటెంట్ బేస్ చేసుకొని రేటింగ్ ని అందించే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ ( ఐ ఎమ్ డి బి) షాదీ ముబారక్ కు 9.1 రేటింగ్ ని అందించడం పై యూనిట్ హార్షం వ్యక్తం చేసింది. పెళ్ళి కోసం ఇండియాకి వచ్చిన ఎన్నారై కి పెళ్ళి చూపుల్లో ఎదురైన అనుభవాలను సునిశిత హాస్యంతో మలిచారు దర్శకుడు పద్మశ్రీ. సీరియస్ పాత్రల నుండి ఒక పక్కింటి కుర్రాడు పాత్రకి సాగర్ మారిన తీరు పై ప్రశంసలు దక్కుతున్నాయి. తొలి చిత్రం తోనే తెలుగులో చాలా మంచి పేరును తెచ్చుకుంది దృశ్య . ఈ అమ్మాయి చలాకీ తనం తెరమీద మరో సాయిపల్లవిని గుర్తు చేసింది. రొమాంటిక్ కామెడీ జానర్ లో జంట మద్య కెమిస్ట్రీ కుదిరితేనే ఆ కథ లో ప్రేక్షకులు ఇన్వాల్వ్ కాగలరు. సున్నిపెంట మాధవ్, తుపాకుల సత్యభామ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ లవ్ లో పడతారు. సిట్యువేషనల్ గా వచ్చే కామెడీ తో ఫ్యామిలీ మొత్తం చూసి ఆస్వాదించతగిన విధంగా రూపొందించడంతో ‘‘ షాదీ ముబారక్’’ ఆల్ టైం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారింది. తమ కంటెంట్ కి టాప్ రేటింగ్ దక్కడం చిత్ర యూనిట్ కి కొత్త ఉత్సాహం అందించింది. సాగర్ షాదీ ముబారక్ ఇచ్చిన కిక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో రాబోతున్నాడు. -
‘షాదీ ముబారక్’ మూవీ రివ్యూ
టైటిల్ : షాదీ ముబారక్ నటీనటులు : సాగర్, దృశ్య రఘునాథ్, రాహుల్ రామకృష్ణ, హేమ, రాజశ్రీ నాయర్, బెనర్జీ, అదితి మ్యాకాల్ తదితరులు దర్శకత్వం : పద్మశ్రీ నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్ బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫి : శ్రీకాంత్ నరోజ్ ఎడిటింగ్ : మధు చింతల విడుదల తేది : మార్చి 5, 2021 బుల్లితెరపై ఆర్కే నాయుడుగా నటించి కుటుంబ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు ‘మొగలిరేకులు’ సీరియల్ ఫేం సాగర్. గతంలో ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాతో వెండితెరపై తళుక్కుమన్న అతడు హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘షాదీ ముబారక్’. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మించగా, పద్మశ్రీ దర్శకత్వం వహించారు. ఆకట్టకునే టైటిల్‌తో తెరకెక్కిన మూవీ ట్రైలర్‌పై పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతోమంచి అంచనాలే ఏర్పడ్డాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది? హీరోగా సాగర్ ఎంత వరకు సక్సెస్ అయ్యాడు? అన్న అంశాలు రివ్యూలో గమనిద్దాం. కథ మాధవ్ (సాగర్) ఫారిన్లో ఉంటాడు. ఆస్ట్రేలియాలో నివసించే అతడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి, వధువును సెలక్ట్ చేసుకునే క్రమంలో హైదరాబాద్ వస్తాడు. అక్కడే ఓ మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో వివరాలు చెప్తాడు. ఈ క్రమంలో మ్యారేజ్ బ్యూరో ఓనర్ కూతురు అయిన తుపాకుల సత్యభామ (దృశ్య రఘునాథ్) పరిచయం అవుతుంది. తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో తానే బ్యూరో వ్యవహారాలు చూస్తున్న, ఆమె మాధవ్‌తో కలిసి సత్యభామ పెళ్లి చూపులకు హాజరవుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సత్యభామ, మాధవ్ ప్రేమలో పడతారు. మరి వారి ప్రేమ ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి పీటలు ఎక్కిందా? సత్యభామ- మాధవ్ ఒక్కటయ్యారా లేదా తెలియాలంటే షాదీ ముబారక్ చూడల్సిందే. నటీనటులు బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్లో నటించి లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న సాగర్..మంచి కథతో హీరో అయ్యాడు.మాధవ్ పాత్రలో ఒదిగిపోయాడు. స్క్రీన్‌పై బాగా కనిపించడమే కాకుండా మంచి ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించాడు. ఇక హీరోయిన్ దృశ్య రఘునాథ్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది.రాహుల్ రామకృష్ణ, హేమంత్, భద్రం తమదైన కామెడీతో నవ్వించారు. హేమ, రాజశ్రీ నాయర్, బెనర్జీ, అదితి మ్యాకాల్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. విశ్లేషణ దర్శకుడు పద్మశ్రీకి తొలి సినిమా ఇది. కానీ ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్నట్లుగా కథను తెరకెక్కించాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సాధించాడని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్లో ఓ అందమైన కథను ప్రేక్షకులకు అందించాడు. యువతను అకర్షించే అంశాలైన రొమాన్స్, కామెడీని తన కథలో మిస్ కాకుండా చూసుకున్నాడు. ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సింపుల్ కథని చక్కగా తెరపై చూపించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ సునీల్ కశ్యప్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. మధు చింతల ఎడిటింగ్, శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
హిట్ అయితే నేను కూడా లక్కీయే
మొగలి రేకులు ఫేమ్ వీర్‌సాగర్ (ఆర్కే నాయుడు), దృశ్యా రఘునాథ్ జంటగా పద్మశ్రీ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘షాదీ ముబారక్’. నేడు విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ రోజు సాగర్ నా దగ్గరకు వచ్చి ఈ ట్రైలర్ చూపించినప్పుడు బాగుందని చెప్పా. అక్కడ నుంచి కష్టాలు మొదలయ్యాయి. సినిమా చూసినప్పుడు కొన్ని కరెక్ష¯Œ ్స చెప్పడమే కాకుండా ఫైనాన్షియల్‌గా కూడా కాస్త సపోర్ట్ చేసి, సినిమాను పూర్తి చేశాను. సాధారణంగా స్క్రిప్ట్ దగ్గర నుంచి ట్రావెల్ అయినప్పుడే మా బ్యానర్ పేరు ఇస్తారు. కానీ సినిమా బాగుందని మా బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేస్తే నేను కూడా లక్కీ. పద్మశ్రీ ఇంట్రెస్టింగ్గా సినిమాను తీశారు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు నవ్వుతూ వెళతారనే గ్యారంటీ ఇస్తా’’ అన్నారు. ‘‘దిల్’ రాజు ఎంతో సపోర్ట్ చేశారు’ అన్నారు పద్మశ్రీ. ‘‘దిల్’రాజుగారి సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంతవరకు వచ్చేది కాదు’’ అన్నారు కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి. అందుకే సినిమాల్లోకి వచ్చాను: వీర్ సాగర్ మాట్లాడుతూ – ‘‘సీరియల్స్‌లో నేను పెద్ద పాత్రలు పోషించాను. ఎన్ని సీరియల్స్ చేసినా అంత కన్నా పెద్ద పాత్రలు అయితే రావు. అందుకే సినిమాల్లోకి వచ్చాను. మొదట్లో కొత్తగా అనిపించింది. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఒక ఎన్నారై యువకుడు పెళ్లిచూపుల కోసం ఇండియా వస్తాడు. అక్కడ ఓ మ్యారేజ్ బ్యూరోకి చెందిన ఓ అమ్మాయిని కలుస్తాడు. వారి ప్రయాణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ‘షాదీ ముబారక్’ సినిమా కథ’’ అన్నారు. -
చిట్‌చాట్ విత్ షాదీ ముబారక్ హీరో
-
‘కల్యాణ’ కమనీయం ఏదీ.?
సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్): పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు లబ్ధిదారుల దరి చేరడం లేదు. పెళ్లి పందిరిలోనే అర్హులైన పేదింటి ఆడపిల్లకు చెక్కులు అందిస్తామన్న ప్రభుత్వం పథకం సాగదీత పథకంగా మారింది. వివాహం జరిగి నెలలు గడుస్తున్నా డబ్బులు చేతికి అందకపోవడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు నిరుత్సాహానికి గురవుతున్నారు. పెండింగ్‌లో వందలాది దరఖాస్తులు.. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కోసం గడిచిన ఏడాది నుంచి ఇప్పటి వరకూ 3771 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1361 మందికి డబ్బులు అందజేశారు. మిగిలిన వాటిలో 23 తహసీల్దార్ పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి. తహసీల్దార్ వెరిఫికేషన్ స్థాయిలో 357 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఎమ్మె ల్యే పరిశీలనలో 410, ఎమ్మెల్యే ఆప్రూవల్ అనంతరం మంజూరు స్థాయిలో 1583 ఉన్నారు. ఇటీవల 37 దరఖాస్తుల డబ్బులు మంజూరై ట్రెజ రీలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నిధులు మంజూరు కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం.. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం వివాహ కానుకగా మొదట రూ.51వేలు అందించింది. తర్వాత కానుకను రూ.1,00, 116/– కు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు మురిసిపోయారు. కాని చెక్కుల మంజూరులో తీవ్ర జా ప్యం జరుగుతుండడంతో నిరాశలో మునిగారు. మరోవైపు ఈ పథకాల దరఖాస్తులు తహసీల్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వర కూ వివిధ దశల్లో పెండింగ్‌లో ఉంటున్నాయి. పథకంపై ఆశలు పెట్టుకుని ఆడ పిల్లల పెళ్లిలు పూర్తి చేసిన తల్లిదండ్రులు తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. దీనికి తోడు చెక్కుల కోసం నిత్యం తహసీల్ కార్యాల యం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డబ్బులు మంజూరు చేసి ఆదుకోవాలని కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులు కోరుతున్నారు. కళ్యాణలక్ష్మీ ఆలస్యంతో సరోజ స్పందన రెబ్బెన మండలంలోని గోలేటి పంచాయతీ పరిధి భగత్‌సింగ్ నగర్. జనరల్ స్టోర్స్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గతేడాది డిసెంబర్లో రెండో కూతురుకి వివాహం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం డబ్బులు వస్తాయనే భరోసాతో అప్పు చేసి మరీ కల్యాణం జరిపించింది. వివాహ అనంతరం పథకం కోసం దరఖాస్తు చేసుకోగా నేటికీ ఒక్క పైసా కూడా రాలేదు. దాదాపు 10 నెలలుగా ఈ కానుక కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమస్య ఒక్క సరోజది మాత్రమే కాదు. జిల్లాలో గతేడాది నుంచి వివాహాలు జరిపిన అర్హులైన ప్రతి తల్లిదండ్రులది. నిధులు మంజూరు కావాల్సి ఉంది జిల్లాలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తమే. అయితే జిల్లాస్థాయిలో చాలా తక్కువ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేయాల్సిన దరఖాస్తుల సంఖ్యే అత్యధికంగా ఉంది. ఇటీవల 37 మందికి బిల్లులు మంజూరు కాగా లబ్ధిదారుల ఖాతాలో జమయ్యాయి. మిగిలిన వాటి కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపాం. మంజూరు కాగానే లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమవుతాయి. – సిడాం దత్తు, ఆర్డీవో -
కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ
-
బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో బతుకమ్మ చీరల పం పిణీ, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, జూనియర్ గ్రామకార్యదర్శుల నియామకం, పంచా యతీ ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల భూసేకరణ, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకుల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం లో భాగంగా అర్హుల ఎంపిక కోసం ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లోగా జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను తెలపాలని సీఎస్ ఆదేశిం చారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపామని, ఐదారు రోజుల్లోగా పంపిణీ పూర్తయ్యేలా కార్యక్రమం రూపొందించుకోవాలన్నారు. -
మహాకూటమి కాదు.. మాయకూటమి
గాదిగూడ(నార్నూర్): ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఏర్పడిన కూటమి మాహాకూటమి కాదని.. అది మాయకూటమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ విమర్శించారు. శనివారం గాదిగూడ మండలం పర్పువాడ–కే, అర్జుని, కొలాంగూడ, రాముగూడ, లోకారి–బి, ఖడ్కి, గాదిగూడ, మేడిగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని శాఖలను సరిదిద్దడానికే ఏడాది పట్టిందని అన్నారు. మిగతా మూడన్నర ఏళ్లలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. పేద అమ్మాయి పెళ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి రెండు పంటలకు రూ.8వేలు అందజేస్తుందని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీపీ రాథోడ్ గోవింద్‌నాయక్, జెడ్పీటీసీ రూపావతిజ్ఞానోబా పుస్కర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేస్రం దేవురావు, మేస్రం హన్మంతరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉర్వేత రూప్‌దేవ్, నాయకులు మోతే రాజన్న, హైమద్, జాకురుల్లాఖాన్, మీరాబాయి, షెక్ హుస్సెన్, నర్శింగ్‌మెరే, సయ్యద్‌ఖాశీం, తదితరులు పాల్గొన్నారు. -
పేదల పెళ్లిళ్లపై ఎన్నికల పిడుగు
సాక్షి,సిటీ బ్యూరో: కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌లకు ఎన్నికల గ్రహణం పట్టింది. గత నెల రోజులుగా దరఖాస్తుల పరిశీలన పెండింగ్‌లో పడటంతో ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సాయం అందుతుందన్న ఆశతో ముహుర్తాలు ఖరారు చేసుకున్న తల్లితండ్రులకు ఆర్థిక ఇబ్బందులు, కన్నీళ్లు తప్పడం లేదు. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం, సవాలక్ష కొర్రీల కారణంగా వ«ధువుకు చేయూత అంతంతమాత్రంగా మారింది. కొత్త దరఖాస్తులతో పాటు పరిశీలనకు నోచుకున్న దరఖాస్తుల అమోదం, మంజూరు కూడా పెండింగ్‌లో పడింది. ఇప్పటికే మంజూరైన ఆర్థిక చేయూతకు ట్రెజరీ అధికారులు కొర్రీలు వేస్తున్నారు. దీంతో బిల్లులు విడుదల కావడం లేదు. ఫలితంగా ఎప్పటి మాదిరిగానే నిరుపేద తల్లిదండ్రులు అప్పులు చేసి ఇబ్బందుల పాలవుతున్నారు ఎన్నికల ప్రభావం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలపై ఎన్నికల విధుల ప్రభావం పడింది. రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ఆయా పథకాల అమలును పట్టించుకోవడం లేదు. దీనికితోడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ శాఖకు గుడిబండగా మారింది. ఇప్పటికే రెవెన్యూ శాఖ సిబ్బందికి ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధృవీకరణ పత్రాల జారీ, పింఛన్లు ఇతరత్రా విధులతో పాటు ఎన్నికల డ్యూటీ పేరుతో అదనపు భారం పడింది. దీంతో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. నత్తనడక.. హైదరాబాద్–రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల అమలు నత్తలకు నడక నేర్పిస్తున్నాయి మొత్తం 8 వేల మంది కుటుంబాలు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా అందులో రెండు వేల కుటుంబాలకు మాత్రమే ఆర్థిక చేయూత అందినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. షాదీ ముబారక్ పథకం కింద సుమారు రెండువేల కుటుంబాలు ఆర్థిక చేయూత కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు కేవలం ఐదు వందల కుటుంబాలకు మాత్రమే ఆర్థికసాయం అందినట్లు తెలుస్తోంది. మిగిలిన సగం దరఖాస్తులు వివిధ దశలో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. మళ్లీ అప్పుల పాలు ప్రభుత్వం నిరుపేద కుటుంబాల్లో ఆడ బిడ్డల వివాహాలకు చేయూత అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు పథకాలను ప్రకటించింది. రెండేళ్ల క్రితం సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసిన పథకాలను ఒక గొడుగు కిందకు తేవాలన్న లక్ష్యంతో పథకం పూర్తి స్థాయి అమలు బాధ్యతలను రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఈ నేపథ్యంలో తహసీల్దార్లకు దరఖాస్తుల విచారణ బాధ్యత అప్పగించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అదనపు పనిభారం, బిజీ షెడ్యూల్‌తో దరఖాస్తులను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో పడటంతో ఆర్థిక చేయూత అంతంత మాత్రంగా మారింది. కొద్దిరోజుల క్రితం రెవెన్యూ శాఖ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై దృష్టి సారించి విచారణ ప్రక్రియ వేగవంతం చేసినా ఎన్నికల షెడ్యూల్ కారణంగా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. తాజాగా రెండు పథకాల అమలుపై ఎన్నికల ప్రభావం పడటంతో ఇప్పట్లో ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. -
తెలంగాణ వచ్చాకే చిరునవ్వులు
మెదక్ మున్సిపాలిటీ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ముస్లింల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మెదక్ పట్టణంలో ముస్లింలకు రంజాన్ పండగ సందర్భంగా దుస్తులను పంపిణీ చేశారు. క్రిస్టల్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. షాది ముబారక్ ద్వారా యువతుల పెళ్లిళ్లకు రూ.10,0116లు అందజేయడం జరుగుతుందన్నారు. మెదక్‌లో రూ.2కోట్లతో షాదిఖానా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈద్గా, మసీదుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.2కోట్లు అందిస్తుందని తెలిపారు. మెదక్‌లో ప్రస్తుతం ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాకుండా మరొకటి బాలికలకోసం మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 1250 మంది ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం మెదక్ జిల్లాను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. మెదక్ జిల్లా అయినప్పటికీ సంగారెడ్డి కేంద్రంగా కార్యకలాపాలు సాగేవన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెదక్‌ను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. రూ.100కోట్లతో మెదక్ పట్టణానికి ఫుట్‌పాత్, నాలుగు వరుసల రోడ్డు, బట్టర్ఫ్లై లైట్లతో సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణంలో రూ.50 కోట్లతో మిషన్ భగీరథ పనులు నడుస్తున్నట్లు తెలిపారు. చేగుంట రోడ్డును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పిట్లం చెరువు, గోసముద్రంంలను మీనిట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింలకు నెలరోజుల్లో ఆఖరి సఫారి వాహనం అందిస్తామని తెలిపారు. ప్రతియేడు సిద్దిపేట జిల్లా నుండి 5వేల మంది నిరుపేద ముస్లింలను ఉమ్ర పంపించడం జరుగుతుందన్నారు. ఈ యేడు నుంచి మెదక్ జిల్లా నుండి 5 వేల మంది నిరుపేద ముస్లింలను ఉమ్రకు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 260మంది పేద ముస్లింలకు రూ.1.30కోట్లను షాది ముబారక్ ద్వారా అందజేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుతున్నారని తెలిపారు. కవర్లను వాడబోమని మాటివ్వండి ప్లాస్టిక్ కవర్లను ఇకనుండి వినియోగించమని మాటివ్వాలని మంత్రి హరీశ్‌రావు ముస్లింలను కోరగా, వారు వాగ్ధానం చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రతియేడు దేశంలో ఎంతోమంది క్యాన్సర్‌తో చనిపోతున్నారని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి సూచించారు. మంగళవారం మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద గల బాలికల రెసిడెన్షియల్ బాలికల పాఠశాల అదనపు మౌలిక వసతుల కల్పన ప్రారంభించారు. ఈయేడు వందశాతం ఉత్తీర్ణత సాధించే గురుకుల పాఠశాలలకు రూ.1లక్ష నజారానా ఇస్తామన్నారు. అలాగే నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు చంద్రకళ, రాధా, బట్టి సులోచన, జ్యోతి, సలాం, ఆర్కెశ్రీనివాస్, కో అప్షన్ సభ్యుడు సాధిక్, నాయకులు హమీద్, షాహెద్, ముస్లిం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
చెల్లని ‘షాదీ’ చెక్కులు
తాండూరు: షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాల ద్వారా ఆడపడుచులకు ప్ర భుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇం దులో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, పెద్దే ముల్, తాండూరు మండలాలకు చెంది న ఆడపడుచుల వివాహాల అనంతరం ఈనెల 5న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మ హేందర్‌రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. యాలాల మండలానికి చెందిన 30 మం ది, తాండూరు మండలం 32, పెద్దేముల్ 13, బషీరాబాద్ 17 చెక్కులను మొత్తం 92 మంది రూ.58 లక్షల చెక్కులను పం పిణీ చేశారు. మంత్రి చేతుల మీదుగా కొంత మందికి అందించిన అనంతరం ఆయా మండలాల్లోని తహసీల్దార్లు లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశా రు. అయితే మంత్రి, అధికారులు పంపి ణీ చేసిన చెక్కులను తీసుకొని లబ్ధిదారులు తమ ఖాతాల్లో వేసేందుకు వెళితే.. చెక్కులు చెల్లవని బ్యాంకు అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని పలువురు లబ్ధిదారులు తాండూరు సబ్ కలెక్టర్ కార్యా లయంలో చెప్పుకొనేందుకు వెళ్లగా అక్క డి ఉద్యోగి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక విలేకరులకు తమ గోడును విన్నవించుకున్నారు. – యాలాల మండలం ముకుందాపూర్‌కు చెందిన లావణ్యకు పెద్దేముల్ మండలం జనగాం గ్రామానికి చెందిన వెంకటప్పతో గతేడాది వివాహం జరిగింది. కల్యాణలక్ష్మి పథకం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం రూ.51 వేలు చెక్కును మంజూరు చేసింది. మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఇటీవల చెక్కును అందుకున్నారు. మంగళవారం ఏడీబీ బ్యాంకులో చెక్కు వేసేందుకు వెళితే చెల్లదన్న సమాధానం అధికారుల నుంచి రావడంతో చేసేది లేక వెనుతిరిగారు. – యాలాల మండలం ముద్దాయిపేట్కు చెందిన వాసిద్‌ఖాన్, నసామా దంపతుల కుమార్తె నజ్నిన్ఖాతూన్ను పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన ముబీన్‌తో వివాహం అయ్యింది. షాదీ ముబారక్ కింద జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 5న చెక్కును ప్రభుత్వం నుంచి అందుకున్నారు. తీరా బ్యాంకుకు వెళితే చెక్కు చెల్లదంటూ అధికారులు చెప్పడంతో వారు ఆందోళన చెందారు. బ్యాంకర్లతో మాట్లాడతా.. షాదీముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం లేదు. ఈ పథకానికి సంబంధించిన చెక్కులు చెల్లవన్న బ్యాంకర్లతో మాట్లాడుతా. ఈవిషయమై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా. పథకాలకు సంబంధించి అందించిన చెక్కులనన్నీ.. డివిజన్ పరిధిలో పంపిణీ చేశాం. ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయమై విచారణ చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తాము. – అశోక్‌కుమార్, డీఏఓ, సబ్ కలెక్టర్ కార్యాలయం, తాండూరు -
కల్యాణలక్ష్మి దరఖాస్తులకు లైన్ క్లియర్
♦ అందుబాటులోకి ‘ఈపాస్’ సేవలు... ♦ ఉపకార వేతన దరఖాస్తుకు 30 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల దరఖాస్తులకు మార్గం సుగమమైంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో గత నెల పన్నెండో తేదీ నుంచి ఈపాస్‌లో సేవలు నిలిచిపోవడంతో విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ స్తంభించిన విషయం తెలిసిందే. కొత్తగా జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కావడం, వాటి పరిధిలోని గ్రామాలు, విద్యాసంస్థల వివరాలను వెబ్సైట్లో విభజించేందుకు ప్రభుత్వం సేవల్ని నిలిపివేసింది. తాజాగా ‘ఈపాస్’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు నెల రోజులపాటు కసరత్తు చేపట్టిన సాంకేతిక బృందం తాజాగా ప్రక్రియను పూర్తి చేసింది. 2016–17 విద్యాసంవత్సరంలో పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఫ్రెషర్స్‌తోపాటు రెన్యువల్(సీనియర్) విద్యార్థులు ఈపాస్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2014–15, 2015–16 విద్యాసంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులకు కూడా అధికారులు అవకాశం కల్పించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ఈపాస్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో కొందరి పెళ్లిళ్లు జరిగాయి. నిబంధనలకు లోబడి ఉన్నవారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే వీలుంది. దరఖాస్తు ప్రక్రియలో పెళ్లికూతురు తల్లి బ్యాంకు ఖాతా నంబర్‌ను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలి. లేకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోమని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద పంపిణీ చేసే నగదును నేరుగా ఆ ఖాతాలో జమ చేయనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతా నంబర్‌ను ప్రభుత్వం అనివార్యం చేసింది. -
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లపై ఏసీబీ నిఘా
హైదరాబాద్ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల నిర్వహణపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిరంతరం నిఘా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఈ పథకాలలో దళారుల ప్రమేయం లేకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టనుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలలో అవకతవకలు జరుగుతున్నట్లు ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. దీంతో అక్రమార్కుల ఆట కట్టించేందుకు ఏసీబీని రంగంలోకి దించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో లబ్ధిదారుల వివరాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేయగా భారీగా అవకతవకలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి కేసులు సైతం నమోదు చేశారు. పథకాలలో చోటు చేసుకుంటున్న అవకతవకలపై ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేశారు. దీనిపై లోతుగా చర్చించిన ప్రభుత్వ వర్గాలు పథకాలలో మునుముందు అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఏసీబీ గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక నుంచి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఏసీబీ నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడంతో పాటు త్వరలో టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రజల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
పుంజుకుంటున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీలకోసం కల్యాణలక్ష్మి, ముస్లింల కోసం షాదీముబాకర్ పథకాలు ప్రకటించింది. పథకాల ద్వారా నిరుపేద ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన అమ్మాయిల వివాహాలకు రూ. 51 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కఠినమైన నిబంధనల కారణంగా 2014-15లో పథకం గురించి అవగాహన, ప్రచారం కల్పించడంలో ఇబ్బందులు తలెత్తాయి. అయితే 2015-16లో నిబంధనలు సరళతరం చేయడం, లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించడంతో పథకం పుంజుకుంది. ఎస్సీ, మైనారిటీలో ప్రస్తుతం పురోగతి ఉండగా, ఎస్టీ శాఖలో వేగం పుంజుకోవాల్సి ఉంది. -
‘కల్యాణా’నికి రూ.280 కోట్లు
నిజామాబాద్‌కల్చరల్ : షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ. 280 కోట్లు కేటాయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్ ప్రాంగణంలో గల న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లాలో షాదీ ముబారక్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాదీ ముబారక్ పథకం కింద ఎంపికైన 15 మందికి మంత్రితోపాటు కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, మేయర్ సుజాత, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మంజూరు ఉత్తర్వులను అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద ఎస్సీ, ఎస్టీల కోసం కల్యాణలక్ష్మి, మైనారిటీల కోసం షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు వివాహం నిమిత్తం రూ. 51 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఎస్సీలు, మైనారిటీలకు రూ. 100 కోట్ల చొప్పున, ఎస్టీలకు రూ. 80 కోట్లు కేటాయించామన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 2.15 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేశామన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పేదవారికి రూ. 3.50లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఒకటో తేదీ నుంచి ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వసతిగృహాలు, మధ్యాహ్న భోజన పథకాలకు సన్న బియ్యం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫయీమ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగగంగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దాదాన్నగారి విఠల్‌రావు, టీఆర్ఎస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తారిక్ అన్సారి, నాయకులు రహమాన్,అక్తార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీల మనోభావాలతో ఆటలాడవద్దు
‘షాదీ ముబారక్’ వెబ్సైట్, ఫోన్ పనిచేయడం లేదు: షబ్బీర్ అలీ సాక్షి, నల్లగొండ: షాదీ ముబారక్ పథకం ద్వారా ముస్లిం మైనారిటీల మనోభావాలతో ఆటలాడవద్దని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రభుత్వానికి హితవు పలికారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ ఈ పథకం అమలుకు సంబంధించిన ఆన్లైన్ వెబ్‌సైట్‌గానీ, హెల్ప్‌లైన్ ఫోన్నంబరుగానీ పనిచేయడం లేదనీ, వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, ఈ నెల 23వ తేదీన టీపీసీసీ చీఫ్ పొన్నాల అధ్యక్షతన టి.కాంగ్రెస్ మైనారిటీ సెల్ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్ హాజరవుతారన్నారు. -
మోసం చేస్తే ఉసురు తగులుతుంది
ముస్లింలు పెళ్లి చేసుకుంటే డబ్బులిచ్చే షాదీ ముబారక్ పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే వాళ్ల వెబ్సైట్ పనిచేయడం లేదని ఆయన మండిపడ్డారు. అసలు షాదీ ముబారక్ పేరుమీద వెబ్‌సైటే లేదని, ఇది ముమ్మాటికీ ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. పేదలకు ఆశలు కల్పించి వాళ్లను మోసం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాళ్ల ఉసురు తగులుతుందని చెప్ఆపరు. పెళ్లిళ్లు చేసుకున్న ముస్లింలకు 51 వేలు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. ఆ డబ్బులు ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. -
అక్టోబర్ 2 నుంచి షాదీ ముబారక్
-
అక్టోబర్ 2 నుంచి ‘షాదీ ముబారక్’
సాక్షి, హైదరాబాద్: మైనారిటీ వర్గాల పేద యువతుల వివాహాలకు రూ. 51 వేల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ‘షాదీ ముబారక్’ పేరుతో టీ సర్కారు కొత్త పథకాన్ని ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి అమలులోకి రానున్న ఈ పథకం మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద లబ్ధి పొందే యువతులకు 18 ఏళ్లు, ఆపై వయస్సు ఉండాలి. మైనారిటీ వర్గానికి, తెలంగాణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. వధువు తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2 లక్షలలోపు ఉండాలి. ఈ ఏడాది అక్టోబర్ 2న, ఆ తర్వాత జరిగే వివాహాలకే ఈ పథకం వర్తిస్తుంది. ఏదైనా మీసేవ సెంటర్ ద్వారా http://epasswebsite.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. పెళ్లి సమయానికి వధువు బ్యాంకు ఖాతాలో నగదును జమ చేస్తారు. దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన పత్రాల వివరాలు.. మీసేవ కేంద్రం ద్వారా జారీ చేసిన పుట్టిన తేదీ, కుల ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకునే నాటికి ఆర్నెల్లలోపు జారీ అయిన ఆదాయ ధ్రువీకరణ పత్రం వధూవరుల ఆధార్ కార్డుల స్కాన్ కాపీ వధువుకు సంబంధించిన బ్యాంక్ పాస్‌బుక్ స్కాన్ కాపీ అందుబాటులో ఉంటే వివాహ ఆహ్వాన పత్రిక పెళ్లి ఫొటో పంచాయతీ/ చర్చి/ మసీదు/ సంస్థలు జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రం పదోతరగతి హాల్‌టికెట్ నంబర్, పాసైన సంవత్సరం (ఇవి తప్పనిసరి కాదు)