పర్సువాడ–కేలో మాట్లాడుతున్న ఎంపీ గోడం నగేశ్
గాదిగూడ(నార్నూర్): ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని ఓడించడానికి ఏర్పడిన కూటమి మాహాకూటమి కాదని.. అది మాయకూటమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ విమర్శించారు. శనివారం గాదిగూడ మండలం పర్పువాడ–కే, అర్జుని, కొలాంగూడ, రాముగూడ, లోకారి–బి, ఖడ్కి, గాదిగూడ, మేడిగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని శాఖలను సరిదిద్దడానికే ఏడాది పట్టిందని అన్నారు. మిగతా మూడన్నర ఏళ్లలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. పేద అమ్మాయి పెళ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 అందిస్తున్నట్లు తెలిపారు.
రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి రెండు పంటలకు రూ.8వేలు అందజేస్తుందని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీపీ రాథోడ్ గోవింద్‌నాయక్, జెడ్పీటీసీ రూపావతిజ్ఞానోబా పుస్కర్, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేస్రం దేవురావు, మేస్రం హన్మంతరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉర్వేత రూప్‌దేవ్, నాయకులు మోతే రాజన్న, హైమద్, జాకురుల్లాఖాన్, మీరాబాయి, షెక్ హుస్సెన్, నర్శింగ్‌మెరే, సయ్యద్‌ఖాశీం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment