మోసం చేస్తే ఉసురు తగులుతుంది
ముస్లింలు పెళ్లి చేసుకుంటే డబ్బులిచ్చే షాదీ ముబారక్ పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే వాళ్ల వెబ్సైట్ పనిచేయడం లేదని ఆయన మండిపడ్డారు. అసలు షాదీ ముబారక్ పేరుమీద వెబ్సైటే లేదని, ఇది ముమ్మాటికీ ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు.
పేదలకు ఆశలు కల్పించి వాళ్లను మోసం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్కు వాళ్ల ఉసురు తగులుతుందని చెప్ఆపరు. పెళ్లిళ్లు చేసుకున్న ముస్లింలకు 51 వేలు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. ఆ డబ్బులు ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.