పుంజుకుంటున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీలకోసం కల్యాణలక్ష్మి, ముస్లింల కోసం షాదీముబాకర్ పథకాలు ప్రకటించింది. పథకాల ద్వారా నిరుపేద ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన అమ్మాయిల వివాహాలకు రూ. 51 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కఠినమైన నిబంధనల కారణంగా 2014-15లో పథకం గురించి అవగాహన, ప్రచారం కల్పించడంలో ఇబ్బందులు తలెత్తాయి.
అయితే 2015-16లో నిబంధనలు సరళతరం చేయడం, లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించడంతో పథకం పుంజుకుంది. ఎస్సీ, మైనారిటీలో ప్రస్తుతం పురోగతి ఉండగా, ఎస్టీ శాఖలో వేగం పుంజుకోవాల్సి ఉంది.