సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో బతుకమ్మ చీరల పం పిణీ, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, జూనియర్ గ్రామకార్యదర్శుల నియామకం, పంచా యతీ ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల భూసేకరణ, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకుల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఎస్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం లో భాగంగా అర్హుల ఎంపిక కోసం ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లోగా జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను తెలపాలని సీఎస్ ఆదేశిం చారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపామని, ఐదారు రోజుల్లోగా పంపిణీ పూర్తయ్యేలా కార్యక్రమం రూపొందించుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment