saris
-
బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో బతుకమ్మ చీరల పం పిణీ, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, జూనియర్ గ్రామకార్యదర్శుల నియామకం, పంచా యతీ ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల భూసేకరణ, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకుల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం లో భాగంగా అర్హుల ఎంపిక కోసం ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లోగా జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను తెలపాలని సీఎస్ ఆదేశిం చారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపామని, ఐదారు రోజుల్లోగా పంపిణీ పూర్తయ్యేలా కార్యక్రమం రూపొందించుకోవాలన్నారు. -
బతుకమ్మ చీరలు సిద్ధం
-
బతుకమ్మ చీరలు సిద్ధం
రెండు నెలల్లో 3.75 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి సిరిసిల్ల: తెలంగాణ ఆడపడుచుల కోసం బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. బతు కమ్మ కానుకగా చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం పనిలో పనిగా రాజన్న సిరిసిల్ల జిల్లా నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ చీరల ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 15న బతుకమ్మ చీరల ఆర్డర్లను రాష్ట్ర జౌళిశాఖ అధికారులు ఇవ్వగా.. నూలు కొనుగోలు చేసి జూన్ 30న వస్త్రోత్పత్తిని ప్రారం భించారు. 52 మ్యాక్స్ సంఘాలు, మరో 312 చిన్న తరహా కుటీర పరిశ్రమలు, 10,200 మంది కార్మికులు, 1,852 మంది ఆసాములు రేయింబవళ్లు శ్రమించి 3.75 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేశారు. ఇంకా మర మగ్గాలపై బతుకమ్మ చీరల వస్త్రం ఉంది. కానీ అధికారులు మంగళవారం వర కు బతుకమ్మ చీరల వస్త్రాన్ని సేకరించారు. దీంతో సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్ల నేతన్నల కు నేరుగా రూ.30 కోట్ల మేరకు ఉపాధి కూలీ రూపంలో లభించింది. ఒక్కో కార్మికుడికి నెలకు రూ.16,000 మేరకు లభించాయి. సాంచాల మీద ఉన్న బట్టను ఇచ్చేందుకు మరోవారం రోజుల గడువు ఇవ్వాలని సిరిసిల్ల నేతన్నలు కోరుతున్నారు. కానీ, అధికారులు వస్త్రం కొనుగోళ్లను ఆపివేశారు. -
చీర చిన్నదాయె.. బిల్లు భారమాయె
ఏలూరు (టూటౌన్) : జిల్లా మహిళా సమాఖ్య, మండల సమాఖ్యల మధ్య సీఎం సభ సందర్భంగా కొనుగోలు చేసిన చీరలు చిచ్చురగిల్చాయి. చిన్న సైజు, నాసిరకం చీరలు అంటగట్టి ఒక్కో చీరకు రూ.250 చెల్లించాలని జిల్లా సమాఖ్య ఒత్తిడి తెస్తోందని మండల,గ్రామ సంఘాల అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గత నెల 16న జిల్లాలో పర్యటించిన సందర్భంగా మహిళా సమాఖ్యలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా మహిళా సమాఖ్య నేతృత్వంలో గ్రామ సంఘాల అధ్యక్షులు ఆకర్షణగా కనిపించేందుకు ఒకే రంగు చీరలు ధరించాలని జిల్లా సమాఖ్య భావించింది. ఈ మేరకు జూలై 14న జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జీవమణి రూ.2.25 లక్షలు సమాఖ్య నుంచి అడ్వాన్సుగా తీసుకుని 820 చీరలు కొనుగోలు చేశారు. 15వ తేదీ రాత్రికి వాటిని మండల సమాఖ్యలకు పంపి అక్కడి నుంచి గ్రామ సంఘాలకు పంపారు. అయితే పంపిన చీరలు నాసిరకంగా ఉండడం, చిన్నసైజువి కావడంతో కొన్ని మండలాల్లోని గ్రామ సంఘాల అధ్యక్షులు వాటిని తిరస్కరించారు. మరికొన్ని మండలాల్లో గ్రామ సంఘాలకు ఆ చీరలు సకాలంలో చేరకపోవడంతో ధరించలేదు. జిల్లా సమాఖ్య నుంచి పంపిణీ చేసిన చీర ఒక్కింటికి రూ.250 చెల్లించాలని కొన్నిరోజుల కిందట గ్రామ సంఘాల అధ్యక్షులకు సమాచారం అందించారు. తాము చీరలను తిరస్కరించినా డబ్బు ఎలా అడుగుతున్నారని కొందరు, నాసిరకం, చిన్నసైజు చీరలు పంపి రూ.250 ఎలా చెల్లించమంటారని మిగిలి న వారు జిల్లా సమాఖ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఈ చీరల కొనుగోలు బిల్లుల లెక్కలు కార్యాలయానికి ఇవ్వకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంత జరిగినా డీఆర్డీఏ అధికారులు మాత్రం తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చీరల కొనుగోలు విషయంలో అధికారులు అనుమతిలేనట్లు తెలిసింది. అయినా రూ.2.25 లక్షలను జిల్లా సమాఖ్య నుంచి ఎలా ఖర్చు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ చీరల కొనుగోలు వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ రకం చీరలను కొనుగోలు చేసి ఎక్కువ ధర వసూలు చేయాలని చూస్తున్నట్టు సభ్యులు ఆరోపిస్తున్నారు. చీరలను తిరస్కరించాం చీరలు నాణ్యత లోపించటంతో గ్రామ సంఘం అధ్యక్షురాళ్లు తిరస్కరించా రు. వీరవాసరం మండలానికి 10 చీరలు పంపి రూ. 2,500 వసూలు చేయమని చెప్పారు. చీరలు ఆఫీసులోనే ఉన్నాయి. - ఎం.కృపావతి, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి చీరల పొడవు తగ్గింది చింతలపూడి మండలానికి 70 చీరలు పంపారు. అవి పొడువు తక్కువగా ఉన్నాయి. కొంతమంది కట్టుకున్నారు. మరికొందరు తిరస్కరించారు. - కె.పార్వతి, సమాఖ్య జిల్లా కోశాధికారి 820 చీరలు కొనుగోలు చేశాం సీఎం పర్యటన కోసం జిల్లా సమాఖ్య నిధులతో 820 చీరలు కొని పంపిణీ చేశాం. డీఆర్డీ ఏ పీడీ అనుమతితోనే చీరలు కొన్నాం. నాసిరకం అని ఫిర్యాదు ఎవరూ చేయలేదు. - ఎం.జీవమణి, సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బిల్లులు ఆఫీసుకు ఇవ్వలేదు సీఎం పర్యటన నిమిత్తం చీరలు కొనేం దుకు రూ. 2.25 లక్షలు అడ్వాన్సుగా జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలికి ఇవ్వటం జరిగింది. నేటి వరకు దానికి సంబంధించిన బిల్లులు కార్యాలయానికి అందలేదు. - డీఆర్డీఏ అకౌంటెంట్ ఎన్.కల్యాణి -
చేనేతకు సిసలైన చేవ్రాలు
అతివల మనస్సు దోచే తళుకుబెళుకుల ‘జాందాని’ చేనేత చీరలు... వీటి రూపకల్పన వెనుక శక్తిలాంటి ఒక వ్యక్తి కఠోర శ్రమ... అకుంఠిత దీక్ష... అంతకు మించిన నైపుణ్యం ఉన్నాయి! ఏదో సాధించాలనే తపన... పదిమందికి ఉపయోగపడాలనే తాపత్రయం... పది మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యం ఉన్నాయి. తొమ్మిది పదులు మీద పడినా... చేనేత రంగ అభివృద్ధిపై ఉన్న పట్టుదల, హస్త కళలపై ఉన్న మక్కువ... చేనేత పారిశ్రామికవేత్త లొల్ల వెంకట్రావుకు ఇంకా ఈ రంగంలో కొనసాగేలా స్ఫూర్తి నింపుతున్నాయి... ఈ వయసులోనూ ఆయన అవిశ్రాంత కృషి చూస్తే ఎవరైనా సరే సలామ్ చేయక మానరు! తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని ఆ ఇంట్లోకి ప్రవేశించగానే ఒక టేబుల్ మీద పెద్ద డ్రాయింగ్ షీటు పరుచుకుని డి జైన్లు వేస్తున్న తొమ్మిది పదుల వయస్సు నిండిన ఒక పండు యువకుడు దర్శనమిస్తారు. ఆయన అలా డిజైన్లు ఎందుకు వేస్తున్నారా అని చూసేలోపే, కుర్చీలోంచి లేచి, మగ్గం మీద కూర్చుని తాను ముందుగా గీసిన డిజైన్‌ను చీర మీద తయారుచేస్తూ కనపడతారు. పూవుకు తావి అద్దినట్టుగా చీరెలకు బంగారు లతలు, పూవులు పూయిస్తారు లొల్ల వెంకట్రావు. చేనేత చీరల తయారీలో విప్లవం తెచ్చిన ఘనత ఆయనది. తెల్లటి పంచె లాల్చీ, మందపాటి కళ్లద్దాలతో చాలా సాధారణంగా కనిపించే వెంకట్రావు చేనేత కళకు చేసిన కృషి అసాధారణమైనది. గుమస్తాగా ప్రారంభించి, ఎందరికో ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. పాఠశాలకు వెళ్లి చదివింది ఎనిమిదో తరగతి వరకే అయినా, జీవితాన్ని మాత్రం నిండుగా చదివారు. ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక పెద్ద కథే ఉంది. గుమాస్తాగా... ఉప్పాడకు చెందిన చేనేత వ్యాపారి పుచ్చల రామలింగం వద్ద గుమస్తాగా చేనేత పని జీవితాన్ని ప్రారంభించిన వెంకట్రావు, ఈ పనిలో చేరడానికి ముందు, ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకున్నారు. స్థానికం పాఠశాలలో ఆరు నెలలపాటు ఉపాధ్యాయ శిక్షణ పొంది, ట్రెయినీగా విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పారు. ‘‘మా నాన్నగారు కులవృత్తిని విడిచిపెట్టవద్దని చెప్పడంతో ఆయన ఆవేదనను అర్థం చేసుకుని కులవృత్తి వైపు అడుగులు వేశాను’’ అని చెబుతారు వెంకట్రావు. గుమస్తాగా పని చేస్తున్న రోజుల్లోనే అంటే 1983 నుంచి జాందాని చీరల తయారీలో విప్లవం తీసుకువచ్చారు. దాంతో అక్కడక్కడ మాత్రమే కనిపించే జాందాని మగ్గాల సంఖ్య వందలకు చేరుకుంది. వేల మంది కార్మికులు ఈ వృత్తిని ఎంచుకున్నారు. ‘‘నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేసేవాడిని. జాందాని చీరలలో కొత్త విప్లవం తీసుకురావడానికి ఆ కళ చాలా ఉపయోగపడింది. చీరలపై తీగలు, ఆకులు, జంతువులు, కాయల వంటి కళాకృతులను నేత ద్వారా సృష్టించాను. ఆకృతిని ముందుగానే గ్రాఫ్‌పై తయారుచేసి, దాని మీద నుంచి చీరలపై ఆ డిజైన్ వచ్చేవిధంగా తయారుచేయడం ప్రారంభించాను’’ అని వివరించారు వెంకట్రావు. భవిష్యత్తరాలకు అందించాలని... చేనేతపై ఇంతటి అభిమానం కలగడానికి బీజం స్వాతంత్య్రానికి ముందే వెంకట్రావులో నాటుకుంది. మహాత్మాగాంధీ ఇచ్చిన విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపుతో స్వదేశీ వస్తువుల మీద ఆయన పెంచుకున్న ప్రేమ ఆ తర్వాత జాందాని కళాభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో ఆ కళ గుర్తింపు పొందడానికి కారణమైంది. తాను మక్కువ పెంచుకున్న కళాభివృద్ధికోసం ఆయన చేసిన అచంచల కృషే ఆ కళపై ఆయన పేటెంట్ హక్కును పొందేలా చేసింది. ‘‘జాందాని కళను భవిష్యత్తరాలకు అందించాలని నా సంకల్పం. అందుకే ఈ కళకు సంబంధించి, ‘జాతీయ హస్తకళలలో జాందాని చేనేత హస్తకళ, దాని ప్రత్యేకత - నా అనుభవాలు’ పేరుతో ఒక పుస్తకం రాశాను’’ అంటారు వెంకట్రావు. చేనేత అభివృద్ధి ధ్యేయంగా... నేత కార్మికుడి కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించారు వెంకట్రావు. ‘‘చేనేత రంగం అభివృద్ధి దిశలో పయనిస్తోంది కానీ, కార్మికులు మాత్రం ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు. అందుకే ఈ రంగంలో నిష్ణాతులైన సుమారు వంద మంది నిరుపేద చే నేత కార్మికులకు నెలకు 200రూపాయల చొప్పున పింఛను అందిస్తున్నాను. ఊపిరి ఉన్నంతవరకు ఈ రంగం అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటాను’’ అంటారు వెంకట్రావు. ఈ వయసులో కూడా చీరలకు అవసరమైన డిజైన్లను తానే తయారుచేసుకోవడాన్ని బట్టే ఆయన దీక్ష, పట్టుదల ఎలాంటివో అర్థమవుతుంది. కళల అభివృద్ధికి ఇలాంటి కార్యశూరులే కదా కావాల్సింది! - ఎల్ శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ ఫొటోలు: ఎస్వివివిఎస్ ప్రసాద్, పిఠాపురం జాందాని అంటే... సాధారణంగా ఏదైనా చీరలకు డిజైన్ ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది. జాందాని చీరలపై మాత్రం రెండు వైపులా డిజైన్ ఒకేలా కనిపిస్తుంది. జాందాని అనేది పర్షియన్ పదం. సంస్థానాధీశుల కాలంలో దీనిని వాడుకలోకి తీసుకువచ్చారు. రాణుల కోసం ప్రత్యేకంగా ఈ చీరలు తయారు చేయించేవారు. కాలక్రమంలో వీటిని మన రాష్ట్రంలో కొత్తపల్లిలో నేయడం ప్రారంభించాక వీటికి విస్తృత ప్రాచుర్యం లభించింది. వెండి బంగారు జరీలతో నేత నేయడం వలన ఈ చీరల ధర రూ. 10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ చీర చిరిగినా, పాడైనా సగం ధర తిరిగి రావడం వీటి విశిష్టత.