christmas gift bag
-
బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో బతుకమ్మ చీరల పం పిణీ, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, జూనియర్ గ్రామకార్యదర్శుల నియామకం, పంచా యతీ ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల భూసేకరణ, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకుల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం లో భాగంగా అర్హుల ఎంపిక కోసం ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లోగా జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను తెలపాలని సీఎస్ ఆదేశిం చారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపామని, ఐదారు రోజుల్లోగా పంపిణీ పూర్తయ్యేలా కార్యక్రమం రూపొందించుకోవాలన్నారు. -
మంత్రుల మధ్య మళ్లీ విభేదాలు..
-
మంత్రుల మధ్య మళ్లీ విభేదాలు..
అనంతపురం: అనంతపురం జిల్లాలో మరోసారి మంత్రుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రన్న క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసే బ్యాగ్‌పై తన ఫోటో లేదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సహచర మంత్రి పరిటాల సునీతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి అయినా తన ఫోటో వేయించకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రొటోకాల్ పాటించలేదని..దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఇదే విధంగా ఇరువురి మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ తోఫా పోస్టర్, బ్యాగ్‌లపై కూడా పల్లె ఫోటో వేయించకపోవడంతో అప్పట్లో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. దీనిపై మంత్రి పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. పల్లె రఘునాథరెడ్డి అభ్యంతరాలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని కొట్టి పారేశారు. క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసే బ్యాగ్‌లు, సంక్రాంతి చందన్న బ్యాగ్‌లు ఒక్కటే కావడంతో ఈ వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తుంది.