మైనారిటీల మనోభావాలతో ఆటలాడవద్దు | don't play with the sentiments of minorities,says shabbir ali | Sakshi
Sakshi News home page

మైనారిటీల మనోభావాలతో ఆటలాడవద్దు

Published Sun, Nov 9 2014 12:53 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

మైనారిటీల మనోభావాలతో ఆటలాడవద్దు - Sakshi

మైనారిటీల మనోభావాలతో ఆటలాడవద్దు

‘షాదీ ముబారక్’ వెబ్‌సైట్, ఫోన్ పనిచేయడం లేదు: షబ్బీర్ అలీ

సాక్షి, నల్లగొండ:  షాదీ ముబారక్ పథకం ద్వారా ముస్లిం మైనారిటీల మనోభావాలతో ఆటలాడవద్దని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రభుత్వానికి  హితవు పలికారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ  ఈ పథకం అమలుకు సంబంధించిన ఆన్‌లైన్ వెబ్‌సైట్‌గానీ, హెల్ప్‌లైన్ ఫోన్‌నంబరుగానీ పనిచేయడం లేదనీ, వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, ఈ నెల 23వ తేదీన టీపీసీసీ చీఫ్ పొన్నాల అధ్యక్షతన టి.కాంగ్రెస్ మైనారిటీ సెల్  సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్ హాజరవుతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement