ఇండియన్ వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’ అరుదైన గౌరవం దక్కించుకుంది. హర్షద్ మెహతా బయోపిక్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఐఎండీబీ ఆల్‌టైం ఫేవరెట్ వెబ్ సిరీస్‌లలో నెంబర్ వన్ పొజిషన్లో నిలిచింది. ఈ అరుదైన ఫీట్‌పై సోనీ ఎల్ఐవీ సిరీస్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.
మొత్తం 163 సిరీస్‌లు పోటీపడగా.. ఇండియా నుంచి కేవలం స్కామ్ 1992 మాత్రమే ఈ లిస్ట్‌లో నిలిచింది. ఓట్ల లెక్కింపుతో స్కామ్ 1992కి అగ్రస్థానం దక్కింది. హన్షల్ మెహతా డైరెక్ట్ చేసిన ‘స్కాం 1992: హర్షద్ మెహతా స్టోరీ’ ప్రపంచంలో మోస్ట్ వాచ్డ్ సిరీస్‌గానూ గుర్తింపు దక్కించుకుంది.
గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ లీడ్ రోల్ చేసిన ఈ వెబ్ సిరీస్.. రింగ్ టోన్ ద్వారానూ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఓటింగ్ పర్సంటేజ్ ద్వారా స్కాం 1992కి టాప్ పొజిషన్ రావడం గొప్ప విషయం కాదనేది కొందరి మాట. ఆ లెక్కన తర్వాతి ప్లేసులో నిలిచిన నెట్‌ఫ్లిక్స్ బ్రేకింగ్ బ్యాడ్ సిసలైన విన్నర్ అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
స్కామ్ 1992కు అరుదైన గౌరవం
Published Mon, Jun 7 2021 4:53 PM | Last Updated on Mon, Jun 7 2021 7:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment