ఆర్థిక మార్కెట్ల నియంత్రణలో భారత్‌కు టాప్ రేటింగ్
జెనీవా: ఆర్థిక మార్కెట్లను సమర్ధంగా నియంత్రించే అంశంలో భారత్‌కు అత్యుత్తమ రేటింగ్ లభించింది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ).. చైనా, అమెరికా నియంత్రణ సంస్థల కన్నా మెరుగ్గా రేటింగ్స్ దక్కించుకున్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్స్ (ఐవోఎస్‌సీవో), బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) కలిసి వీటిని నిర్ణయించాయి. ఇందులోని మొత్తం 8 ప్రమాణాల్లోను గరిష్ట స్కోరు అయిన 4ని భారత్ సహా ఆరు దేశాలు మాత్రమే దక్కించుకోగలిగాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాలు ఉన్నాయి.