గ్రీన్‌ ఎనర్జీకి స్టార్‌ రేటింగ్‌ | Star rating for green energy | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ ఎనర్జీకి స్టార్‌ రేటింగ్‌

Published Wed, Jun 28 2023 4:19 AM | Last Updated on Wed, Jun 28 2023 5:06 AM

Star rating for green energy - Sakshi

సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్‌ విని యోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే వినియోగ దారు లకు ‘గ్రీన్‌ స్టార్స్‌’ ఇవ్వనున్నారు. పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు బాధ్యత నిబంధనలు 2022 కు మొదటి సవరణను(రెగ్యులేషన్‌ 6 ఆఫ్‌ 2023) ను ఏపీఈఆర్‌సీ ప్రతిపాదించింది.

గ్రీన్‌ ఎనర్జీ కోసం వార్షిక ప్రాతి పదికన గ్రీన్‌ స్టార్స్‌ రేటింగ్‌ సర్టిఫికెట్లను ఇవ్వాలని సూచించింది. దీని ప్రకారం ఏటా పునరు త్పాదక విద్యుత్‌ను 100% వినియోగిస్తే 5 స్టార్స్, 75% వాడితే 4 స్టార్స్, 50% కొంటే 3 గ్రీన్‌ స్టార్స్‌ లభించనున్నాయి. నెల మొత్తం వినియోగం ఆధారంగా అటువంటి ఆకుపచ్చ నక్షత్రాలు వారి నెలవారీ బిల్లులలో కూడా సూచిస్తారు.

ప్రతినెలా డిజిటల్‌ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. దీనిపై అభిప్రా­యా­లను వెల్లడించాల్సింగా డిస్కంలను కమిషన్‌ కోరింది. విద్యుత్‌ చట్టం, 2003 ప్రకారం..2024–25 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియో గదారులు ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేదీకి 3 నెలల ముందు డిస్కంలకు తమ అభ్యర్థ నలను సమర్పించాలని ఏపీఈఆర్‌సీ చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement