ఈ కార్లు.. భద్రతకు భరోసా | TATA Mahindra Maruti Vokls Renualt Cars Secured Top 10 Safest Cars In India Position As Per Global NCAP | Sakshi
Sakshi News home page

ఈ కార్లు.. భద్రతకు భరోసా

Published Sun, Jun 6 2021 3:35 PM | Last Updated on Sun, Jun 6 2021 7:51 PM

TATA Mahindra  Maruti Vokls Renualt Cars Secured Top 10 Safest Cars In India Position  As Per Global NCAP - Sakshi

ఆధునిక యుగంలో కాలంతో పోటీ పడుతూ అటు ఇటు పరుగులు పెడుతున్నాం. అయితే క్రమంలో రహదారి భద్రతను చాలా మంది గాలికొదిలేస్తున్నారు. దీంతో మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షల మంది చనిపోతున్నారు. నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2019లో 4,37,396 రోడ్డు యాక్సిడెంట్స్‌ జరిగాయి. వీటిలో 1.54 వేల మంది చనిపోగా.. మరో 4.39 మంది తీవ్రగాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది

వెబ్‌డెస్క్‌: ఇండియాలో కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు ధనవంతులకే సొంతమైన కారు సౌకర్యం ఇప్పుడిప్పుడే సామాన్యుల చెంతకు వస్తోంది. చాలా మంది కారు కొనేప్పుడు డిజైన్‌, మైలేజీ, ఇంజన్‌ సామర్థ్యం తదితర అంశాలపైనే ఎక్కువగా ఫోకస్‌ పెడుతుంటారు. కానీ వీటన్నింటినీ మించి ముఖ్యమైన అంశం భద్రత. లక్షలు పోసి వెచ్చించే ఆ కారు ప్రమాదం జరిగినప్పుడు మనకు ఎంత వరకు భద్రత అందిస్తుందనేది ప్రధానం.

ఎన్‌సీపీఏ రేటింగ్‌
బ్రిటన్‌కి చెందిన జీరో ఆర్గనైజేషన్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం (NCPA) పేరుతో ప్రపంచ వ్యాప్తంగా కార్ల భద్రతపై ఎప్పటికప్పుడు పరిశీలన చేసి రేటింగ్స్‌ ఇస్తోంది. తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన జాబితాలో మంచి రేటింగ్స్‌ సాధించిన కార్ల వివరాలు మీ కోసం

టాటా ఆల్ట్రోజ్‌ 
హ్యచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో భద్రత విషయంలో 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన ఏకైక కారు టాటా ఆల్ట్రోజ్‌. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపే వ్యక్తి తల, మెడ, ఛాతి, మోకాళ్లుకు కచ్చితమైన భద్రత అందిస్తోంది. స్టాండర్డ్‌ వెర్షన్‌లో రెండు ఎయిర్‌ బ్యాగ్స్‌ లభిస్తున్నాయి. మోడల్స్‌ని బట్టి ఎయిర్‌ బ్యాగ్స్‌ పెరుగుతాయి. ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు సీట్‌ బెల్డ్‌ రిమైండర్‌, ఏబీఎస్‌, ఈబీడీ బ్రేక్‌ సిస్టమ్స్‌,  కార్నర్‌ స్టెబులిటీ కంట్రోల్‌, ఐసోఫిక్స్‌ చైల్డ్‌ సీట్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఎన్‌సీపీఏ సంస్థ ఆల్ట్రోజ్‌కి 5 ‍ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది. టాటా ఆల్ట్రోజ్‌ ధరలు రూ. 5.8 లక్షల నుంచి 9.56 లక్షల వరకు ఉంది. 

టాటా నెక్సాన్‌
పూర్తిగా ఇండియన్‌ మేడ్‌గా తయారై ఎన్‌సీపీఏ నుంచి 5 స్టార్‌ రేటింగ్‌ సాధించిన కారుగా టాటా నెక్సాన్‌ నిలిచింది. సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కేటగిరీలో భద్రత విషయంలో 5 స్టార్‌ నెక్సాన్‌కి దక్కాయి. కారులో ముందు వరుసలో కూర్చునే ఇద్దరు వ్యక్తుల తల, మెడ, ఛాతి, మోకాళ్లకు రక్షణ కల్పిస్తుంది. డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్, ఈబీడీలతో పాటు ఎలక్ట్రానిక్‌ స్టెబులిటీ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఎలక్ట్రానిక్‌ ట్రాక‌్షన్‌ కంట్రోల్‌, రోల్‌ ఓవర్‌ మైగ్రేషన్‌లు ఈ కారులో ఉన్నాయి. టాటా నెక్సాన్‌ కారు రూ. 7.2 లక్షల నుంచి 12.96 లక్షల వరకు లభిస్తోంది. 

మహీంద్రా ఎక్స్‌యూవీ 300
ఎన్‌సీపీఏ నుంచి సేఫర్‌ కార్‌ అవార్డు దక్కించుకున్న ఘనత మహీంద్రా ఎక్స్‌యూవీ 300కే దక్కింది. స్టాండర్డ్‌ వెర్షన్లలలో రెండు ఎయిర్‌బ్యాగ్స్‌ లభించగా.. హై ఎండ్‌ మోడల్స్‌లో సైడ్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌ కూడా పొందు పరిచింది మహీంద్రా. ప్రమాదం జరిగినప్పుడు పెద్దలతో పాటు చిన్న పిల్లలకు కూడా ఇంచుమించు ఒకే రకమైన భద్రత, రక్షణ కల్పించడం  ఎక్స్‌యూవీ 300 ప్రత్యేకత. ఈ అంశంలోనే మిగిత కార్ల కంటే ఎంతో ముందుంది ఈ మోడల్‌. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారు మార్కెట్‌లో 7.96 లక్షల నుంచి 11.47 లక్షల వరకు లభిస్తోంది. 

మారుతి సుజూకి విటారా బ్రెజా
మైలేజీ విషయంలో మిగిలిన కార్లను వెనక్కి తోసే మారుతి భద్రత విషయంలో ఎప్పుడు వెనుకడుగే అన్నట్టుగా ఉండేది. దీంతో విటారా బ్రెజాలో భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంది మారుతి. దీంతో ఎన్‌సీపీఏలో 4 స్టార్‌ రేటింగ్‌ సాధించింది బ్రెజా కారు. మార్కెట్‌లో బ్రెజా ధర రూ. 7.52 లక్షల నుంచి రూ.11.26 లక్షల వరకు లభిస్తోంది. 

రెనాల్ట్‌ ట్రైబర్‌ 
ఎన్‌సీపీఏ నుంచి లేటెస్ట్‌గా 4 స్టార్‌ రేటింగ్‌ సాధించింది రెనాల్ట్‌ ట్రైబర్‌. మల్టీ పర్సస్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో ఉన్న రెనాల్ట్‌లో పెద్దలతో పాటు పిల్లల భద్రత విషయంలో మెరుగైన రేటింగ్స్‌ సాధించింది.అడల్ట్‌ భద్రత విషయంలో 4 రేటింగ్‌, పిల్లల భద్రత విషయంలో 3 స్టార్‌ రేటింగ్స్‌ సొంతం చేసుకుంది. రెనాల్ట్‌ ట్రైబర్‌ మోడల్స్‌ ధర మార్కెట్‌లో రూ. 5.3 లక్షల నుంచి 7.65 లక్షల వరకు ఉన్నాయి.

వోక్స్‌ వ్యాగన్‌ పోలో
వోక్స్‌ వ్యాగన్‌ పోలోకి ప్యాసింజర్స్‌ భద్రత విషయంలో 4 స్టార్‌ రేటింగ్‌ని ఇచ్చింది ఎన్‌సీపీఏ. ముందు వరుసలో కూర్చున్న వారికి తల, మెడలకు పూర్తి స్థాయి భద్రత ఇవ్వడంతో పాటు ఛాతికి సైతం ప్రమాద తీవ్రత తగ్గేలా జాగ్రత్తలు పాటించింది వోక్స్‌ సంస్థ. వోక్స్‌ వ్యాగన్‌ పోలో మోడళ్లు రూ. 6.17 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ధరల్లో లభిస్తున్నాయి. 

మహీంద్రా థార్‌
స్పోర్ట్ప్‌ యూటిలిటీ వెహికల​సెగ్మెంట్‌లో థార్‌కి ప్రత్యేక స్థానం. గతేడాది 4 స్టార్‌ రేటింగ్‌ సాధించిన థార్‌కి ఈసారి కూడా అదే రేటింగ్‌కి ఇచ్చింది ఎన్‌సీపీఏ. ఈ ఐకానిక్ ఎస్‌యూవీ మోడల్‌ ధరలు రూ. 12.11 లక్షల నంఉచి రూ 12.81 వరకు ఉంది. 

టాటా టియాగో
హ్యాచ్‌బ్యాగ్ సెగ్మెంట్‌ కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న టాటా టియాగో సంస్థ భద్రత విషయంలో మెరుగైంది. పెద్దలకు 4 స్టార్‌, పిల్లలకు 3 స్టార్‌ రేటింగ్‌ను ఇచ్చింది గ్లోబల్‌ ఎన్‌సీపీఏ సంస్థ. స్టాండర్డ్‌ వెర్షన్‌లో రెండు ఎయిర్‌బ్యాగులు అందించే ఈ మోడల్‌ ఈ మోడల్‌ ధరలు రూ. 5 లక్షల నుంచి రూ. 6.96 లక్షల వరకు ఉంది. 

టాటా  టిగోర్‌
టాటా టియాగో తరహాలోనే టిగోర్‌ సైతం పెద్దల విషయంలో 4 స్టార్‌, పిల్లల విషయంలో 3 స్టార్‌ రేటింగ్‌ను సాధించింది. ఈ మోడల్‌ ధరలు  ధరలు రూ. 5.6 లక్షల నుంచి రూ. 7.74 లక్షల వరకు ఉంది. 

మహీంద్రా మొరాజో
మల్టీపర్పస్‌ యూటిలిటీ వెహికల్‌ సెగ్మెంట్‌లో ఇప్పటికే ప్రజల ఆధరణ దక్కించుకున్న మహీంద్రా మోరాజో భద్రత విషయంలో 4 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. మార్కెట్‌లో మొరాజో మెడల్స్‌ రూ. 12.03 లక్షల నుంచి రూ. 14.04 లక్షల రేంజ్‌లో లభిస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement