నిజామాబాద్ అర్బన్: విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా సరికొత్త పథకాన్ని రూపొందించింది. ఇక నుంచి ఉపాధ్యాయుల పనితీరుకు రేటింగ్ నమోదు చేయనున్నారు.
ఏడాదిలో నాలుగుసార్లు నమోదు చేసే రేటింగ్ వివరాలను ఆన్‌లైన్‌లోనే పొందుపరచనున్నారు. పాఠశాల వివరాలు, విద్యార్థుల స్థాయి, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పని తీరును పరిశీలిస్తారు.
నైపుణ్యాలను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఇదే నెలలో ప్రారంభించనున్నారు. ఇదివరకే విద్యాశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ఫార్మాట్‌ను ప్రధానోపాధ్యాయులకు అందించారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 1,576 ప్రాథమిక పాఠశాలలు, 263 ప్రాథమికోన్నత పాఠశాలలు, 478 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సుమారు 10 వేల మంది ఉపాధ్యాయు లు పనిచేస్తున్నారు. ఇందులో వివిధ కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్వశిక్ష అభియాన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.
విద్యార్థుల స్థాయి నుంచి ప్రధానోపాధ్యాల వరకు వారి సామర్థ్యాలు, పనితీరును మూడు నెలకోకసారి అంచనా వేసేందుకు మానిటరింగ్ టూల్స్‌ను రూపొందించారు. దీని ఆధారంగా పాఠశాల, విద్యార్థి ప్రమాణాలతోపాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరును ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
వీటిని పరిశీలిస్తారు
స్కూల్ మానిటరింగ్ కింద పాఠశాలలు ఎస్‌సీ, ఎస్‌టీ పిల్లల చదువులు, పాఠ్యేతర అంశాలు, వినూత్న పథకాలు, గ్రంథాలయ వినియోగం తదితర వివరాలను నమో దు చేస్తారు. విద్యార్థి ప్రతిభ కింద సబ్జెక్టులవారీగా గ్రేడింగ్ నమోదు చేస్తారు. అలాగే ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల ప్రతిభను నమోదు చేస్తారు. ఇందులో ఏ డు అంశాలు ఉంటాయి. ఒక్కో అంశానికి గరిష్టంగా నాలుగు రేటింగ్ పాయింట్‌లు ఉంటాయి. మొదట ఉపాధ్యాయులు తమకు తామే రేటింగ్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అనంతరం వీటిని ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షక అధికారులు పరిశీలించి వారి రేటింగ్ ఇస్తారు. జూన్ నుంచి ఆగస్టు వరకు మొదటి క్వార్టర్, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు రెండవ క్వార్టర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మూడవ క్వార్టర్, మార్చి నుంచి మే వరకు నాల్గవ క్వార్టర్‌లో రేటింగ్ నమోదు చేస్తారు. గ తంలో ఉపాధ్యాయుల పనితీరుపై ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులకు రహస్య నివేదిక పంపేవారు. కొన్నేళ్ల నుంచి ఇది అమలు కావడం లేదు. రేటింగ్ విధానం తో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ పనితీరును బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులు కూడా తగిన సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విద్యాబోధనలో మార్పులు, చేర్పులు చేసుకొని టీచర్లు తమ ప్రతిభను కూ డా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది.
ప్రధానోపాధ్యాయులకు ఫార్మాట్ పంపాం
ఉపాధ్యాయుల ప్రతిభను తెలుసుకునేందుకు ఓ ఫార్మాట్‌ను రూపొందించాం. దానిని ఇదివరకే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశాం. దాని ఆధా రంగా ఉపాధ్యాయుల ప్రతిభ నమోదు చేస్తాం. ఈ ప్రక్రియను సర్వశిక్ష అభియాన్ ద్వారా నిర్వహిస్తాం.
టీచర్ల పనితీరుకు రేటింగ్
Published Wed, Sep 24 2014 2:32 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM
Advertisement
Advertisement