సుకుమార్ 'దర్శకుడు' ఫస్ట్ లుక్
దర్శకుడిగానే కాక నిర్మాతగానూ తన మార్క్ చూపించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన నిర్మాణంలో మరో సినిమాను రూపొందిస్తున్నాడు. తన అన్న కొడుకు అశోక్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో హరి ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తున్నాడు. కథ, కథనం, డైలాగ్స్ అన్ని హరి ప్రసాద్ స్వయంగా తయారు చేసుకున్నాడు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను సుకుమార్ తన పేస్ బుక్ పేజ్లో రిలీజ్ చేశాడు. సుకుమార్ క్రియేటివ్ వర్క్లో పాలు పంచుకోకపోయినా.. పోస్టర్లో సుకుమార్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఈషా హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే టీజర్ పాటు రిలీజ్ డేట్ను కూడా ప్రకటించనున్నారు.