Darsakudu
-
కొత్త ’దర్శకుడు’
-
మెగాస్టార్ వంతు..!
తన సినిమా ప్రమోషన్ కోసం స్టార్ హీరోలందరిని వాడేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ మెగాస్టార్ ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫైనల్ గా మెగాస్టార్ ను సీన్ లోకి తీసుకువచ్చాడు. ఇప్పటికే మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ లు దర్శకుడు సినిమా ఫంక్షన్లలో సందడి చేయగా ఇప్పుడు మెగాస్టార్ కూడా దర్శకుడు చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ సినిమా తొలి టికెట్ ను తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేశాడు. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అశోక్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ శుక్రవారం (ఆగస్టు 4)న ప్రేక్షకుల ముందుకు వస్తున్న దర్శకుడు స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం సినిమాతో పోటి పడుతోంది. -
సెంటిమెంట్ ఫాలో అవుతున్న సుక్కు..!
లెక్కల మాస్టార్ సుకుమార్ కూడా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్, నిర్మాతగాను ఘనవిజయం సాధించాడు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ సినిమాతో తొలిసారిగా నిర్మాతగా మారిన సుకుమార్, తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు. కుమారి 21 ఎఫ్ రిలీజ్ సమయంలో ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో సినిమా పనుల్లో ఉన్న సుక్కు.. కుమారి టీజర్‌ను ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాడు. దీంతో ఎన్టీఆర్ రిలీజ్ చేయటం సుకుమార్‌కు సెంటిమెంట్‌గా మారిపోయింది. అందుకే తన నిర్మాణంలో వస్తున్న రెండో సినిమా దర్శకుడు టీజర్‌ను కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న దర్శకుడు సినిమా టీజర్ ఈ నెల 22న ఓ ప్రముఖ హీరోగా చేతుల మీదుగా రిలీజ్ చేస్తామాని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ప్రముఖ హీరో ఎన్టీఆరే అని భావిస్తున్నారు. మరి నిజంగానే సుక్కు సెంటిమెంట్ ఫాలో అయి ఎన్టీఆర్‌తో రిలీజ్ చేయిస్తాడా..? లేక రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్నాడు కాబట్టి చరణ్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయిస్తాడా..? తెలియాలంటే 22 వరకు వెయిట్ చేయాల్సిందే. -
వేసవి బరిలో...
ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా తీసిన ‘కుమారి 21ఎఫ్’ ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆయన నిర్మించిన సినిమా ‘దర్శకుడు’. అశోక్, ఈషా జంటగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో బిఎన్సిఎస్పి విజయ్‌కుమార్, థామస్ రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్‌ని ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు అవసరమైన అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని యూనిట్ అంటోంది. వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా, సమర్పణ: సుకుమార్. -
సుకుమార్ 'దర్శకుడు' ఫస్ట్ లుక్
దర్శకుడిగానే కాక నిర్మాతగానూ తన మార్క్ చూపించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన నిర్మాణంలో మరో సినిమాను రూపొందిస్తున్నాడు. తన అన్న కొడుకు అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో హరి ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తున్నాడు. కథ, కథనం, డైలాగ్స్ అన్ని హరి ప్రసాద్ స్వయంగా తయారు చేసుకున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుకుమార్ తన పేస్ బుక్ పేజ్‌లో రిలీజ్ చేశాడు. సుకుమార్ క్రియేటివ్ వర్క్‌లో పాలు పంచుకోకపోయినా.. పోస్టర్లో సుకుమార్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఈషా హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే టీజర్ పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. -
సుకుమార్ ఫ్యామిలీ నుంచి మరో బ్యానర్
మూస మాస్ సినిమాల టైంలో కొత్త తరహా చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు సుకుమార్. తన ప్రతి కథలోనూ సైన్స్‌కు కీలక పాత్ర కల్పించే ఈ లెక్కల మాస్టరు, నిర్మాతగానూ మంచి విజయం సాధించాడు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్‌ను స్థాపించి తొలి ప్రయత్నంగా కుమారి 21ఎఫ్ సినిమాను తెరకెక్కించాడు. సుక్కు స్వయంగా కథా కథనాలు అందించిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో నిర్మాతగానూ కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే సుకుమార్ నిర్మాతగా తన రెండో సినిమా కోసం మరో బ్యానర్‌ను స్థాపిస్తున్నాడు. తన తండ్రి పేరుతో బీటీఆర్ క్రియేషన్స్ స్థాపించిన ఆ బ్యానర్‌పై తన అన్న కొడుకు అశోక్‌ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిన ఈ సినిమాకు దర్శకుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన హరిప్రసాద్, ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.