వేసవి బరిలో... | Sukumar's Darsakudu First look | Sakshi
Sakshi News home page

వేసవి బరిలో...

Published Sun, Apr 16 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

వేసవి బరిలో...

వేసవి బరిలో...

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ నిర్మాతగా తీసిన ‘కుమారి 21ఎఫ్‌’ ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆయన నిర్మించిన సినిమా ‘దర్శకుడు’. అశోక్, ఈషా జంటగా హరి ప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో బిఎన్‌సిఎస్‌పి విజయ్‌కుమార్, థామస్‌ రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఫస్ట్‌ లుక్‌ని ఆదివారం విడుదల చేశారు.

 ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు అవసరమైన అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని యూనిట్‌ అంటోంది. వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేష్‌ కోలా, సమర్పణ: సుకుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement