రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌‌, అశోక్‌ హాల్‌ పేర్ల మార్పు | Rashtrapati Bhavan Durbar, Ashok halls renamed Ganatantra Ashok Mandap | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌‌, అశోక్‌ హాల్‌ పేర్ల మార్పు

Published Thu, Jul 25 2024 5:24 PM | Last Updated on Thu, Jul 25 2024 6:28 PM

Rashtrapati Bhavan Durbar, Ashok halls renamed Ganatantra Ashok Mandap

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లోని  ముఖ్యమైన రెండు హాళ్ల పేర్లను కేంద్రం మార్చింది. పలు ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా ఉన్న దర్బార్‌ హాల్‌, అశోక్‌ హాల్‌ పేర్లను పేర్లను.. ఇకపై ‘గణతంత్ర మండపం’,‘అశోక్‌ మండపం’గా పిలవనున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌ గురువారం వెల్లడించింది. భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతలను ప్రతిబింబించేలా చేయడంలో భాగంగా ఈ పేర్లు మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా జాతీయ అవార్డుల ప్రదానం వంటి కీలక కార్యక్రమాలు దర్బార్ హాల్‌లో జరుగుతుంటాయి. ‘దర్బార్’ అనే పదం కోర్టు, అసెంబ్లీ అనే అర్థాలను ప్రతిబింబిస్తుంది. గతంలో ఆంగ్లేయులు, భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ అనేవారు. అయితే భారత్‌ గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ప్రాముఖ్యతను కోల్పోయింది. గణతంత్ర అనే పదం స్వతంత్ర భారతంలో లోతుగా పాతుకుపోయింది. అందుకే ఈ హాల్‌కు గణతంత్ర మండపంగా మారుస్తున్నాం’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఇకపోతే ‘అశోక్ హాల్’ పేరును ‘అశోక్ మండపం’ అని మార్చడంపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది.‘ అశోక్‌ హాల్ నిజానికి ఒక బాల్‌రూమ్‌. అశోక్‌ అంటే అన్ని బాధల  నుంచి విముక్తుడైన వ్యక్తి అని అర్థం. అలాగే 'అశోక' అనేది అశోక్ చక్రవర్తిని సూచిస్తుంది. ఇది ఐక్యత, శాంతియుత సహజీవనానికి చిహ్నం. అశోక పదం భారతీయ మత సంప్రదాయాలు, కళలు, సంస్కృతిలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సమాజంలో అశోక చెట్టుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా దానికి అశోక్‌ మండపం అని మార్చినట్లు వివరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement