durbar hall
-
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్ల మార్పు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లోని ముఖ్యమైన రెండు హాళ్ల పేర్లను కేంద్రం మార్చింది. పలు ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా ఉన్న దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లను పేర్లను.. ఇకపై ‘గణతంత్ర మండపం’,‘అశోక్ మండపం’గా పిలవనున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ గురువారం వెల్లడించింది. భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతలను ప్రతిబింబించేలా చేయడంలో భాగంగా ఈ పేర్లు మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా జాతీయ అవార్డుల ప్రదానం వంటి కీలక కార్యక్రమాలు దర్బార్ హాల్లో జరుగుతుంటాయి. ‘దర్బార్’ అనే పదం కోర్టు, అసెంబ్లీ అనే అర్థాలను ప్రతిబింబిస్తుంది. గతంలో ఆంగ్లేయులు, భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ అనేవారు. అయితే భారత్ గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ప్రాముఖ్యతను కోల్పోయింది. గణతంత్ర అనే పదం స్వతంత్ర భారతంలో లోతుగా పాతుకుపోయింది. అందుకే ఈ హాల్‌కు గణతంత్ర మండపంగా మారుస్తున్నాం’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.ఇకపోతే ‘అశోక్ హాల్’ పేరును ‘అశోక్ మండపం’ అని మార్చడంపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది.‘ అశోక్ హాల్ నిజానికి ఒక బాల్రూమ్. అశోక్ అంటే అన్ని బాధల నుంచి విముక్తుడైన వ్యక్తి అని అర్థం. అలాగే 'అశోక' అనేది అశోక్ చక్రవర్తిని సూచిస్తుంది. ఇది ఐక్యత, శాంతియుత సహజీవనానికి చిహ్నం. అశోక పదం భారతీయ మత సంప్రదాయాలు, కళలు, సంస్కృతిలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సమాజంలో అశోక చెట్టుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా దానికి అశోక్ మండపం అని మార్చినట్లు వివరించింది. -
వజ్ర సింహాసన వైభవం
మైసూరు: స్వచ్ఛమైన బంగారం, అపురూపమైన వజ్రాలు, రత్నాలు పొదిగిన సింహాసనాన్ని చూడాలంటే మైసూరు ప్యాలెస్‌కు వెళ్లాల్సిందే. దసరా మహోత్సవాలకు నగరం హంగులు అద్దుకుంటుండగా, ప్యాలెస్‌లోనూ ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ప్యాలెస్‌లో ఉన్న దర్బార్ హాల్లో ఉన్న బంగారు సింహాసనాన్ని జోడించారు. వృశ్చిక లగ్నంలో పూజలు చేసి మంగళవారం ఉదయం 10.45 గంటల నుంచి 11.05 గంటల మధ్య శుభ వృశ్చిక లగ్నంలో పూజలు చేసి జోడింపు ప్రారంభించారు. మొదట వేద పండితుల సమక్షంలో గణపతి హోమం, చాముండి పూజ, శాంతి హోమం చేశారు. రాజవంశీకుడు యదువీర్ పాల్గొన్నారు. ప్యాలెస్‌లో కింది గదిలో ఉన్న స్ట్రాంగ్ రూంలో విడివిడిగా ఉన్న బంగారు, వజ్రఖచిత భాగాలను పోలీసు బందోబస్తు మధ్య దర్బార్ హాల్లోకి తీసుకొచ్చారు. పురాతన కాలం నుంచి సింహా సనం ఉంచే స్థలంలో జోడించారు. ఈ కార్యక్రమంలో గెజ్జగెహళ్లి గ్రామస్తులు, రాజమాత ప్రమోదాదేవి పాల్గొన్నారు. జోడింపు పూర్తయ్యాక మళ్లీ పూజలు చేసి తెల్లని వస్త్రంతో కప్పిఉంచారు. సెప్టంబర్ 26వ తేదీన దసరా నవరాత్రి ఉత్సవాల రోజున యదువీర్ ఈ సింహాసనాన్ని అధిష్టిస్తారు. (చదవండి: వధువు స్పెషల్ ఫోటో షూట్... ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు) -
రాజదర్బారులో దసరాకు ఎంతపని చేశారు!?
దేశంలోనై మైసూర్ అత్యంత పరిశుభ్రమైన నగరం.. ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు స్వచ్ఛ భారత్‌లో భాగంగా మొదటి ర్యాంకు ఈ నగరానికి వచ్చింది. ఇక్కడి మైసూర్ రాజభవనంలో జరిగే దసరా వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి ఉంది. కానీ ఈసారి ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలు మాత్రం మరో చేదు వాస్తవాన్ని బయటపెట్టాయి. నగర వాసులకు పరిశ్రుభత మీద పెద్దగా శ్రద్ధలేదనే విషయాన్ని చాటాయి. ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలకు సంబంధించి మైసూర్ రాజకుటుంబ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన ఫొటోను పెట్టారు. దర్బార్ హాల్లో దసరా వేడుకలు ముగిసిన తర్వాత.. ఎంత దారుణంగా పరిసరాలు మారిపోయాయో ఈ ఫొటో చాటుతున్నది. దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్ ప్లేట్లు, టీ కప్పులు యథేచ్ఛగా విసిరేసి వెళ్లిపోయారు. దీంతో రాజదర్బార్ చెత్తకుండీలా మారిపోయింది. "అత్యంత పరిశుభ్రమైన నగరం అన్న కీర్తిని మనం సీరియస్‌గా తీసుకుంటున్నట్టు లేదు. పరిశుభ్రతకు మారుపేరైన మన నగరంలో పరిస్థితి ఇలా ఉంది. రాజ దర్బారు అనేది థియేటర్ కాదు.. అక్కడ తినకూడదు.. థియేటర్ మాదిరిగా అక్కడ చెత్త వేయకూడదన్న విషయం ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది. (థియేటర్లో కూడా ఇలా చుట్టూ చెత్త వేసుకోకూడదు). మన సంప్రదాయ పండుగ, మన గొప్ప నగరం ప్రత్యేకతలను నిలబెట్టుకుందాం. పవిత్రమైన భవనాన్ని ఇలా కించపరచడం ఇకముందు జరగకుండా చూసుకుందాం' అని పేర్కొంటూ.. చెత్తచెదారంతో మురికిగా మారిన రాజదర్బార్ ఫొటోను ఆయన పోస్టుచేశారు.