
సాక్షి, హైదరాబాద్ : కృష్ణానగర్‌లోని శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం...యూసఫ్‌గూడ శ్రీకృష్ణనగర్ బి బ్లాక్...లోని మొదటి అంతస్తులో సినిమా షూటింగ్స్‌లో సెట్స్‌లో వాడే స్మోక్ బాంబ్స్ పేలినట్లు తెలుస్తోంది. సిలిండర్ల సాయంతో స్మోక్ బాంబులు తయారు చేస్తుండగా అవి హఠాత్తుగా పేలాయి. ఈ ప్రమాదంలో అశోక్ అనే యువకుడి చేతులు, కాళ్లకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. కాగా నిబంధనలు ఉల్లంఘించి స్మోక్ బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment