Krishna Nagar
-
ఓ జాతీయ పార్టీకి చెందిన కరపత్రాలు, డబ్బు స్వాధీనం
-
హైదరాబాద్ కృష్ణానగర్ లో దారుణం
-
దేవుని మాలలో ఉండి దారుణం..కూతురు కోసం వచ్చి అత్తపై దాడి
సాక్షి, జ్యోతినగర్: కూతురి ఆచూకీ కోసం వచ్చిన ఓ తల్లిని ఆమె అల్లుడే క్షణికావేశంలో హతమార్చాడు. ఈ విషాద ఘటన ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణానగర్‌కు చెందిన కాసు సతీశ్–పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. సతీశ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్యతో గొడవలు మొదలయ్యాయి. దీంతో కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లి, మరో ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం పద్మ తీవ్ర మనోవేదనకు గురై, ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు శృతి తండ్రి వద్దకు వెళ్లి, అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపింది. దీంతో అతను తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని, ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు రామయ్యపల్లెలో ఉంటున్న పద్మ తల్లిదండ్రులు ఈర్ల లక్ష్మీ(65)–రాజయ్యలకు సమాచారం అందించడంతో ఠాణాకు చేరుకున్నారు. అనంతరం మనవరాళ్లను చూసేందుకు కృష్ణానగర్ వెళ్లారు. ఇంట్లో అల్లుడు సతీశ్ కనిపించడంతో తమ కుమార్తె నీ మూలంగానే ఇంటి నుంచి వెళ్లిపోయి ందన్నారు. ఇది గొడవకు దారితీసింది. క్షణికావేశంలో సతీశ్ తాను దేవుని మాల వేసుకున్న విషయాన్నీ మర్చి పోయి, అత్త లక్ష్మీపై దాడి చేశాడు. స్థానికులు అతన్ని సముదాయించి, స్పృహ కోల్పోయిన లక్ష్మిని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనతో ఆస్పత్రి ఆవరణలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై బి.జీవన్, పోలీసు సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి చిన్న కుమారుడు గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సతీశ్‌పై హత్య కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు? లక్ష్మి మృతి చెందిన విషయం తెలుసుకున్న సతీశ్ తన మెడలోని మాల తీసివేశాడు. అనంతరం పోలీ స్‌స్టేషన్‌కు వెళ్లి, లొంగిపోయినట్లు సమాచారం. (చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య) -
ఆమె కత్తి మహా పదును.. ఏకంగా రూ.10 కోట్లు దాటింది
-
Tokyo Paralympics: చివరి రోజు భారత్ ఖాతాలో స్వర్ణం
-
కృష్ణా నగర్ మూగబోయింది..
సనత్‌నగర్: సినీ కళాకారుల కలలధామం.. 24 క్రాప్ట్స్కు ఆశల దీపం... కృష్ణానగర్ మూగబోయింది. నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ఉండే ఆ బస్తీ సినిమా షూటింగ్‌లతో పాటే నాలుగు మాసాల క్రితమే ప్యాకప్ అయిపోయింది. కరోనా మాటున కనుమరుగైన వెండి తెర వెలుగులు మాదిరిగానే సినీ కార్మికుల జీవితాలు సైతం మసకబారిపోయాయి. కోడి కూయకముందే అందంగా ముస్తాబై రోడ్డెక్కే జూనియర్ ఆర్టిస్ట్‌లు..సాయంత్రమైతే రేపటి షెడ్యూల్డ్ ముచ్చట్లు... నవ్వులు...కేరింతలు...వారి కోసం వచ్చిపోయే వాహనాలు..ఇలా కష్ణానగర్ ఎప్పుడూ కళకళలాడేది. కానీ ఆ ‘కళ’ను కరోనా మింగేసింది. పూర్ణా టిఫిన్స్, మంగ టిఫిన్ సెంటర్, శ్రీశ్రీ టిఫిన్స్... పొట్టివీరయ్య బంకు వంటికి సినీ కార్మికులకు అడ్డాలు. బాధలు... బందీలు... కలలు...కన్నీళ్లు... ఆనందం... అభిమానం ఏది పంచుకోవాలనుకున్నా ఇక్కడికొచ్చి సింగిల్ చాయ్ కొట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. దాతల సహకారంతో.. సినీ వృక్షపు కొమ్మలను కరోనా తెగనరికేయడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. పెట్రేగిపోతున్న కరోనా భయం ఒకవైపు..షూటింగ్‌లు లేక ఛిద్రమైన జీవితాలు మరోవైపు..వెరసి రంగుల లోకాన్ని విడనాడి సొంత ఊళ్ల బాట పట్టిన వారు ఎందరో.. చేసే వృత్తిని వదల్లేక..అద్దెల భారాన్ని దిగమింగుకుని..స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు పంచే నిత్యావసరాలనే పరమాన్నంగా భావించి కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారు మరెందరో.. సినిమానే లోకం....బతుకే సినిమాగా... సినిమానే లోకం అనుకుని వచ్చేవారు కొందరైతే.. బతుకునే సినిమాగా మలచుకునే వారు మరికొందరు. ఎలాగైనా... వెండితెరపై సింగిల్‌కార్డ్ పడాలిరా....అప్పుడే ఇంటికి తిరిగివస్తానురా మామా! అంటూ పెట్టేబేడా సర్దుకుని కృష్ణానగర్ ఒడిన చేరిపోతుంటారు. సినిమానే లోకం అనుకుని వచ్చేవారు రాజీపడి బతుకునే సినిమాగా మలచుకుంటున్నవారు కష్ణానగర్ గుండెను టచ్ చేస్తే తారసపడతారు. సినిమా షూటింగ్ ఉంటే పండగే...లేదంటే దండగే...అన్నట్లు ఉంటాయి వీరి జీవితాలు. అందుకే వేషాల పైనే ఆధారపడకుండా 24 ఫ్రేమ్స్‌లోని ఏదోఒక రీల్‌ను ఎంచుకుని తమ బతుకు సినిమాను నడిపిస్తుంటారు. రంగుల ప్రపంచంలో అడుగిడిన వారు 24 శాఖల్లో ఏదోఒక దానికి పరిమితమై జీవనం కొనసాగిస్తుంటారు. కానీ కరోనా వారి కలలన్నింటినీ కల్ల చేసింది. చాలామందిని మళ్లీ పెట్టెబేడా సర్ధుకుని సొంతూళ్లకు వెళ్లేలా చేసింది. ఆ స్పాట్లన్నీ బోసిపోయి... 24 శాఖలకు చెందిన వారిది ఒక్కొక్కరిదీ ఒక్కోస్పాట్. తెల్లవారకముందే తమ తమ అడ్డాల వైపు వారి అడుగులు కదులుతాయి. అప్పటికే వాహనాలు రెడీగా ఉంటాయి. వారు రావడంతోనే షూటింగ్ స్పాట్ల వైపు వాహనాలు దూసుకుపోతుంటాయి. ముఖ్యంగా కృష్ణానగర్‌లో డైరెక్టర్ల స్పాట్ అంటే గణపతి కాంప్లెక్స్. ఉదయం నాలుగయ్యిందంటే ఇక్కడ డైరెక్టర్స్, కో–డైరెక్టర్స్‌తో పాటు వేషాల కోసం వారి చుట్టూ తిరిగే వారు తారసపడుతుంటారు. జూనియర్ ఆర్టిస్ట్‌ల స్పాట్ ఇందిరానగర్ గడ్డ. కృష్ణానగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లే మూలమలుపులో ఉన్న ఈ గడ్డే జూనియర్ ఆర్టిస్ట్‌ల ఆశల అడ్డా. పాత వారైతే సరేసరి...కొత్త వారైతే మాత్రం ఏజెంట్లను ప్రసన్నం చేసుకుంటేనే వేషం మరి. అలా ఒకరోజు...రెండు రోజులు కాదు... నెలల తరబడి వేషాల కోసం తిరిగేవారు కూడా ఇక్కడ కనిపిస్తుంటారు. ఇక స్టంట్స్‌కు వేదిక అంటే స్థానిక బాబురావు లాడ్జి ఎదుట లైన్లో గల కార్యాలయమే. ఇలా కాస్ట్యూమ్, మేకప్మేన్లకు వేర్వేరుగా ఉన్న స్పాట్ల వద్దకు వచ్చి వాహనాల్లో షూటింగ్ ప్రాంతానికి వెళ్తుంటారు. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు వారి సందడి ఇక్కడ ఉంటూనే ఉంటుంది. స్పాట్లు వేరైనా మాదంతా ‘సినిమా’ లోకమే అంటారు వీరు. మరి ఇప్పుడు. ఆ ’సీన్’ను కరోనా రివర్స్ చేసేసింది. ఎవరెక్కడ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. నాలుగు నెలల క్రితమే మా జీవితాలు ప్యాకప్ ... కరోనాకు ముందు ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్నట్లుగా చేతి నిండా పని ఉండేది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచీ సినిమా, సీరియల్ షూటింగ్‌లు ప్యాకప్ అయినట్టే మా పనులు కూడా ప్యాకప్ అయిపోయాయి. మా యూనియన్‌లో 40–50 శాతం మంది ఇళ్ల అద్దెలు చెల్లించలేక, కరోనా భయంతో ఊర్లకు వెళ్లిపోయారు. ఈ రోజు కాకపోతే రేపైనా షూటింగ్‌లు జరగకపోవా అన్న ఆశతో ఇంకొందరు వేచి చూస్తున్నారు. రంగాల వైపు వెళ్ల లేరు. కష్టమైనా.. నష్టమైనా సరే అప్పోసొప్పో చేసి బతుకును వెళ్లదీస్తూ షూటింగ్‌లు జరిగే వరకు వేచి చూడక తప్పదు. చిరంజీవి ఛారిటబుల్ సంస్థ నుంచి ఇటీవల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం మాకు కొంతవరకు ఊరటనిచ్చింది. అవే ఇప్పటివరకు మా ఆకలిని తీర్చాయి. – సుధీర్, కాస్ట్యూమర్ అందరి పరిస్థితి అగమ్యగోచరమే... సినిమా షూటింగ్‌లు ఉంటే చేతి నిండా పని ఉండేది. ప్రొడక్షన్లో ఉండేవారందరికీ క్యారియర్లు అందిస్తుంటాను. కరోనాతో షూటింగ్‌లు బంద్ కావడంతో మా క్యారియర్లు కూడా అటకెక్కాయి. వ్యాపారం లేక పూట గడవడమే కష్టంగా మారింది. మా కింద పనిచేసే సిబ్బందికి కూడా ఉపాధి కరువైంది. ఐదు నెలలుగా ఇదే పరిస్థితి ఉంటే బతికేదెట్టా. అక్కడికే పలువురు హీరోలు, మానవతామూర్తులు ఆదుకుంటున్నారు. వారు మాత్రం ఎన్ని రోజులు ఆదుకుంటారు. మళ్లీ షూటింగ్‌లు మొదలైతే తప్ప ఉపాధి దొరకదు. సినిమాపై ఆధారపడ్డ వారి అందరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. –నాగమణి, సినిమా క్యాటరింగ్ సర్వీసెస్ కోలుకోలేని దెబ్బ... సినిమా ఫీల్డ్‌లో విగ్‌లకు డిమాండ్ బాగానే ఉంటుంది. అయితే నాలుగు నెలలుగా షూటింగ్‌లు ఆగిపోవడంతో మా వ్యాపారం కూడా పూర్తిగా పడిపోయింది. షాపు అద్దెలు, ఇంటి అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. కరోనా కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఊహించలేదు. ఆ విభాగం ఈ విభాగం అని తేడా లేకుండా సినిమాలోని 24 శాఖలకు చెందిన కార్మికుల పొట్ట కొట్టింది. ప్రభుత్వం యూనియన్ల వారీగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి సహాయం అందిస్తే బాగుంటుంది. లేనిపక్షంలో మేము ఎప్పుడు కోలుకుంటామో తెలియడం లేదు. –బ్రహ్మాజీ, విగ్స్ సప్లయర్ సాఫీగా సాగే జీవితంపై పిడుగు పడింది కరోనా ముందు వరకు జీవితం సాఫీగా సాగిపోయింది. మా యూనియన్‌లో దాదాపు 650 మంది వరకు ఉంటే సగం మంది ఇక్కడ పనులు లేక ఊర్లకు వెళ్లిపోయారు. ఇక్కడేమో ఇంటి అద్దెల కోసం యజమానులు పీడిస్తున్నారు. కొంతమంది షూటింగ్‌లు ఉన్నప్పుడే అద్దెలు ఇవ్వండంటూ మానవత్వంతో వ్యవహరిస్తున్నారు. మరికొంత మంది అద్దె ఇవ్వండి లేదా ఖాళీ చేయండి అంటూ హుకుం జారీ చేస్తుండటం బాధాకరం. షూటింగ్‌లు బంద్ అయ్యాయి కదా? కనీసం బ్రైడల్ మేకప్‌లు చేసుకుందామన్నా పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నారు. దీంతో మేకప్మెన్ల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. హీరో, హీరోయిన్లకు మేకప్‌లు వేసేవారు మా యూనియన్ సభ్యుల పరిస్థితిని వివరించి కొంతమేర సహాయం చేసేలా చూశారు. కానీ ఇంటి అద్దెలను మాత్రం ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు. –సునీల్, మేకప్ ఆర్టిస్ట్ అద్దెలు భారం, కరోనా భయంతో ఊరికి వచ్చేశా... కరోనా భయంతో బయటకు రావాలంటే బయమేస్తోంది. షూటింగ్లో ఎవరికి కరోనా ఉంటుందోనన్న ఆందోళనతో ఎవరూ రావడం లేదు. నేను కూడా ఊరికి వచ్చేశా. మా యూనియన్‌లో 250 మంది వరకు ఉంటే 50 శాతం వరకు ఊర్లలోనే ఉన్నారు. హైదరాబాద్‌లో కరోనా భయంతో పాటు అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలు ఊర్లోనే ఉంటే బెటర్ అనిపించింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, హీరోలు కొంతమేరకు ఆదుకున్నారు. ప్రభుత్వం కూడా మా పై దయదలిస్తే బాగుంటుంది. –మహిపాల్, లైటింగ్ డిపార్ట్మెంట్ కష్టాలతో ’ఫైట్’ చేయాల్సి వస్తోంది... సినిమాలో ఫైటింగ్‌లతో జీవితాన్ని నెట్టుకువచ్చే మేము ఇప్పుడు కరోనా తెచ్చిన కష్టాలతో ఫైట్ చేయాల్సి రావడం దురదృష్టకరం. మా యూనియన్‌లో 250 మంది వరకు ఉంటే చాలా మంది సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ఉన్నవారు పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్‌లు నిలిచిపోవడంతో చిల్లిగవ్వ ఆదాయం కూడా లేదు. చిరంజీవి సీసీసీ నుంచి నెలకు 2,000 చొప్పున ఇవ్వడంతో పాటు కొంతమంది హీరోలు, నటులు దయదలచి నిత్యావసరాలను అందించడంతో కుటుంబం గడుస్తోంది. షూటింగ్‌లు జరిగే వరకు తాము దాతలపై ఆధారపడక తప్పదేమో? –శ్రీనివాస్, స్టంట్ ఫైటర్ కరోనా సినీ కార్మికుల జీవితాలను చిదిమేసింది... కరోనా వచ్చి మా సినీ కార్మికుల జీవితాలను ఛిద్రం చేసింది. కుటుంబం గడవడమే కష్టంగా మారింది. చాలామంది ఊర్లకు వెళ్లిపోగా..., ఇంకొందరు అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఏదో ఒకచోట చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. నేను మటుకు ఏదీ చేయలేక ఖాళీగా ఉన్నా. మార్చి నుంచి జీతాలు లేవు. యూనియన్ వారు అందించిన నిత్యావసర సరుకులు, కొద్దిపాటి సహాయంతో నెట్టుకువస్తున్నాం. కరోనా భయంతో ఆర్టిస్ట్‌లు రావడానికి కూడా భయపడుతుండటంతో షూటింగ్‌లు జరగడం లేదు. పూర్వ వైభవం ఎప్పటికి వస్తుందో అర్థం కావడం లేదు. –శ్రీను, ప్రొడక్షన్, మేనేజర్ -
పని ఉంటే మస్తు.. లేదంటే పస్తు
సినిమా ఒక అందమైన హరివిల్లు. హరివిల్లులోని ఏడు రంగులు తళతళలాడాలంటే దాని వెనక ఇరవై నాలుగు విభాగాల్లో కొన్ని వందల మంది గడియారంలా నిరంతరం శ్రమించాలి. ప్రేక్షకుడికి సినిమా కేవలం ఉల్లాసాన్నిచ్చే వినోదం కావొచ్చు. కానీ తెర వెనక.. కొన్ని వందల మంది ఉపాధి. ప్రస్తుతం కరోనా సినిమా ఇండస్ట్రీని పని చేయనీకుండా చేసింది. అంటే చాలామందికి పని లేకుండా చేసినట్టే. రీల్ (రెక్క) ఆడితే కానీ డొక్కాడని జీవితాలు కృష్ణానగర్ వీధుల్లో తారసపడుతూనే ఉంటాయి. ‘నేనింతే’ సినిమాలో ఓ పాటలో అన్నట్టు ‘పని (షూటింగ్) ఉంటే మస్తుర మావా.. లేదంటే పస్తుర మావా’ అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. స్పాట్బాయ్, లైట్‌మేన్, జూనియర్ ఆర్టిస్ట్‌లు, ఫైటర్స్, కాస్ట్యూమ్స్, ఆర్టిస్టుల అసిస్టెంట్స్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ టీమ్, డ్రైవర్లు, మహిళా వర్కర్స్.. ఇలా 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న చిన్న స్థాయి కార్మికుల మీద కరోనా ప్రభావం పడింది. స్టూడియోలు ఖాళీగా ఉంటున్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో ఎక్కువ శాతం మంది ఏ రోజు జీతం ఆ రోజు తీసుకునేవాళ్లే. అనుకో కుండా వచ్చిన ఈ బ్రేక్ వల్ల ఎందరో బడ్జెట్ పద్మనాభాల ఆర్థిక ప్రణాళికను కుప్పకూల్చింది. చెప్పాపెట్టకుండా ఊడిపడ్డ ఈ ఇబ్బంది వల్ల ఇంటి బండిని లాగడానికి ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు పలువురు కార్మికులు. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమా పూర్తికావడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాలు పడుతుంది. ఒకరోజు షూటింగ్లో ఆర్టిస్ట్ మీద కెమెరా రన్ అయ్యే ముందు కొన్ని వందల మంది అటూఇటూ పరుగులు తీయాలి. ప్రొడక్షన్ వాళ్లు సెట్లో అడుగుపెట్టడంతో లొకేషన్ పొద్దు పొడుస్తుంది. ఆ తర్వాత లైటింగ్ డిపార్ట్మెంట్, సెట్ అస్టిస్టెంట్లు ఒకరి తర్వాత ఒకరు వస్తారు. సినీ సర్వీస్ సెంటర్లనుంచి కెమెరాలు వస్తుంటాయి. దర్శకుడు తన డైరెక్షన్ టీమ్‌తో ఆ రోజు తీయాల్సిన సన్నివేశాన్ని డిస్కస్ చేసుకుంటారు. ఈలోగా ఆర్టిస్టులు వచ్చి సన్నివేశానికి అనుగుణంగా తయారయి షాట్ రెడీ అయినప్పుడు క్యారవేన్ నుంచి బయటకు వస్తారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ ఒక కాల్షీట్, అదే సాయంత్రం 9 వరకూ షూటింగ్ చేస్తే ఒకటిన్నర కాల్షీట్ కింద లెక్క కడతారు. రాత్రి పన్నెండు వరకు షూటింగ్ కొనసాగితే రెండు కాల్షీట్ల కింద లెక్క పెడతారు. ఇలా ఒక్కరోజు షూటింగ్ కాల్షీట్‌ని బట్టి చాలా విభాగాల వారికి ఏ రోజు పారితోషికం ఆ రోజు అందుతుంటుంది. కుదరని పక్షాన వారం రోజులది ఒకేరోజు పే చేస్తారు. కరోనా కారణంగా లొకేషన్లు పొద్దు పొడవట్లేదు. సెట్లు కాంతివిహీనమయ్యాయి. లొకేషన్లు ఆకలి కేకలు పెడుతున్నాయి. సెట్లో ఎప్పుడూ ఉండే సందడి ప్రస్తుతం లేదు. మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో సరిగ్గా తెలియదు. ఇండస్ట్రీ షూటింగ్స్‌నే బతుకు‘తెర’వుగా పెట్టుకున్న వాళ్లు విలవిలలాడుతున్నారు. ‘వైరస్‌తో పోతామనే భయం కంటే ఆకలి చావులతో పోకుండా ఉండాలి కదా?’ అని కొందరు పేర్కొన్నారు. మా ‘మహిళా వర్కర్స్ యూనియన్’లో మొత్తం 130 మంది ఉన్నాం. నెలకు పది పదిహేను రోజులు పని దొరుకుతుంది. గిన్నెలు కడగడం, అవసరమైతే వంట చేయడం, భోజనాలు వడ్డించడం, వాటర్ క్యాన్లు మోయడం మా పని. ఈ 130 మందిలో కొన్నేళ్లుగా పని చేసి చేసి అలసిపోయినవాళ్లు, ఆరోగ్యం బాగాలేక పని చేయలేనివాళ్లు ఉన్నారు. మిగతావారిలో కొందరికే పని దొరుకుతుంది. ఉదయం 6 గంటలకు మొదలయ్యే కాల్షీట్ రాత్రి 7 వరకూ ఉంటుంది. రోజుకి 785 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు షూటింగ్‌లు బంద్ కావడంతో అదీ లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యూనియన్ వైపు నుంచి ఏదైనా చేద్దామన్నా మా దగ్గర అంత ఫండ్ ఉండదు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే 5 నుంచి 10 వేలు వరకూ ఇవ్వగలుగుతాం. 130 మందిలో మరీ రోజు గడవని పరిస్థితుల్లో 10 మందికి పైనే ఉన్నారు. ఇప్పుడు పని లేక పరిస్థితి దారు ణంగా ఉంది. ఎప్పుడు షూటింగులు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నాం. – టి. లలిత సినీ మరియు టీవీ ప్రొడక్షన్ మహిళా కార్మికుల సంఘం అధ్యక్షురాలు షూటింగ్స్ ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం 24 క్రాఫ్ట్స్‌కి చెందిన అందరికీ ఇబ్బందే. వీళ్లందరిలో చాలా మందికి సినిమా తప్ప వేరే పని తెలియదు.. రాదు. అనూహ్యంగా ఎదురైన ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో చాలామందికి అర్థం కావడంలేదు. మార్చి 31 వరకూ షూటింగ్స్ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అన్ని రోజులు అంటే అన్ని విభాగాల వారికీ ఇబ్బందే. అందుకే ఈ నెల 21 నుంచి షూటింగ్స్ని మళ్లీ జరుపుకునేలా పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నాం. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, తక్కువమంది యూనిట్‌తో షూటింగ్ జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నాం. 20 రోజులు షూటింగ్స్ లేకుండా ఉంటే సినిమా తయారవడానికి పని చేసే ప్రతి ఒక్కరికీ నష్టమే. – కొమర వెంకటేష్ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి మా యూనియన్‌లో దాదాపు 1300 మంది ఉన్నారు. నెలలో పదిహేను రోజులే మాకు పని ఉంటుంది. అదీ అందరికీ ఉండదు. రోజుల తరబడి పనిలేనివారు కూడా ఉంటారు. ఇప్పుడు కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోయాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు వేరే ఆదాయ మార్గం కూడా లేదు. ఒక సినిమా షూటింగ్ జరగాలంటే ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, లైట్‌మెన్స్.. ఇలా కనీసం రెండొందలమందైనా సెట్లో ఉండాలి. కరోనా వైరస్ కారణంగా గుంపులుగా ఉండి పని చేయకూడదని చెప్పారు. చేతిలో పని లేదు. ఊరికి వెళదామన్నా డబ్బులు లేవు. నిర్మాతలు మాత్రం ఏం చేస్తారు. షూటింగ్స్ అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల నిర్మాతలు కూడా డబ్బులు సర్దుబాటు చేయలేని పరిస్థితి. సినిమా షూటింగ్స్ ఈ నెల 31వరకు ఆగిపోయాయి. నాకు తెలిసి మా యూనియన్‌లో దాదాపు 75శాతం మంది అద్దెలు కట్టుకునేవారే. ఒకటో తారీఖు అద్దె, పాల బిల్లు.. ఇలా కట్టాల్సినవి చాలా ఉంటాయి. చాలామంది ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. – ఎ. శ్రీనివాస్ లైట్‌మెన్ యూనియన్ అధ్యక్షుడు -
డాన్స్ ఫైట్.. వీరేబాస్..
సినిమా అంటే ఓ నాలుగు పాటలు... ఓ నాలుగు ఫైట్లు అనే ధోరణి చాలామందిలో ఉంటుంది. కానీ వాటిని తెరమీదకు తీసుకొచ్చేందేకు పడే కష్టం అంతాఇంతా కాదు. తాము కంపోజ్ చేసిన డ్యాన్స్ లేదా ఫైట్‌ను అంతేఅద్భుతంగా తెర మీదచూపేందుకు ఎంతో కష్టపడతారు మాస్టర్లు. సినిమాకు ప్రాణమైన డ్యాన్స్, ఫైట్లను కంపోజ్ చేసే కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్లర్లకు కేంద్రం కృష్ణానగర్. వీరికి సహాయ సహకారం అందించే డ్యాన్సర్లు, ఫైటింగ్ కళాకారులకూ ఇదే అడ్డా. బంజారాహిల్స్: ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్లు, జూనియర్ ఆర్టిస్ట్‌లను చెన్నై నుంచి దిగుమతి చేసుకొనేవారు. కానీ తర్వాతి కాలంలో యూనియన్లు ఏర్పడ్డాయి. సినీ అవకాశాల కోసం వచ్చేవారు కృష్ణానగర్‌ను అడ్డాగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది జూనియర్ ఆర్టిస్ట్‌లుగా ఇక్కడ అవకాశం పొందుతున్నారు. దీంతో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పింది. ఇక ఫైట్ మాస్టర్లూ గతంలో చెన్నై నుంచే వచ్చేవారు. వారు కూడా ఇప్పుడు నగరంలోనే అందుబాటులో ఉన్నారు. అంతా కృష్ణానగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లోనే వీరుంటున్నారు. తెర వెనుక హీరోలు... గతంలో డ్యాన్స్ లేదా ఫైట్ గురించి ముందుగా దర్శకత్వం విభాగంతో చర్చించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇన్‌స్టంట్‌గా అన్నీ కావాలని డైరెక్టర్లు కోరుకుంటున్నారు. అనుభవమున్న ఫైట్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు తెరపై తమ ప్రతిభ చూపుతున్నారు. తెరపై హీరోలు అద్భుతంగా డ్యా న్స్ చేసినా, ఆహా.. అనుకునేలా ఫైట్లు చేసినా... ఆ కష్టమంతా తెరవెనుకున్న వీరిదే. డ్యాన్స్ విషయం లో హీరాలాల్ మాస్టర్ సినీ పరిశ్రమకు ఓ గుర్తింపు తీసుకొచ్చారు. అప్పుడు కేవలం ఐదారుగురే డ్యా న్సర్లు ఉండేవారు. సలీం మాస్టర్ వచ్చిన తర్వాత ఆ సంఖ్య 20 వరకు చేరింది. అయితే అప్పుడు తమిళం, మళయాలం, భోజ్‌పురి, తెలుగు, కన్నడ... ఇలా అన్ని భాషాలకు వీరే మాస్టర్లుగా ఉం డేవారు. యూనియన్లు ఏర్పడిన తర్వాత డ్యాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లతో పాటు జూనియర్ ఆర్టిస్ట్‌లకు ఇక్కడే అవకాశాలు లభిస్తున్నాయి. ఒకప్పుడు చాలా తక్కువ మంది ఫైట్ మాస్టర్లు ఉండేవారు. దీంతో చెన్నై నుంచి మాస్టర్లు వచ్చేవారు. అయితే స్థానిక యూనియన్లు ఏర్పాటుతో పరిస్థితి మారింది. ఇందిరానగర్, కృష్ణానగర్‌లలోని యూనియన్లలోనే చాలామంది సభ్యత్వం తీసుకున్నారు. రామ్‌లక్ష్మణ్, విజయ్, సాల్మాన్రాజ్ తదితర మాస్టర్లు ఇక్కడివారే. ఒకప్పుడు సినిమాల్లో ప్రమాదకర సన్నివేశాల్లో హీరోలకు డూపుగా ఫైట్ మాస్టర్లు లేదా జూనియర్ ఆర్టిస్టులు నటించేవారు. అయితే ఇప్పుడు కొంతమంది కథానాయకులు తామే సొంతంగా చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. దీంతో కొంతమంది కథానాయకులు ఇప్పటికీ డూప్‌లకే ప్రాధాన్యమిస్తున్నారు. డూప్ టు రియల్...గుర్తుండిపోవాలి... సినిమాల్లో కొరియోగ్రాఫర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలినాళ్లలో దర్శకులు కథను చెప్పి అందుకనుగుణంగా డ్యాన్స్ కంపోజ్ చేయమని చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రాక్ ఇచ్చి డ్యాన్స్ కావాలంటున్నారు. అది ఒకరోజు ముందుగా ఇస్తారంతే.. అయితే అనుభవమున్న కొరియోగ్రాఫర్లకు ఇదేం పెద్ద సమస్య కాదు. నేను ఇప్పటికి దాదాపు 800 సినిమాలు చేశాను. భారతీరాజా దర్శకత్వంలో మొదలైన నా ప్రయాణం తాజా ఆర్ఎక్స్ 100 వరకు కొనసాగుతూనే ఉంది. కొరియోగ్రఫీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలన్నదే నా అభిప్రాయం. – స్వర్ణ, డ్యాన్స్ మాస్టర్ మళ్లీ రియల్... తొలి రోజుల్లో ప్రమాదకర సన్నివేశాల్లో డూపులుగా నటించాల్సి వచ్చేది. అయితే టెక్నాలజీ రావడంతో చాలా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ మాయాజాలం ఉండేది. కానీ మళ్లీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డూపు సన్నివేశాలను ప్రేక్షకులు కోరుకోవడం లేదు. దీంతో చాలామంది హీరోలు సహజంగా నటించేందుకే మొగ్గు చూపుతున్నారు. రంగస్థలం సినిమాలో అంతా సహజత్వం ఉట్టిపడుతుంది. ఇందులో చాలామంది కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్‌లు అవకాశం పొందారు. – రామ్‌లక్ష్మణ్, ఫైట్ మాస్టర్లు సొంతంగాస్టూడియోలు... ఒకప్పుడు డ్యాన్స్, ఫైట్స్‌కు సంబంధించి లోకేషన్లోనే రిహార్సల్స్ ఉండేవి. దీంతో జూనియర్ ఆర్టిస్ట్‌లకు డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రముఖ హీరోలందరికీ సొంతంగా స్టూడియోలు వచ్చాయి. డ్యాన్స్, ఫైట్, జిమ్.. ఇలా ఏదైనా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. మాస్టర్లు అక్కడికే వెళ్లి నేర్పిస్తున్నారు. దీంతో జూనియర్ ఆర్టిస్ట్‌లకు అవకాశాలు తగ్గాయి. -
సెలవుపై వెళ్లి... డూప్‌గా మారి
ఒకరు బాలయ్యలా భారీ డైలాగులతో ఈరగదీస్తే.. మరొకరు ఏఎన్నార్‌లా స్టెప్పులతో స్టేజీపై కేక పుట్టిస్తారు. వాళ్లను చూస్తే నిజంగా హీరోలని చాలామంది భావిస్తారు.. భ్రమిస్తారు. ఆ మేనరిజం, హావభావాలు అచ్చు అలాగే ఉంటాయి మరి! ఆయా హీరోలకు జిరాక్స్‌లుగా, తెరపై సూపర్ డూపర్‌గా నటించిన ‘డూప్’ క్యారెక్టర్లకు ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం ఉండేది. అయితే టెక్నాలజీ నేపథ్యంలో, గ్రాఫిక్స్ మాయాజాలంతో డూప్ క్యారెక్టర్లకు ఆదరణ, అవకాశాలు రెండూ తగ్గాయి. ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు తదితరులతో మొదలైన డూపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్: కృష్ణానగర్ అంటే బట్టలు, సెట్టింగ్‌లు, కెమెరాలు, మెస్ తదితర సామాగ్రి మాత్రమే కాదు... మనుషులను పోలిన మనుషులూ ఇక్కడ అద్దెకు దొరుకుతారు. అసలైన హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా అభిమానులను అలరిస్తారు.. అచ్చంగా వారినే అనుకరిస్తారు. సినిమాల్లో హీరోలకు డూప్‌లుగా క్యారెక్టర్ వేసే వీరు... ఖాళీ సమయాల్లో స్టేజీ షోలు, ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొని అలరిస్తుంటారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్‌కల్యాణ్... ఇలా ప్రతి ఒక్కరీ డూప్‌లు ఇప్పుడు చాలామంది కనిపిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్.. భలే హిట్ బ్లాక్ అండ్ వైట్ సినిమా ప్రపంచంలో డూప్‌లకు భలే డిమాండ్ ఉండేది. ఫైటింగ్, జంపింగ్ తదితర సాహసోపేతర సన్నివేశాలకు డూప్‌లను ఆశ్రయించేవారు. ఇక డబుల్ యాక్షన్ సినిమాల్లో డూప్ పాత్రలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు సత్యనారాయణ డూప్‌గా చేయగా, కృష్ణానగర్‌లో నివసించే మూర్తి ఏఎన్నార్‌కు డూప్‌గా పని చేశాడు. చాలా సినిమాల్లోనూ వీరు ఆయా హీరోల పాత్రల్లో కనిపించారు. ‘మనం’ సినిమాలోనూ ఏఎన్నార్ డూప్‌గా మూర్తి చేశాడు. అదే విధం గా ఇక్కడే నివసిస్తూ అక్కినేనితో కాలేజీ బుల్లోడు, కలెక్టర్ గారి అబ్బాయి తదితర సినిమాల్లో నటించిన జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఏజెంట్ ఘంటసాల అందరికీ సుపరిచితమే. ఇక చిరంజీవిని పోలి ఉండే రాజ్‌కుమార్ ఆయన డూప్‌గా సుపరిచితం. అప్పట్లో ఒక్కో హీరో రోజుకు రెండు, మూడు సినిమాల్లో చేసేవారు. ఈ నేపథ్యంలోనే చిన్ని చిన్న సన్నివేశాల్లో డూప్‌లకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేవారు. టెక్నాలజీ వచ్చింది.. ఆదరణ తగ్గింది సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ కాలం మారిపోయి.. రంగుల ప్రపంచం రావడం, దానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డూప్‌లకు ప్రాధాన్యం తగ్గింది. ప్రధానంగా డబుల్ యాక్షన్ సినిమాల విషయంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒకే హీరోను ఇద్దరిగా చూపిస్తున్నారు. దీంతో డూప్‌ల అవసరం తగ్గుతూ వచ్చింది. అలాగే సాహసోపేత సన్నివేశాలను గతంలో డూప్లతో చిత్రించేవారు. అయితే ఇప్పుడు పూర్తిగా గ్రాఫిక్స్ టెక్నాలజీ రావడంతో అలాంటి వారికీ అవకాశాలు తగ్గిపోయాయి. చాలా సినిమాల్లో ఇప్పుడు గ్రాఫిక్స్‌నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దీంతో డూపులకు చాలా మేరకు అవకాశాలు లేకుండా పోయాయి. అక్కినేనితోఅనుబంధం.. అక్కినేని నాగేశ్వరరావుకి డూప్‌గా చాలాసార్లు చేశాను. ఓ సినిమాలో అయితే 10 రోజులు షూటింగ్లో పాల్గొన్నారు. రోజుకు రూ.400 చెల్లించారు. అక్కినేని నటించిన చివరి సినిమా ‘మనం’లోనూ ఆయనకు డూప్‌గా చేసినందుకు ఆనందంగా ఉంది. – మూర్తి, ఏఎన్నార్ డూప్ అవకాశాల్లేవ్... అప్పట్లో డూప్‌లకు చాలా అవకాశాలు ఉండేవి. కానీ టెక్నాలజీ మారడంతో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. సినిమాల్లో డూప్లతో చేయించేందుకు ఆసక్తి చూపడం లేదు. అవసరమైతే టెక్నాలజీ ద్వారా ఆ ఖాళీని భర్తీ చేస్తున్నారు. నేను 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో స్టేజీ షోల్లో బాలకృష్ణ గారిలా అందరినీ అలరించాను. ‘ఆట’ సినిమాలో బాలయ్య వేషం వేశాను. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాను. – దివాకర్, బాలకృష్ణ డూప్ ప్రేమతో ప్రజల్లోకి... మా నాన్న సూపర్‌స్టార్ కృష్ణ దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. అలా సినీ పరిశ్రమపై ప్రేమ పెరిగింది. దీనికి తోడు పవన్‌కల్యాణ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనలా వేషం వేసేవాడిని. ఈ క్రమంలో ‘అంతర్వేది టు అమలాపురం టైటానిక్ షిప్’ పేరుతోఈ మధ్య విడుదలైన సినిమాలో గబ్బర్ సింగ్ వేషం వేశాను. అలాగే చాలా స్టేజీ షోల్లో పాల్గొన్నాను. హీరోలపై ప్రేమతో మేము ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల ఆదరాభిమానాలు పొందగల్గుతున్నాం. – బాబీ, పవన్‌కల్యాణ్ డూప్ సెలవుపై వెళ్లి... డూప్‌గా మారి నేను కాకినాడ నగర పాలక సంస్థలో ఉద్యోగం చేసేవాడిని. సినిమాలంటే చాలా ఇష్టం. మోహన్‌బాబు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఆయనలా డైలాగులు చెప్పడం, హావభావాలు పలికించడంతో అచ్చం మోహన్‌బాబులా చేస్తున్నానని అనేవారు. దీంతో నన్ను నేను మోహన్‌బాబులా మార్చుకున్నాను. ఉద్యోగానికి సెలవు పెట్టి, సినీ అవకాశాల కోసం ప్రయత్నించాను. అలా చెన్నైలో మోహన్‌బాబును కలుసుకున్నాను. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. రెండు, మూడు సినిమాల్లో డూప్‌గా మోహన్‌బాబు అవకాశం కల్పించారు. ఇక ఆయన కుమార్తె మంచు లక్ష్మీ తాను నిర్వహించిన ‘లక్ష్మీ టాక్ షో’ ద్వారా నన్ను మోహన్‌బాబు డూప్‌గా ప్రపంచానికి పరిచయం చేశారు. ఇవన్నీ మరిచిపోలేని సంఘటనలు. – చావలివిశ్వేశ్వర్రావు, మోహన్‌బాబు డూప్ -
స్వరకాయ ప్రవేశం
బంజారాహిల్స్: తెరపై పాత్ర హావభావాలు మనల్ని కట్టిపడేస్తాయి. అయితే తెరవెనుక ఆ భావాలు పలికించేది మరో పాత్ర. సినిమాలోని పాత్రలకు ప్రాణం పోసేది డబ్బింగ్. సినీ ఇండస్ట్రీలో మాటల మాంత్రికులకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. చాలామంది నటీనటుల పాత్రలకు తమ గొంతుతో డబ్బింగ్ కళాకారులు ప్రాణం పోస్తున్నారు. తెరవెనుక రారాజులుగా నిలుస్తున్నారు. కదిలే బొమ్మలకు స్వరదాతలుగా నిలుస్తూ తెరమీద ఆటను రక్తికట్టిస్తున్నారు. నవరసాలను పలికిస్తూ అద్భుత: అనిపిస్తున్నారు. సినిమా తీయడం ఎంత కష్టమో, పాత్రలకు తగిన విధంగా డబ్బింగ్ చెప్పడం అంతే కష్టం. పాత్రలకు అనుగుణంగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. తెరపై మనకు కనిపించే ఇలియానా, త్రిష, సమంత, అనుష్క, రకుల్‌ప్రీత్‌సింగ్, కాజల్, ప్రభుదేవా, మమ్ముటి, కమల్‌హాసన్, రజనీకాంత్, మోహన్‌లాల్... ఇలా చాలామందికి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులు కృష్ణానగర్, ఇక్కడి పరిసర ప్రాంతాల వారే. కేవలం డబ్బింగ్ ఆర్టిస్టులే కాదు.. సౌండ్ ఇంజినీర్లు, ఎడిటŠూర్ల ఇక్కడున్నారు. ఇక డబ్బింగ్ స్టూడియోలకు కృష్ణానగర్ కేంద్రమని చెప్పొచ్చు. సినిమా, సీరియల్ ఏదైనా సరే... డబ్బింగ్ ఇక్కడే. ఇదొక కళ... డబ్బింగ్ ఒక కళ. కేవలం మాటలు వస్తే సరిపోదు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. డబ్బింగ్ ఆర్టిస్టుకు ముందుగా సీన్లపై పట్టుండాలి. భాషా స్పష్టంగా ఉండాలి. డైలాగులు అనర్గళంగా చెప్పాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, నవరసాలు పండించాలి. ఒక విధంగా చెప్పాలంటే తెర వెనుక వీరంతా నటించాల్సి ఉంటుంది. అప్పుడే వారు చెప్పే డైలాగులలో భావం ఉట్టిపడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా... కొత్త బంగారు లోకంలో ‘ఎకాడా...’ అంటూ శ్వేతబసుప్రసాద్ చెప్పిన, శ్రీమంతుడులో ‘ఊరికి ఎంతో కొంత ఇవ్వాలి. లేదంటే లావైపోతాము’ అంటూ శ్రుతిహాసన్ పలికించిన భావాలు అస్సలు మరిచిపోలేం. ఈ ఇద్దరికీ గాత్రదానం చేసింది డబ్బింగ్ ఆర్టిస్ట్ హరిత. ఇలియానా, తమన్నా, శ్రుతిహాసన్, నివేదాథామస్, రకుల్‌ప్రీత్‌సింగ్... ఇలా చాలామంది తారలకు ఆమె గాత్రదానం చేశారు. ఒక్కో నటితో దాదాపు రెండు, మూడు సినిమాలు చేసింది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా, సినిమా పాత్రలకు అనుగుణంగా గొంతును సవరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు హరిత. వర్షాకాలంలో ఇబ్బంది... నేను చాలామంది విలన్లకు డబ్బింగ్ చెప్పాను. టీవీ షోల్లోనూ నా గొంతు వినిపిస్తుంటుంది. డబ్బింగ్ ఆర్టిస్టులు గొంతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో జలుబు తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కో పాత్ర మాకు చాలెంజింగ్‌గా ఉంటుంది. – డాక్టర్ రాధాకృష్ణారెడ్డి,డబ్బింగ్ ఆర్టిస్ట్ సాంకేతిక దన్ను... డబ్బింగ్ స్టూడియోలన్నీ దాదాపు కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. ఒకప్పుడు డబ్బింగ్ చెప్పడం కష్టంగా ఉండేది. మూడు లైన్ల స్క్రిప్ట్‌ను ఒకే టేక్‌లో చెప్పాల్సి వచ్చేది. అప్పుడు వీడియో క్యాసెట్లు ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ముక్కలు ముక్కలుగా చేసి, మాటలను అతికించేసి కనికట్టు చేస్తున్నారు. అంతటి సాంకేతికత ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. రికార్డింగ్, సింకింగ్, మిక్సింగ్.. ఇలా అన్నింటినీ ఇప్పుడు తేలికగా చేసే వీలుందని చెప్పారు సౌండ్ ఇంజినీర్ రాంరెడ్డి. ఇక డబ్బింగ్ కళాకారులకు ఇప్పుడు మంచి ఉపాధి లభిస్తోంది. సీన్ల వారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు మొదలు వివిధ రంగాల్లోని వారు డబ్బింగ్ చెప్పేందుకు ఆసక్తి చూపుతున్నారు. సులువేం కాదు.. డబ్బింగ్ చెప్పడం సులువేం కాదు. సినిమాలోని పాత్రలు, అందులోని సందర్భం, డైరెక్టర్ ఆలోచనలకు అనుగుణంగా డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. ఒకే నటికి ఎక్కువసార్లు గాత్రదానం చేసినప్పుడు, ఆయా సినిమాల్లోని పాత్రలకు అనుగుణంగా చెప్పాల్సి వస్తుంది. డైలాగ్ చెప్పే రీతిని బట్టే, అది హిట్టవుతుంది. – హరిత, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఈజీ... గతంతో పోలిస్తే డబ్బింగ్ రికార్డింగ్ ఇప్పుడు చాలా సులువైంది. గతంలో రికార్డింగ్ చేయాలంటే క్యాసెట్లతో చేయాల్సి వచ్చేది. అందులోనూ పెద్దపెద్ద డైలాగులు చెప్పాలంటే డబ్బింగ్ కళాకారులకు ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో ఈ సమస్య తీరింది. – శేఖర్, సౌండ్ ఇంజినీర్ -
కృష్ణానగర్ టిఫిన్.. ఆ టేస్ట్ వేరు..
ఒక్క సినిమా.. అందులోని ఒక్క పాట.. సినిమా వాళ్ల జీవితాలను కళ్లముందుంచింది. కళామతల్లిని నమ్ముకుని 24 క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న వారి జీవన శైలిని ‘నేనింతే..’ సినిమా ద్వారా పూరీ జగన్నాథ్ కళ్లకుకట్టాడు. ప్రేక్షకులను రంగుల ప్రపంచంలోకి తీసుకువెళ్లే సినిమా వాళ్లకు ఉదయం నోరూరించే టిఫిన్ దగ్గర్నుంచి మధ్యాహ్నం అమోఘమైన లంచ్, రాత్రి వేళలో పసందైన డిన్నర్‌ను అందించేందుకు ఏళ్లుగా కొన్ని ఆహార కేంద్రాలు పనిచేస్తున్నాయి. బంజారాహిల్స్: కృష్ణానగరే మామ.. కృష్ణానగరే మామ.. అంటూ సాగే పాటను ‘నేనింతే..’ సినిమా కోసం పూరి జగన్నాథ్ స్వయంగా దగ్గరుండి రాయించుకున్నాడు. 24 క్రాఫ్టులకు వేదికైన ఈ ప్రాంతం ఎంతో మంది కళాకారులకు ఆవాసం.. అలాంటి ఈ ప్రాంతం కేవలం ఔత్సాహిక కళాకారులకే కాదు.. ఎంతో మందికి జీవనమిస్తోంది.. ఎందరికో జీవితాన్ని ఇస్తోంది.. అన్నం పెట్టే అన్న‘పూర్ణ’ ప్రాంతంగా నిలుస్తోంది.. అందుకే.. కృష్ణానగర్‌లో ఏ ఘట్టమైనా అమోఘమే.. చవులూరించే రుచులను పంచే అద్భుతమే.. సినిమా పరిశ్రమ నగరానికి తరలివచ్చింది మొదలు.. ఇక్కడే అనేక రకాల ఆహార కేంద్రాలు సినిమా పరిశ్రమతో ముడిపడి నాటికి.. నేటికి రుచులను పంచే కృష్ణానగర్ ప్రాంతంగా నిలుస్తున్నాయి. అల్పాహారం, భోజనం ఇక్కడి నుంచే.. సినిమా పరిశ్రమకు కృష్ణానగర్ ప్రాంతం ఎంతో ప్రత్యేకం. పూరి జగన్నాథ్ పాట రాయించుకోవడం వెనుక కృష్ణానగర్‌కు ఉన్న గొప్పతనమది. కృష్ణానగర్‌లోనే తన జీవితం మొదలైన నేపథ్యంలో ఆయనకున్న ప్రత్యేక అభిమానంతో కృష్ణానగర్‌పై ఆయన సినిమాలో పాట రూపుదిద్దుకుంది. ఔత్సాహిక కవులు, కళాకారులు, కథారచయితలు, సంగీత దర్శకులు, నిర్మాతలు, దర్శకులు చాలా మంది ఇక్కడి నుంచి ఎదిగిన వారే ఉంటారు. అభిమానులకు మంచి సినిమాలను అందించే సినిమా పరిశ్రమకు మంచి రుచి గల అల్పాహారం నుంచి మొదలుకొని భోజనాలు ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. ఇలా సినీ పరిశ్రమ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి వారితో ముడిపడి ఉన్నాయి. ఇవి లేకుంటే అసం‘పూర్ణ’మే..! కృష్ణానగర్‌లోని ఓ చిన్న గల్లీలో ఉండే అల్పాహార కేంద్రం పూర్ణ టిఫిన్ సెంటర్. ఈ పేరు చెప్పగానే హీరోలు అభిమానులకు ఎంత పరిచయమో ఇండస్ట్రీలోనూ ప్రతి ఒక్కరికి పరిచయం అవసరం లేని ప్రాంతం. ఇదే కాదు.. మంగ టిఫిన్ సెంటర్, ఆర్ఆర్ ఇలా అనేక అల్పాహార కేంద్రాలు ఇక్కడ సినీపరిశ్రమతో కలిసి పాతికేళ్లకు పైగా ప్రయాణం చేస్తున్నాయి. అక్కినేని వంశానికి చెందిన మూడు తరాలు అప్పటికీ, ఇప్పటికీ పూర్ణ టిఫిన్ సెంటర్ నుంచే అప్పుడప్పుడే అల్పా హార రుచిని చూస్తుంటారు. అలాగే మంచు కుటుంబం, దాసరి కుటుం బం, అల్లు, చిరంజీవి ఇలా ప్రతి ఒక్కరూ ఇక్కడి రుచులు నేటికి చూస్తున్నవారే. ఇక్కడ లభించే నేతి ఇడ్లీలు, ఉప్మా పెసరట్టు రుచులు పరిశ్రమలోని ప్రతి ఒక్కరిని ఇటువైపు ఇప్పటికి వచ్చేలా చేస్తున్నాయి. ఇక మంగ, ఆర్ఆర్, నారాయణ టిఫిన్ సెంటర్ ఇలా అనేక రకాల టిఫిన్ సెంటర్లు నాటి తరం నుంచి నేటి తరం వరకు రుచిని చూపుతున్నాయి. అక్కడ లొకేషన్..కృష్ణానగర్‌లో ప్రిపరేషన్ సినిమా ఇండస్ట్రీకి అవసరమైన ఆహారమంతా కృష్ణానగర్ ప్రాంతం నుంచే వెళ్తుంది. కృష్ణానగర్‌లో ఇలా సినిమా షూటింగ్‌లకు ఆహారాన్ని సరఫరా చేసే దాదాపు ఐదారు కేంద్రాలున్నాయి. షూటింగ్ షెడ్యూలు, వారి మెనూకు అనుగుణంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళ ఇక్కడి నుంచే వంటలు వండి పంపుతారు. వెజ్, నాన్‌వెజ్ అంతా ఇక్కడ వండి వేడివేడిగా క్యారేజీలలో పెట్టి పంపుతారు. ఇందుకోసం ప్రత్యేక క్యారేజీలను ఏర్పాటు చేస్తారు. ఒకేసారి వందల మందికి ఇక్కడి నుంచి వండి తీసుకెళ్లడమే కాకుండా వేడివేడిగా వడ్డిస్తారు. కేవలం నగరంలో జరిగే షూటింగ్ లోకేషన్లకే కాదు.. పెద్ద సినిమాలు దేశంలో ఏ మూలన షూటింగ్ జరిగినా వీరిని వెంట తీసుకెళ్తారు. అంతలా ఇండస్ట్రీతో ఈ రంగం పెనవేసుకొంది. కృష్ణానగర్‌లో దాదాపు పాతికేళ్లకు పైగా ఉన్న రమేష్ మెస్, సూపర్‌గుడ్ మెస్, బాబాయిమెస్లతోపాటు సత్తార్, సాయిగణేష్ ఇలా అనేక రకాలైన మెస్‌లు సినీ పరిశ్రమకు అవసరమైన భోజన రుచులను అందిస్తున్నాయి. అద్దెకు ఇక్కడి నుంచే.. సినిమా షూటింగ్ లోకేషన్లకు అవసరమైన క్యారేజీలు కృష్ణానగర్ ప్రాంతంలోనే అద్దెకిస్తారు. ఇలాంటి అద్దెకిచ్చే వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. టిఫిన్‌కు, భోజనానికి ప్రత్యేకంగా తయారు చేయించిన పెద్దపెద్ద క్యారేజీలను అవసరమైన వారికి వీరు అద్దెకు ఇస్తుంటారు. ఇలా రోజులవారీగా లేక నెలల వారీగా అద్దెకు ఇస్తుంటారు. వీరిచ్చే క్యారేజీలు ఎంతమందికి భోజనం కావాలన్నా అందించేలా ఉంటాయి. ఒక్క పెద్ద క్యారేజీ తీసుకొంటే దాదాపు 20 నుంచి 27 మందికి సరిపోయేలా సెటప్ చేసి ఇస్తుంటారు. ఇలా ఎంతమందికి కావాలన్నా ఆ సంఖ్యకు అనుగుణంగా క్యారేజీలను అద్దెకిస్తుంటారు. కేవలం క్యారేజీలే కాకుండా వారికి అవసరమైన ప్రతి వస్తువును ఇక్కడ అద్దెకిస్తారు. ఇరవై ఏళ్లకు పైగా.. సినిమా ఇండస్ట్రీతో దాదాపు 20ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. 1994లో ఈ టిఫిన్ సెంటర్ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు ఇక్కడి నుంచి అనేక మంది టిఫిన్ తీసుకెళుతుంటారు. ఇండస్ట్రీలో దాదాపు మూడు తరాల వారికి మా టిఫిన్ రుచిని చూపిస్తూ వస్తున్నాం. అప్పటికి ఇప్పటికీ అదే రుచి. అందుకే.. ప్రతి ఒక్కరూ ఎంతో అభిమానిస్తారు. ఇక్కడి నుంచి పలువురు సినీప్రముఖులు, రాజకీయ ప్రముఖులకు ప్రతి రోజు పార్శిల్ పంపుతుంటాం. వారికే కాదు.. ఇక్కడ ప్రతి ఒక్కరికి అందించే టిఫిన్ విషయంలో తేడా లేకుండా జాగ్రత్తగా నిర్వహిస్తున్నాం. – నాగేశ్వర్రావు, పూర్ణ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు షూటింగ్‌లకు అద్దెకిస్తాం.. సినిమా షూటింగ్‌లకు అవసరమైన భోజనం, టిఫిన్, టీ, తాగునీరు సరఫరా చేసే సామాగ్రినంతా అద్దెకిస్తాం. 20 ఏళ్లకు పైగా ఇక్కడే ఉంటున్నాం. అవసరాలకు అనుగుణంగా, సంఖ్యకు అనుగుణంగా క్యారేజీల బరువును పెంచుతూ వస్తున్నాం. ఇక్కడి నుంచి రోజుల వంతున, నెలల వంతున అవసరానికి అనుగుణంగా ఆయా సామాగ్రినంతా అద్దెకిస్తాం. దాదాపు వెయ్యి మందికి సరిపోయేలా అద్దెకిచ్చేటువంటి సామాగ్రిని అందుబాటులో ఉంచుతాం. కేవలం నగరంలో షూటింగ్లకే కాకుండా ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరిగినా ఇక్కడి నుంచే అద్దెకి తీసుకెళ్తుంటారు. – నాగమణి, కృష్ణానగర్ ఎక్కడైనా అందిస్తాం.. దాదాపు పాతికేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాం. వందలాది సినిమా షూటింగ్‌లకు భోజనం అందించాం. సినిమా ఇండస్ట్రీలో అవసరమైన వారికి వారి మెనూ ప్రకారం భోజనం వండి పంపిస్తాం. వెజ్‌లో ఆరు రోజులపాటు వేర్వేరు వంటకాలు ఉండేలా చూసుకుంటాం. నాన్‌వెజ్‌లో ఇంటి భోజనాన్ని తలపించేలా చేసి ఇస్తాం. ఇక్కడే కాదు.. వేరే ప్రాంతానికి వెళ్లినా.. మమ్మల్ని తీసుకెళ్తారు. ఒక్కోసారి నెలరోజుల షెడ్యూల్‌కు తగిన విధంగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం. బాహుబలి సినిమాకు అందులోని తారాగణానికి రుచిని చూపే అవకాశం దక్కడం అదృష్టం. – మన్నె శ్రీను, మెస్ నిర్వాహకులు, కృష్ణానగర్ -
కృష్ణానగర్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం
-
కృష్ణానగర్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హార్డ్‌వేర్ షాపులో షార్ట్ సర్య్కూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భారీ శబ్ధాలతో పేయింట్ డబ్బాలు పేలాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. జీహెచ్ఎంసీ సిబ్బంది క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్ కృష్ణనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
-
ఫ్యాషన్ మాయ. .మారింది మామ..
తెరపై మెరవాలంటే ఆహార్యం అదిరిపోవాలి. సినిమాకో గెటప్‌లో ప్రేక్షకులను అలరించాలి. శోభన్‌బాబు, ఎన్టీఆర్, ఏఎన్నార్,ఎస్వీఆర్, కృష్ణ... ఇలా ఎందరికో విభిన్న లుక్లిచ్చి, తెరపై క్లిక్‌మనిపించిన ఘనత కృష్ణానగర్కే దక్కింది. రింగురింగుల జుట్టుతో శోభన్‌బాబును, గుబురు జుట్టుతో ఎన్టీఆర్‌ను అద్భుతంగా చూపించిన ప్రతిభ ఇక్కడి ఆర్టిస్టులకే సొంతమైంది. ఆనాటిసినిమాల నుంచి నేటి బాహుబలి వరకు హీరోహీరోయిన్లగెటప్లకు సంబంధించి అన్నీ కృష్ణానగర్నే అందించింది.అయితే పరిస్థితులు మారాయి. పద్ధతులు మారాయి.ఫ్యాషన్ మారింది. కట్టుబొట్టులో ఎన్నో మార్పులు వచ్చాయి.కానీ పని మాత్రం ఇక్కడి నుంచే కొనసాగడం విశేషం. బంజారాహిల్స్: తెరపై కథానాయకులు, కథానాయికల వేషధారణ ఎంతో ముఖ్యం. తలకట్టుతో పాటు డ్రెస్సింగ్ ఇందులో కీలకం. ఒకప్పుడు విగ్గుల నుంచి మొదలు వేషధారణలకు అనుగుణంగా రూపొందించే దుస్తుల డిజైన్లన్నీ కృష్ణానగర్‌లోనే రూపుదిద్దుకునేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, ఎస్వీఆర్, కాంతారావు.. ఇలా ఎంతోమంది కథానాయకులకు కావాల్సిన విగ్గులను ఇక్కడి వారే తయారు చేసి అందించేవారు. ఒకప్పుడు విగ్గులను పెట్టడం చాలా కష్టంగా ఉండేది. పాతికేళ్ల కిందట విగ్గులను నట్ల సాయంతో అమర్చేవారు. దీంతో ధరించే వారికి కొంత భారంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నట్ల స్థానంలో క్లిప్పులు వచ్చాయని చెప్పారు కృష్ణానగర్‌లోని శ్రీసాయి విగ్స్ నిర్వాహకులు ఎ.సుబ్బారావు. ఒకప్పుడు విగ్గు తయారు చేయడం చాలా కష్టంగా ఉండేదని, చెన్నై నుంచి జుట్టు దిగుమతి చేసుకొని రూపొందించే వాళ్లమని పేర్కొన్నారు. ఎన్నెన్నో మార్పులు... అప్పట్లో విగ్గులను కేవలం జుట్టుతోనే రూపొందించేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో సింథటిక్, హ్యూమన్ హెయిర్ విగ్స్, ఆర్గానిక్ విగ్స్... ఇలా ఎన్నో రకాలు వచ్చాయి. వీటికి అవసరమైన కలరింగ్‌తో కూడిన విగ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఇప్పుడు కృష్ణానగర్‌లోనే తయారు చేసి ఇండస్ట్రీ అవసరాలు తీరుస్తున్నారు. కానీ డిజిటల్ మార్పుల నేపథ్యంలో హెయిర్ డిజైన్లు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ హెయిర్ స్టైలిస్ట్‌లను నియమించుకుంటున్నారు. వారి పాత్రకు అనుగుణంగా తమ తలకట్టును తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై నుంచి హెయిర్ స్టైలిస్ట్‌లు ఇక్కడికి వచ్చేస్తున్నారు. నయా డిజైన్స్ ఆగయా... సినిమాల్లోని వివిధ వేషధారణలకు కావాల్సిన దుస్తులను కృష్ణానగర్‌లో అద్దెకిస్తారు. డాక్టర్, పోలీస్ ఆఫీసర్, లాయర్... ఇలా ఏ పాత్రకైనా నిమిషాల్లో దుస్తులను సరఫరా చేస్తారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరమైన దుస్తులు ఇక్కడి నుంచే అందిస్తున్నా... వాటి రూపురేఖలు మారుతున్నాయి. నవతరం డిజైనర్లు సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఇక్కడి స్టైలిస్టులతోనే నూతన డిజైన్స్‌కు అనుగుణంగా దుస్తులను తీర్చిదిద్దుతున్నారు. డ్రెస్సుల డిజైనింగ్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని కృష్ణానగర్‌కు చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ ఖాదర్ పేర్కొన్నారు. ప్రస్తుత హీరోహీరోయిన్లు తమకు కావాల్సిన డ్రెస్సులను డిజైనర్లతో డిజైన్ చేయించుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడంతా నెట్లోనే... ఒకప్పుడు స్థానిక హైయిర్ స్టైలిస్టులపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. ‘మహానటి’ సినిమాలో కీర్తిసురేష్ కోసం 180 డిజైన్లను పరిశీలించాం. గతంలో సొంతంగా ఆలోచించి డిజైన్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడంతా ఇంటర్నెట్లోనే పరిశీలిస్తున్నాం. గ్రాఫిక్స్‌లోనే హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో ముందే చూపిస్తున్నాం. – రజబ్ అలీ, హెయిర్ స్టైలిస్ట్ డిజైన్ వారిది.. తయారీ మాది సినీ ఇండస్ట్రీతో దాదాపు 35 ఏళ్ల అనుబంధం ఉంది. ఎంతోమంది నటీనటులకు డ్రెస్సులను డిజైన్ చేశాం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్తగా డిజైనర్లు వచ్చారు. వారి రూపొందించిన డిజైన్లకు అనుగుణంగా మేము దుస్తులను తయారు చేస్తున్నాం. గతంలో అయితే మా అభిరుచి మేరకు మేమే రూపొందించేవాళ్లం. – ఖాదర్, కాస్ట్యూమ్ డిజైనర్ ట్రెండ్స్‌కు అనుగుణంగా... విగ్గుల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు విగ్గు కావాలంటే నలుపుదో, తెలుపుదో ఇచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా విగ్గుల రంగులు, స్టైల్స్ మారాయి. ఆయా మార్పులకు అనుగుణంగా తయారు చేసిస్తున్నాం. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి కావాల్సిన సింథటిక్ జుట్టును తీసుకొస్తున్నాం. – సుబ్బారావు, శ్రీసాయి విగ్స్ గిరాకీ తగ్గింది... నేను 20ఏళ్లుగా కృష్ణానగర్‌లో షాపు ఏర్పాటు చేసుకొని సినిమా వేషాలకు కాస్ట్యూమ్స్ అద్దెకిస్తున్నాను. అప్పట్లో నా దగ్గరే పాత్రలకు తగిన విధంగా డ్రెస్సులు ఉండేవి. వాటినే అద్దెకు తీసుకొనేవారు. అయితే దశాబ్ద కాలంగా హీరోహీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు సొంతంగా కాస్ట్యూమ్ డిజైనర్లను నియమించుకుంటుండడంతో మాకు గిరాకీ తగ్గింది. – సంగప్ప, కాస్ట్యూమ్స్ విక్రేత -
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క చాన్స్..
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క చాన్స్.. వెండితెరపై తన బొమ్మ పడాలని కోరుకునేవారు కోకొల్లలు.తెలుగు రాష్ట్రాల్లో ఒక్క అవకాశం కోసం కలలు కనేవారికి ఆశల ద్వారం ‘కృష్ణానగర్’ ఒక్కటే. తాము కోరుకున్న కలల తీరం చేరాలంటే అక్కడ అడుగు పెట్టాల్సిందే. దశాబ్దాల సినీ ప్రస్థానంలో తారలు మారుతున్నారు.. సాంకేతిక పరిజ్ఞానం మారుతోంది.. మొత్తం మహానగరమే మారింది.. కానీకృష్ణానగర్కు వచ్చేవారి ఆలోచనల్లో ఏ మాత్రం మార్పులేదు. అదే కల.. ఒక్క ఛాన్స్.. ఆ అవకాశంవస్తే ‘చిన్న క్లోజ్’.. అంతే. కునుకు పడితే ఎక్కడ తమకు వచ్చే అవకాశం చేజారిపోతుందోనని కళ్లల్లో ఆర్క్లైట్లు వెలిగించుకుని ఎదురు చూస్తుంటారు. కడుపులో ఆకలి రొద చేస్తున్నా.. బతుకు రంగువెలుస్తున్నా సరే మొహానికి మేకప్ వేసుకునే అవకాశం ఎవరిస్తారా అని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఓ గణపతి కాంప్లెక్స్, మంగ టిఫిన్ సెంటర్, పూర్ణ టిఫిన్ సెంటర్, ప్రసాద్ ల్యాబ్స్, ఇందిరానగర్, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం.. ఆ చుట్టుపక్కల వీధులే.. భవనాల మెట్లే అడ్డాలుగా చేసుకొని ఒక్కో మెట్టూ ఎక్కించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఓ రవితేజ, త్రివిక్రమ్, సునీల్, బ్రహ్మాజీ.. సంపూర్ణేష్‌బాబు.. ఇలా ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ముద్దాడినవారే. ఇలాంటి వారే ఆదర్శం.. ఔత్సాహిక కళాకారులకు ఆశల స్వర్గంగా మారింది. అంతేనా.. అలనాటి ‘వేటగాడు’ చిత్రం నుంచి నేటి ‘సైరా’ సినిమా వరకూ కాల గమనంలో సాంకేతికంగా ఎన్నో మార్పులొచ్చాయి. నాటికి నేటికీ అవకాశాల్లోనూ, అందుకోసం వెదికే విధానంలోనూ భారీ మార్పులే చోటుచేసుకున్నాయి.సినీ రంగానికి సంబంధించి 24 క్రాఫ్ట్‌లే కాకుండా అదనంగా వచ్చిన విభాగాల్లోనూ భారీ మార్పులే వచ్చాయి. బంజారాహిల్స్: సంపూర్ణేష్ బాబు.. సినిమా అవకాశాల కోసం ఎక్కడా చక్కర్లు కొట్టలేదు.. ఏ అడ్డాకు వెళ్లలేదు.. సోషల్ మీడియా విప్లవం ద్వారా రాత్రికి రాత్రే అభిమానులను సొంతం చేసుకున్నారు.. లక్షలాది మంది ఫాలోవర్లను తన ఫేస్బుక్లో లైక్ కొట్టేలా చేసుకున్నారు.. అదే అతడిని సినీ పరిశ్రమ వైపు నడిపించింది.. నవ్వుల స్టార్‌గా మార్చింది.. సంపూర్ణేష్‌బాబు ఒక్కడి విషయంలోనే కాదు.. దర్శకుడు భాస్కర్, నవ్వుల కార్యక్రమాలు వేదికగా అనేక మంది యువకులు ఇప్పుడు ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీళ్లే కాదు మరెందరికో వేదికగా నిలిచి.. ఆర్టిస్ట్‌లకు వెలుగుదారులు పరుస్తోంది కృష్ణానగర్. ఒకప్పటి కృష్ణానగర్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. అవేంటో ఒకసారి తరచి చూస్తే.. గణపతి కాంప్లెక్స్.. ఉదయం 6 గంటల ప్రాంతం.. అక్కడున్న ఓ కాంప్లెక్స్ వద్దకు ఒక్కొక్కరు వచ్చి చేరుతున్నారు.. చూస్తుండగానే చాలా మంది అక్కడికి వచ్చి చేరారు.. అంతా కబుర్లలో మునిగిపోయారు.. కాస్త చెవులు అటు వైపుగా వేస్తే వినిపించేవి సినీ అవకాశాల కోసం తాము పడే పాట్లు.. సినిమాల్లో వచ్చిన అవకాశాలు.. తాను నటించిన సన్నివేశాలు.. తమకు దక్కిన ఛాన్సులు.. ఇలా ఉదయమే కాదు.. సాయంత్రం 6 గంటలకు అక్కడంతా ఇదే పరిస్థితి.. పాతికేళ్లుగా చాలా మంది సినీ వినీలాకాశంలో అవకాశం పొందడానికి, పొందినవారు ఇక్కడికి వస్తూనే ఉంటారు.. అవకాశాలు వచ్చిన వారు ప్లేస్ మార్చవచ్చు.. కానీ నేటి తరం ఔత్సాహిక సినీ కళాకారులకు అదే అడ్డా.. అదే గణపతి కాంప్లెక్స్.. అడ్డా నుంచి ఆడిషన్ లెవల్‌కు వెళ్లిన నాటి అవకాశాలు ప్రస్తుతం సోషల్ వైపు నడుస్తున్నాయి. మంగ టిఫిన్ సెంటర్.. కాస్త అటుఇటుగా అర కిలోమీటర్ ముందుకు సాగితే మంగ టిఫిన్ సెంటర్. జూనియర్ ఆర్టిస్టులందరికీ అదొక హాట్‌స్పాట్.. ఈ అడ్డా మీదుగా చాలా మంది సినీపరి«శ్రమలో తమ అడుగులను వేసిన వారు ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఆ అడ్డా అలాగే కళాకారుల కలయిక ప్రాంతంగా నిలుస్తోంది. అందరినీ ఆదరిస్తోంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. సినీ అవకాశాల కోసం పల్లెల నుంచి టౌన్ల నుంచి వచ్చే వారికి ఇలాంటి ప్రాంతాలు సినీ అవకాశాల వారధులుగా నిలుస్తున్నాయి. చెరిగిపోని గుర్తులు.. సారథి స్టూడియో, అన్నపూర్ణ, రామానాయుడు.. ఇలా పలు సినీ స్టూడియోలు అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోకి రావడంతో సినీ అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఔత్సాహిక సినీ కార్మికులకు స్టూడియోల చుట్టుపక్కల ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. ఇలా దాదాపు పాతికేళ్లుగా ఇవి ఇప్పటికీ అవకాశాలను కల్పిస్తూనే ఉన్నాయి. దీంతో చాలా మంది గణపతి కాంప్లెక్స్, మంగ టిఫిన్ సెంటర్, పూర్ణ టిఫిన్ సెంటర్, ప్రసాద్ ల్యాబ్స్, ఇందిరానగర్, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం తదితర ప్రాంతాలను తమ అడ్డాలుగా మలుచుకున్నారు. ఇవి ఇప్పటికీ వీరిని ఆదరిస్తూనే ఉన్నాయి. ప్రసాద్ ఫిలిం ల్యాబ్ అటూ ఇటూగా మారింది.. సినీ అవకాశాల కోసం వచ్చే చాలా మంది తమ ఆవాసాలను కృష్ణానగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఒకవైపు స్టూడియోలు, ఆర్టిస్ట్ యూనియన్ కార్యాలయాలు, అవకాశాలు కల్పించే అడ్డాలు ఇలా అన్నీ చుట్టుపక్కల ఉండటంతో వారంతా వచ్చి ఇక్కడే నివసించేవారు. గతంలో త్రివ్రిక్రమ్, రవితేజ, బ్రహ్మాజీ, సునీల్ ఇలా చాలా మంది తమ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇరుకు గదుల్లో అవకాశాల కోసం ఇక్కడున్నవారే. ఇప్పుడు అడ్డాల వద్దకు వచ్చే వారి సంఖ్య తగ్గినా ఒకప్పటిలాగే ఇప్పటికీ వస్తున్న వారూ ఉన్నారు. అంతా ‘సోషల్’యిజం సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఒకప్పుడు ఆ డిషన్లు జరిగేవి. ఇందుకోసం పలు సినిమా కార్యా లయాలు ఔత్సాహిక సినీ కార్మికుల కోసం తలుపులు తెరుచుకునేవి. తనకు ఇలాగే దిల్ రాజు కార్యాలయంలో జరిగిన ఆడిషన్ ద్వారా సినిమా ల్లో అవకాశం వచ్చిందని చెబుతున్నారు వెంకటగిరికి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జమాల్. కానీ ప్రస్తు తం ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఆడిషన్స్ ద్వారా జరిగిన ఎంపిక ఇప్పుడు మారుతున్న కాలానికి, ట్రెండ్‌కు అనుగుణంగా మారిపోయింది. ఇందులో భాగంగానే ఎవరైనా అవకాశాల కోసం వెళ్తే యూట్యూబ్‌లో ఏమైనా సినిమాలున్నాయా.., షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేశారా.. ఉంటే ఆయా వెబ్సైట్ లింక్‌ను పంపండి చూస్తామంటూ చెబుతున్నారు. మరోవైపు చాలా మంది ఇలానే సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలానే సంపూర్ణేష్ బాబు సోషల్ మీడియా ద్వారా హీరో అయ్యారు. భాస్కర్ దర్శకుడయ్యారు. ఇలా ఇప్పుడంతా సోషల్గానే చాలా మంది అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఆ అడ్డాలో కలిస్తే ఆనందం.. సినిమా అవకాశాల కోసం ఇక్కడికి వచ్చే వారు చాలా మంది ఉంటారు. ముందుగా సినిమా అవకాశా>ల కోసం ప్రయత్నించే వారి అడ్డా ఎక్కడా అని చూస్తే గణపతి కాంప్లెక్స్ కనిపిస్తుంది. అక్కడికి రావడం వల్ల పలానా సినిమా ప్రారంభమవుతుందని, అవకాశాలున్నాయని తెలుస్తుంది. దీనివల్ల సినిమా అవకాశాలు దక్కించుకోవచ్చు. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని ఈ అడ్డాలు చెబుతుంటాయి. ఇక్కడి నుంచి సినీ పరిశ్రమలో చాలా మందికి అవకాశాలు వచ్చాయి. దాదాపు పదిహేనేళ్లుగా గణపతి కాంప్లెక్స్ ప్రాంతంతో నాకు అనుబంధం ఉంది. – కాదంబరి కిరణ్, సినీనటుడు అవకాశాలను సృష్టించుకోవాలి.. సినిమా అవకాశాల కోసం నేను చాలా కాలం ప్రయత్నించాను. ఒకప్పుడు సినిమా కార్యాలయాల చుట్టూ తిరిగేవాడిని. ఆడిషన్స్ జరిగితే అవకాశం, అదృష్టం పరీక్షించుకొనేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆడిషన్స్ జరగడం లేదు. చిన్నచిన్న యూట్యూబ్ వేదికగా చేసేటువంటి ఫిలింలు, షార్ట్‌ఫిల్మ్‌లు మన అవకాశాలను మారుస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా మనల్ని మనం ఇప్పుడు హీరోలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు అవకాశాలు కూడా అలానే వస్తున్నాయి. – జమాల్, సినీ ఆర్టిస్ట్ -
పేలిన స్మోక్ బాంబులు,ఒకరికి గాయాలు
-
కృష్ణానగర్‌లో పేలిన స్మోక్ బాంబులు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణానగర్‌లోని శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం...యూసఫ్‌గూడ శ్రీకృష్ణనగర్ బి బ్లాక్...లోని మొదటి అంతస్తులో సినిమా షూటింగ్స్‌లో సెట్స్‌లో వాడే స్మోక్ బాంబ్స్ పేలినట్లు తెలుస్తోంది. సిలిండర్ల సాయంతో స్మోక్ బాంబులు తయారు చేస్తుండగా అవి హఠాత్తుగా పేలాయి. ఈ ప్రమాదంలో అశోక్ అనే యువకుడి చేతులు, కాళ్లకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. కాగా నిబంధనలు ఉల్లంఘించి స్మోక్ బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువకుడిపై యాసిడ్ దాడి
హైదరాబాద్: నగరంలోని కృష్ణానగర్‌లో ఆదివారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు యువకుడిపై యాసిడ్ దాడి చేశారు. యాసిడ్ దాడిలో యువకుడు తరుణ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
షూటింగ్‌లు ఫుల్ కానీ డబ్బుల మాత్రం నిల్
-
కథ కంచికి!
హ్యూమర్ ఫ్లస్ కంచిలో చీరలమ్మే ఒక కుర్రాడికి ఎలాగో కథలతో దోస్తీ కుదిరింది. ఊరూరూ తిరిగి ఒక సత్రంలో విశ్రాంతి తీసుకుంటున్న కథలతో మాటామాటా కలిపి అన్నింటినీ కట్టగట్టి మూటలో వేసి కృష్ణానగర్ చేరుకున్నాడు. అక్కడ అడ్డాలో కొంతమంది రైటర్లు ఫైటర్లుగా మారి పెన్నులతో పొడుచుకుంటున్నారు. ‘ఎందుకు కొట్టుకుంటున్నారు’ అక్కడున్న ఒకాయన్ని భయంగా అడిగాడు కుర్రాడు. ‘కత్తి కంటే కలం గొప్పదని నిరూపించటానికి. ఇంతకూ నువ్వెవరు?’ అని అడిగాడు. నేనో రచయితని’ ‘అయితే పారిపో. లేదంటే పెన్నుపోటే. వెన్నుపోటు కంటే అది ప్రమాదకరం’ అని సలహా చెబితే కుర్రాడు కథల మూటతో పారిపోయి చీరలమ్మే అలవాటు కొద్దీ ఫిల్మ్‌నగర్ వీధుల్లో ‘కంచి కథలు’ అని అరుస్తూ తిరగసాగాడు. ఒక పెద్దమనిషి పిలిచి ‘ఏం కథలు బాబూ’ అని అడిగాడు. ‘సినిమా కథలండి’ ‘సినిమాకి కథెందుకు నాయనా’ ‘కథ లేకుండా సినిమా ఎలా తీస్తారు సార్’ ‘పిండి లేకుండా రొట్టె, చెట్టు లేకుండా కట్టెను సృష్టించడమే సినిమా. ఎలాగూ మూట దించావు కాబట్టి కథ చెప్పు’ ‘ఓపెనింగ్ సీన్లోనే హీరో వయొలిన్ వాయిస్తుంటాడు’ ‘విలన్లని వాయించాలిగానీ వీణా, వయెలిన్, తబలా వాయిస్తే ఎవరు చూస్తారు నాయనా. వయొలిన్ వయెలెన్స్గా మార్చు’ ‘కథ చెడిపోతుందండి’ ‘కథుంటే సినిమా చెడిపోతుంది. సరే ఓపెనింగ్ నేను చెబుతా విను. విశాలమైన మైదానంలో సీన్ ఓపెన్. అరుపులు, కేకలు. రెండొందల మంది రౌడీలు కత్తులు కర్రలతో పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ల వెనక హీరో. అంటే హీరోని చూసి భయంతో పారిపోతున్నారన్నమాట’’ ‘కత్తులు ఉండి కూడా రెండొందల మంది ఎందుకు పారిపోతారు సార్’ ‘ఎందుకంటే హీరో చేతిలో ఎలక్ట్రిక్ పోల్ ఉంటుంది కాబట్టి’ ‘పోల్‌లో పవర్ ఉండదా?’ ‘ఆ టైమ్‌లో పవర్ కట్’ ‘పోల్ మోయడం కష్టం కదా’ ‘పోలే మోయలేని వాడు ఇక సినిమానేం మోస్తాడు. హీరో పోల్ గిరగిరా తిప్పగానే రౌడీలు పోల్కి తగులుకుని మెరుపులు, మంటలు’’ ‘పవర్ లేదన్నారు’ ‘కొడితే వచ్చింది’ ‘మరి హీరోకేం కదా?’‘ఆయన షాక్ ప్రూఫ్. దేవుని గుడిలో కర్ర. సినిమా హాల్లో బుర్ర వాడడం మర్యాద కాదు. ఫైటింగ్ టైంలో హీరోయిన్ ఎంట్రీ. చంపు బావా... కనీసం యాభైమందిని చంపు అని ఎంకరేజ్ చేస్తుంది’ ‘అమ్మాయిలు సెన్సిటివ్ కదా, మరీ అంత అన్యాయంగా మాట్లాడుతారా?’ ‘సెన్స్, నాన్సెన్స్, న్యూసెన్స్, ఈ మూడు పదాలకు సినిమాలో అర్థం ఒకటే. ఏ లాంగ్వేజి సినిమాకైనా బాడీ లాంగ్వేజి ఒకటే. రక్తం చూసిన హీరోయిన్ రెచ్చిపోయి బ్లడ్ ఈజ్ వెరీగుడ్ అని పోల్ డాన్స్ పాట కలగంటుంది’ ‘రక్తం చూసి కళ్లు తిరిగి పడిపోతారు కానీ కలలు కంటారా?’ ‘వాళ్ల కల వాళ్లిష్టం. రియల్ లైఫ్‌లో ఎలాగూ కలలు లేవు. సినిమాల్లో కూడా లేకపోతే ఎలా?’ ఆ తరువాత హీరో ఎలక్ట్రిక్ పోల్‌ని గాల్లోకి విసిరి... ‘‘నేనెవరో తెలుసా? కరెంట్‌ని. మంచివాళ్లకు వెలుగునిస్తా, లేనివాళ్లకు షాక్ కొడతా. చూపుకి కనబడను. తాకితే చూపిస్తా సత్తా. దోస్తీకి లైటింగ్‌ని, దుష్మనీకి లైట్నింగ్ని’ అంటాడు. ‘ఇదేం కథ సార్ ఇందులో లైఫే లేదు’ ‘లైఫ్ నైఫ్ లాంటిది. సినిమాల్లో దానిజోలికెళితే పీక తెగిపోతుంది. చీరలకు డిస్కౌంట్ ఇచ్చినంత సులభం కాదు, సినిమా ప్రేక్షకుల పల్స్‌ని కౌంట్ చేయడం’ ‘ఇంతకూ మీరెవరు సార్?’ ‘స్టోరీని నమ్మి కోల్డ్‌స్టోరేజ్‌కి చేరుకున్న వోల్డ్ ప్రొడ్యూసర్ని’ - జి.ఆర్. మహర్షి -
సినీ సహాయ దర్శకుడిపై కేసు
హైదరాబాద్ : సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకుంటానని ఏడాది నుంచి నమ్మిస్తూ సర్వం ఊడ్చుకెళ్లాడని సినీ సహాయ దర్శకుడిపై ఓ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా అచ్చంపేట మదిపాడు అగ్రహారం మండలం గింజుపల్లి గ్రామానికి చెందిన వల్లపునేని కృష్ణారావు(27) సినీ సహాయ దర్శకుడిగా పని చేస్తూనే ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈవెంట్లలో పరిచయం అయిన రోజా అనే యువతితో ప్రేమలో పడి ఏడాది కాలంగా శ్రీకృష్ణానగర్‌లో సహజీవనం చేస్తున్నాడు. రెండు నెలలుగా కృష్ణారావు ప్రవర్తనలో మార్పు వచ్చింది. డ్రగ్స్‌కు అలవాటు పడటమే కాకుండా రోజాకు కూడా రోజూ డ్రగ్స్ ఇచ్చి శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడు. పీకలదాకా మద్యం తాగిస్తూ, సిగరెట్ పీకలతో కాలుస్తూ, పళ్లతో రక్కుతూ హింసిస్తున్నాడు. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, లక్ష రూపాయలు తీసుకొని ఉడాయించా డు. దీంతో బాధితురాలు కృష్ణారావుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన దగ్గర తీసుకున్న డబ్బుతో కృష్ణారావు మరో నలుగురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకొని జల్సాలు చేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఘరానా మోసం!
హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ. 22.5 లక్షల వసూలు కర్నూలు(ఓల్డ్‌సిటీ): హోంగార్డు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను వంచించారు. సాక్షాత్తు ఓ ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ, తన ఇద్దరు సహచరులతో వంచనకు పాల్పడ్డారు. నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. నకిలీ నియామక పత్రాలతో బోల్తా కొట్టించారు. ఎట్టకేలకు పోలీసులు ఈ వీరి అవినీతి బాగోతానికి తెరదించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక ఏపీఎస్పీ రెండో పటాలం ఆర్ఎస్ఐ బీ.కృష్ణుడు (56), ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన సందడి మధుసూదన్ (34), స్థానిక కృష్ణానగర్‌కు చెందిన దుంపల విశ్వనాథ్‌రెడ్డి (49) స్నేహితులు. వీరు మందు పార్టీలు చేసుకుంటూ జల్సాలకు అలవాటు పడ్డారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదనకు వ్యూహరచన చేశారు. హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకునేందుకు స్కెచ్ వేశారు. సుమారు ఏడు నెలల క్రితం కర్నూలుకు చెందిన ఆకేపోగు సురేశ్ నుంచి రూ. 2.5 లక్షలు, వెలుగోడుకు చెందిన బాలచంద్రుడు నుంచి ముందస్తుగా రూ.50 వేలు తీసుకుని మోసం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో వీరిపై రెండో పట్టణ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను సీసీఎస్‌కు బదలాయించగా, సీసీఎస్ పోలీసులు గురువారం రాత్రి ముగ్గురు నిందితులను స్థానిక బళ్లారి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరో 17మంది బాధితులు : సీసీఎస్ పోలీసుల విచారణలో వీరి బాగోతాలు మరికొన్ని బట్టబయలయ్యాయి. ఫిర్యాదుదారులతో పాటు మరో 17 మంది నుంచి వీరు హోంగార్డు ఉద్యోగాల పేరిట మొత్తం రూ. 22.5 లక్షలు వసూలు చేశారు. ఒక బాధితుడు తులం బంగారు గొలుసు, పదవ తరగతి సర్టిఫికెట్లు ఇచ్చి మోసపోయాడు. దళారులను నమ్మొద్దు: జిల్లా ఎస్పీ హోంగార్డు ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేస్తూ మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, వారి నుంచి రూ. 20 లక్షల నగదు, ఒక బంగారు గొలుసు, నకిలీ నియామక పత్రం, అభ్యర్థుల పదో తరగతి సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ వెల్లడించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. వారికి త్వరలో రివార్డులు ప్రకటిస్తామన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని, దళారులను నమ్మవద్దని నిరుద్యోగులకు సూచించారు. ప్రస్తుతం పటిష్టమైన రిక్రూట్మెంట్ విధానాలు ఉన్నాయన్నారు. ఎవరైనా ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బు డిమాండ్ చేస్తే వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. సీఐ రవిబాబు, ఎస్ఐలు శ్రీహరి, అమీర్అలీ, నాయబ్ రసూల్, ఏఎస్ఐ నరసింహులు, హెడ్ కానిస్టేబుళ్లు విజయరాజు, మురళి, కానిస్టేబుళ్లు దేవరాజు, సుబ్బరాయుడు, హోంగార్డు రాములను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ శివకోటి బాబూరావు, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్‌కి ఆలస్యంగా వస్తారా ?
హైదరాబాద్: నగరంలో కృష్ణా నగర్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌కి ఆలస్యంగా వచ్చిన 25 మంది చిన్నారులపై బుధవారం స్కూల్ యాజమాన్యం ఆగ్రహం ప్రకటించింది. స్కూల్‌కు ఆలస్యంగా వస్తారా అంటూ చిన్నారులతో గుంజీలు తీయించింది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటూ చిన్నారి విద్యార్థులను టీచర్లు తరగతి గది బైట మూడు గంటలపాటు నిలబెట్టారు. దీంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దాంతో విద్యార్థులు కాళ్ల వాపు, జర్వంతో బాధపడుతున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న చిన్నారి విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని స్కూల్ యాజమాన్యంతో వాదనకు దిగారు. -
ఆసక్తికరంగా మారిన ‘కృష్ణనగర్’ పోరు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ బరిలోకి దిగడంతో కృష్ణనగర్ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి అప్పటి బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ పోటీ చేశారు. హర్షవర్ధన్ ఈ నియోజకవర్గానికి చిరపరిచితుడు కాగా కిరణ్ బేడీ పూర్తిగా కొత్త. మాజీ పోలీసు అధికారిణి వ్యక్తిత్వం, పనితీరు ఇక్కడివారికి సుపరిచితమే. ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి బేడీ విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ఆటోవాలాలు, టీవాలాలు, చిన్నారులు, యువత, మహిళలతో ముచ్చటిస్తూ అందరినీ ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. కమలానికి కంచుకోటగా ముద్రపడిన నియోజకవర్గాల్లో ఒకటైన కృష్ణనగర్ నుంచి కిరణ్‌బేడీ గెలుపొందే అవకాశముంది. అయితే ప్రత్యర్థులు మాత్రం ఆమెను ఎలాగైనా ఓడించాలని తహతహలాడుతున్నారు. ఇక్కడినుంచి ఈసారి పోటీచేస్తున్న అభ్య ర్థులంతా పంజాబీలే. కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి బన్సీలాల్‌ను బరిలోకి దింపింది. లాల్... ఇక్కడివారికి సుపరిచితుడే. ఈ నియోజకవర్గం పరిధిలోని గీతాకాలనీ మున్సిపల్ వార్డు నుంచి ఆయన రెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మూడోసారి ఈ సీటు మహిళలకు రిజర్వ్ కావడంతో ఆయన తన భార్యను అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఆమె ఓడిపోయారు. 2012 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ....లాల్‌కు టికెట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థికి ధరావత్తు కూడా దక్కకుండా చేశారు. ఈ నేపథ్యంలో లాల్... కిరణ్ బేడీకి కొంతమేర పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నుంచి ఎస్.కె.బగ్గాకు టికెట్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి ఆప్‌లో చేరారు. గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి బయటి వ్యక్తే అయినప్పటికీ ఆయనకు గణనీయంగానే ఓట్లుపడ్డాయని, ఈసారి ఆప్ అభ్యర్థి స్థానికుడైనందువల్ల ఓట్ల సంఖ్య ఇంకా పెరగవచ్చని అంటున్నారు. -
పాఠశాల నడుస్తుండగానే కూల్చివేత
-
పాఠశాల నడుస్తుండగానే కూల్చివేత
హైదరాబాద్: పాఠశాల నడుస్తుండగానే కూల్చివేసిన ఘటన హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో చోటుచేసుకుంది. స్థానిక సాయిరామ్ హైస్కూల్ భవనంలోని రెండు అంతస్థులను కూల్చివేశారు. తరగతి గదుల్లో విద్యార్థులుండగానే జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేతకు దిగడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం హుటాహుటిన విద్యార్థులను బయటకు పంపించేసింది. ముందస్తు ఆదేశాలు లేకుండా ఒక్కసారిగా కూల్చివేయడంతో పిల్లలు భయాందోళనకు గురయ్యారు. అక్రమంగా నిర్మించారనే కారణంతో ఐదు అంతస్థుల పాఠశాల భవనంలోని రెండు అంతస్థులను కూల్చివేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరించామని తమ చర్యను జీహెచ్ ఎంసీ అధికారులు సమర్థించుకున్నారు. తమకు ఎటువంటి నోటీసు ఇవ్వలేని సాయిరామ్ హైస్కూల్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు వాపోయారు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేతకు దిగడాన్ని బాలల హక్కుల సంఘం తప్పుబట్టింది. పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. దీనిపై జీహెచ్ ఎంసీ అధికారులను వివరణ కోరనున్నట్టు తెలిపింది. జీహెచ్ ఎంసీ అధికారులు ఇంతకుముందు కూడా సికింద్రాబాద్ ఓ ఇంటిని ఎవరూలేని సమయం చూసి కూల్చివేశారు. -
గేట్ వే ఆఫ్ టాలెంట్
సిటీలో సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది కృష్ణానగర్. రంగుల లోకంలో కాలుమోపడానికి హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లంతా ముందుగా వాలిపోయేది ఈ కృష్ణానగర్‌లోనే. ఒక్క చాన్స్ కోసం ఏళ్లకేళ్లు అక్కడే తిష్టవేస్తారు. కృష్ణానగర్ తర్వాత సిటీలో సినీమాయ చుట్టూ తిరిగే స్పాట్ ఇంకోటుంది. అదే గణపతి కాంప్లెక్స్. ముఖ్యంగా సాంకేతిక విభాగాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే ఔత్సాహికులతో గణపతి కాంప్లెక్స్ గేట్ వే ఆఫ్ టాలెంట్‌గా మారింది. శ్రీనగర్‌కాలనీలోని ఈ కాంప్లెక్స్ దగ్గరికి చేరిన అందరి లక్ష్యం సినిమాలో చాన్స్ కొట్టేయడమే. రంగుల ప్రపంచంలో ఎంట్రీ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారందరూ ఈ గణపతి కాంప్లెక్స్‌ను తమ కలలు తీర్చే కల్పతరువుగా భావిస్తుంటారు. ప్రతిరోజు ఉదయాన్నే ఆశావహులందరూ ఇక్కడికి చేరుకుంటారు. పాతవారితో పిచ్చాపాటీలు, కొత్తవారితో పరిచయాలు.. ప్రొడక్షన్ వారితో చేసే విన్నపాలు.. ఎవరిని పట్టుకుంటే పని జరుగుతుందన్న ఆరాలు.. రోజంతా ఇలాగే సాగిపోతుంది. ఫలానా పనికి ఫలానా వ్యక్తి పక్కాగా పనికొస్తాడని బల్లగుద్ది మరీ రికమండ్ చేసేవాళ్లు కొందరుంటారు. మస్తీ అడ్డా గణపతి కాంప్లెక్స్ నిర్మించి దాదాపు రెండు దశాబ్దాలు గడిచింది. ప్రధానంగా పుష్కరకాలం నుంచి ఇది కేరాఫ్ సినిమాగా మారింది. సినిమా కేంద్రం ఇందిరానగర్‌కు దగ్గరగా ఉండటం. నీడనిచ్చే చెట్లు, కూర్చోవడానికి మెట్లు.. ఏ వేళలో అయినా వేడివేడిగా ఉపాహారం అందించే టిఫిన్ సెంటర్స్, బుర్ర వేడెక్కినప్పుడు గరం గరం చాయ్ అందించే కేఫ్‌లు ఇక్కడి విశేషాలు. మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఇళ్ల అద్దెలు, బ్యాచిలర్స్‌కు కూడా గదులు లభించడం గణపతి కాంప్లెక్స్ ఏరియాను ఆకర్షణీయమైన అడ్డాగా మార్చేసింది. కళల తీరం.. 24 కళల సినిమాలో ఏ ఒక్క రంగంలో అయినా అవకాశం దొరక్కపోదా అని ఇక్కడ ఎందరో ఎదురుచూస్తుంటారు. దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్, డ్యాన్స్ తదితర విభాగాల్లో చాన్స్ కోసం వచ్చిన వారు గణపతి కాంప్లెక్స్‌నే నమ్ముకుంటారు. వీరిలో ఎక్కువ మంది తెర మీద కనిపించడం కన్నా.. తెర వెనుక సత్తాచాటే ల క్ష్యంతో వచ్చిన వారే. ఇక ఈ అడ్డా నుంచి అవకాశాలు పొంది సక్సెస్ కొట్టిన ఎందరో నటులు, సాంకేతిక నిపుణులు గణపతి కాంప్లెక్స్‌ను సొంత ఇంటిలా భావిస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా ఇక్కడ వాలిపోయి పాత మిత్రులతో ముచ్చట్లలో మునిగిపోతారు. అలా మారింది.. కొత్త వారికి, సాంకేతిక నిపుణులకు ఒక కేంద్రం ఉంటే బాగుంటుందని భావించిన కొందరు సీనియర్లు తరచూ ఇక్కడకు వచ్చి కూర్చోవడంతో ఇది సినిమా వారి అడ్డాగా మారింది. నేను ఇదే కాంప్లెక్స్ దగ్గర ఏళ్లకేళ్లు అవకాశాల కోసం ఎదురు చూశాను. అలా పరిచయాలు పెరిగి ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. నా సక్సెస్‌లో కాంప్లెక్స్ పాత్ర మరచిపోలేనిది. కాంప్లెక్స్‌కు రావాల్సిందే.. నేను ప్రతి రోజూ ఇక్కడికి వస్తుంటాను. ఏ కంపెనీలో అవకాశాలు ఉన్నాయి.ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడి నుంచి అవకాశాలు పొందిన వారు ఉన్నంతలో.. ఇతరులను రికమండ్ కూడా చేస్తుంటారు. - మురళీధర్, నటుడు -
సం‘పూర్ణ’మైన టిఫిన్స్
పొగజూరిన గోడల యాంబియన్స్, సోఫాలు, లాంజ్లలా సౌకర్యంగా కూర్చోనివ్వని స్టూల్స్, కుర్చీలు... ఇవన్నీ మెత్తని నోట్లో పెడితే కరిగేపోయిన ఇడ్లీ రుచి ధాటికి వెలతెలపోయాయి. సినిమాలతో నాకు పెద్దగా సంబంధం లేదు. అయితే ఒక పనిలాగా కృష్ణానగర్‌కు వెళ్లడానికి కారణం పూర్ణా టిఫిన్స్. ‘ఫుడీ’గా సిటీలో రెస్టారెంట్స్‌కు వెళ్లి రుచి చూసి వాటి క్వాలిటీపై ఒక నిర్ణయానికి వచ్చేవాడిని నేను. అయితే ఈ టిఫిన్ సెంటర్‌కు ఉన్న పేరు నన్ను అటు వెళ్లేలా చేసింది. ‘పూర్ణా టిఫిన్ సెంటర్’కు ఉన్న ఫాలోయింగ్‌కు చిహ్నంగా కృష్ణానగర్‌లో ఇలా అడగ్గానే అలా చెప్పేశారు దాని అడ్రస్. ఆ టిఫిన్ సెంటర్ చుట్టూ ఉన్న పరిసరాలు చూడగానే పెద్దపెద్ద రెస్టారెంట్స్ పరిచయం ఉన్న నాకు కాస్త ఇబ్బందికరంగానే అనిపించింది. అయితే అక్కడ కనపడే పరిస్థితికి వంటకాల రుచికి అసలు ఏ మాత్రం పోలికే లేదని కాసేపటికే అర్థమైంది. టిఫిన్ సెంటర్లోకి ఎంటర్ అవుతుండగానే పెద్దపెద్ద పాత్రల్లో పరాటాలు, దోసెలు తయారవుతున్నాయి. టోకెన్ తీసుకుని కూచున్న కాసేపటికి పొగలు కక్కే తెల్లటి ఇడ్లీలు మా ముందుకు వచ్చాయి. అరిటాకులో బ్రేక్‌ఫాస్ట్... వావ్ అనిపించింది. అరిటాకులో 3 ఇడ్లీలకు నెయ్యి దట్టంగా పట్టించి, వాటిపై కారప్పొడి (గన్‌పౌడర్) చల్లారు. అల్లం, కొబ్బరి చట్నీలు సరేసరి. పొగజూరిన గోడల యాంబియన్స్, సోఫాలు, లాంజ్లలా సౌకర్యంగా కూర్చోనివ్వని స్టూల్స్, కుర్చీలు... ఇవన్నీ మెత్తని నోట్లో పెడితే కరిగేపోయిన ఇడ్లీ రుచి ధాటికి వెలతెలపోయాయి. సహజంగానే అల్లం చట్నీ ఘాటుగా, కొంత తియ్యగా ఉంటుంది. అయితే ఇక్కడ మరింత తియ్యగా ఘాటుగా ఉంది. కొబ్బరి చట్నీ నాణ్యంగా, రుచిగా అనిపించింది. ఇడ్లీలు మాత్రమే కాకుండా దోసెలు, పూరీలు, వడ, బోండాలు... ఇలా అన్ని రకాల టిఫిన్లు అక్కడ వేడి వేడిగా వడ్డిస్తున్నారు. వాటి నుంచి వస్తున్న పరిమళాలు మాత్రమే కాదు, అక్కడ వాటిని ఆస్వాదిస్తున్న వారిలో వెల్లడవుతున్న భావాలను బట్టి చూసినా... అవన్నీ ఏ పెద్ద రెస్టారెంట్‌కు తీసిపోని... ఇంకా చెప్పాలంటే చాలా రెస్టారెంట్స్ కన్నా మిన్నగా ఉన్నాయని అర్థమైపోయింది. సినిమా రంగం అంటే హీరోలు, హీరోయిన్లు, స్టార్లు సెలబ్రిటీలు ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు మాత్రమే కాదు... వెండి తెర ను పండించే సాదా సీదా మనుషులు నిండిపోయిన కృష్ణానగర్ కూడా. అక్కడ వారికి అతి తక్కువ ధరలో అంత మంచి రుచిని వడ్డిస్తున్న పూర్ణా టిఫిన్స్‌ను అభినందించకుండా ఉండలేం. మళ్లీ ఇటొచ్చినప్పుడు తప్పకుండా ఈ టిఫిన్ సెంటర్‌కి వస్తా. ఎందుకంటే ఇడ్లీ, దోసె మాత్రమేనా... మిగతావి కూడా టేస్ట్ చేయాలి కదా. -
సుప్రీం ఆదేశంపై హర్షం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ భవితవ్యాన్ని నిర్ణీత సమయంలో తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించడంపై కాంగ్రెస్, బీజేపీ, ఆప్ హర్షం వ్యక్తం చేశాయి. ఢిల్లీవాసులు కరెంటు, నీటి సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై త్వరగా తేల్చాలని కోర్టు ఆదేశించడం ముదాహవమని ఆ పార్టీలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ మమ్నల్ని ఏ క్షణంలో పిలిచిన వెంటనే సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’మన్నారు. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఇప్పుడు రాష్ట్రంలో మెజారిటీ ప్రభుత్వమో, మైనారిటీ ప్రభుత్వమో లేక మళ్లీ ఎన్నికలు జరపడమో అనేది ఎల్జీ నిర్ణయిస్తారన్నారు. ప్రజలు విద్యుత్, మంచినీటి సమస్యలతో సతమతమవుతున్నారని, వాటి నుంచి ఢిల్లీవాసులకు విముక్తి రావాలంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఢిల్లీ శాఖ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ అన్నారు. నిబంధనల ప్రకారం నగరంలోని తుగ్లకాబాద్, క్రిష్ణ నగర్, మెహ్రౌర్లీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరపాల్సి ఉన్నందున, వాటిని తప్పించుకోవడానికి ఢిల్లీ అసెంబ్లీని రద్దుచేయాలని శర్మ సూచించారు. ఇదిలా ఉండగా, అన్ని పార్టీల నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై ఎల్జీ ఎందుకు రాతపూర్వక సమాధానం కోరడం లేదని ఆప్ ప్రశ్నించింది. ప్రభుత్వ ఏర్పాటుపై వీలైనంత త్వరగా తమ అభిప్రాయం చెప్పాలని బీజేపీని ఎల్జీ అడగాలని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇప్పటికైనా అసెంబ్లీని రద్దుచేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. -
వెయ్యికోట్ల రుణాలిస్తాం
కృష్ణానగర్(మాక్లూర్), న్యూస్‌లైన్ : రబీ సీజన్లో రైతులకు బ్యాంకుల ద్వారా రూ. వెయ్యి కోట్ల రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. శనివారం మండలంలోని కృష్ణానగర్‌లో వరి నాటే యంత్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులకు రూ. 700కోట్ల రుణాలు సరిపోవని, వెయ్యి కోట్ల రుణాలు అవసరం ఉందని గుర్తించామన్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా రూ. 560 కోట్ల రుణాలు చెల్లించినట్లు చెప్పారు. రైతులు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రుణాలు సకాలంలో రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. ఆర్మూర్, బోధన్, భిక్కనూరు మండల కేంద్రాల్లో సోయా సీడ్స్ విత్తన కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రైతులు మార్కెట్లోనే కూరగాయలు అమ్ముకోవాలన్నారు. దళారులకు అమ్ముకోవ ద్దని సూచించారు. రైతులకు సబ్సిడీ పై టాటా ఏసీ వాహనాలు ఇస్తామని వారు ముందుకు రావాలని సూచించారు. పేద ప్రజ లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. కృష్ణానగర్ రైతులు సాగు చేస్తున్న పంటలను ఆడిగి తెలుసుకున్నారు. కృష్ణానగర్ గ్రామ శివారులోని బీటీ రోడ్డు పై కేజ్‌వీల్ ట్రాక్టర్లు నడవడంవల్ల రోడ్డు చెడిపోవడంతో తహశీల్దార్ నారాయణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని ట్రాక్టర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు చెడిపోతే మళ్ళీ రోడ్లు ఎవ రూ బాగు చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీవో యాదిరెడ్డి, జేడీఏ నర్సింహ, సహాయ వ్యవసాయ సంచాలకులు నర్సింహచారి, వాజీద్ హుస్సేన్, వెంకటలక్ష్మి, ఏవో హరిక్రిష్ణ, ఏఈ వోలు లక్ష్మీపతి, దివ్య, తహశీల్దార్ నారాయణ, ఎంపీడీవో టీవీఎస్ గోపిబాబు, సర్పంచ్‌లు సుభాష్‌చంద్రబోస్, భూరోల్ల రజిత, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈనెల చివరికల్లా ‘ఆధార్’ పూర్తిచేయాలి కలెక్టరేట్,న్యూస్‌లైన్ : గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ అనుసంధానాన్ని ఈ నెల చివరి క ల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సూచించారు. శనివారం ప్రగతిభవన్‌లో ఆయన మాట్లాడారు.జిల్లాలో 3 లక్ష ల 78వేల 746 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, డిసెంబర్ చివరి కల్లా 2 లక్షల 60 వేల 46 కనెక్షన్లు ఆధార్ సీడింగ్ అనుసంధానంతో 73.74 శాతం పూర్తి చేశారన్నారు. మిగితా కనెక్షన్లు జనవరి చివరి కల్లా పూర్తి చేయాలన్నారు.గ్యాస్ ఏజెన్సీలకు ఈ సీడింగ్ కోసం ఇన్‌చార్జీలుగా నియమించిన డిప్యూటీ తహశీ ల్దార్లు తరచూ పర్యవేక్షణ చేసి, పూర్తి స్థాయిలో సీడింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. సమావేశంలో జేసీ హర్షవర్ధన్, డీఎస్ఓ కొం డల్‌రావు, వీఎం దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
చేతబడి అనుమానంతోనే...
ఉప్పల్, న్యూస్‌లైన్: రామంతాపూర్‌లో ఈనెల 12న జరిగిన రాముల హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్యకు చేతబడి చేశాడనే అనుమానంతో సమీప బంధువే అతడి ప్రాణం తీశాడు. మల్కాజిగిరి ఏసీపీ రాధకిషన్‌రావు శుక్రవారం ఉప్పల్ పోలీసుస్టేషన్లో కేసు వివరాలను వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేటకు చెందిన వంజముల పెద్ద కృష్ణ(38) రామంతాపూర్ కృష్ణానగర్‌లో ఉంటూ టైలర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఇతని భార్య చింతమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో మంత్రాగాళ్లను ఆశ్రయించాడు. చింతమ్మకు చేతబడి చేశారని మంత్రగాళ్లు చెప్పడంతో తమ ఇంటి పక్కనే ఉండే బంధువు రాములుపై పెద్దకృష్ణకు అనుమానం వచ్చింది. రాములు బాణామతి చేస్తాడనే ప్రచారం అతని స్వగ్రామంలో గతంలో ఉండేది. ఈనేపథ్యంలోనే తన భార్య అనారోగ్యం బారినపడటానికి రాములే కారణమని, అతడిని హతమార్చాలని కృష్ణ నిర్ణయించుకున్నారు. దసరాకు రాములు బార్య ఊరెళ్లడంతో ఇదే అదనుగా భావించిన కృష్ణ అతడిని హత్య చేసేందుకు పథకం వేశాడు. ఈనెల 12న సాయంత్రం శ్రీరాంకాలనీలో ఉండే తన స్నేహితుడు పబ్బాల చెన్నయ్య (25)తో పాటు రాములును మద్యం తాగుదామని రామంతాపూర్‌లోని గడ్డిపొలాల్లోకి తీసుకెళ్లాడు. ముగ్గురూ మద్యం తాగారు. ఇంకా మద్యం తీసుకురావాలని చెన్నయ్యను కృష్ణ పంపాడు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న రాములను తలపై సిమెంట్ ఇటుకలతో మోది చంపేశాడు. మొలకు తావిత్తులు ఉన్నాయేమోనన్న అనుమానంతో దుస్తులు విప్పి, మర్మావయవాలను సైతం కోసే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మద్యం తీసుకుని తిరిగి వస్తున్న చెన్నయ్యకు మార్గంమద్యలో కృష్ణ ఎదురయ్యాడు. అతని తీరుపై అనుమానం వచ్చి రాములు ఏడని చెన్నయ్య నిలదీయగా... చంపేశానని, ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్నుకూడా చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడ్డ చెన్నయ్య ఈ హత్యపై ఎక్కడా నోరు విప్పలేదు. విచారణ చేపట్టిన పోలీసులకు బంధువైన కృష్ణపై అనుమానం వచ్చి విచారించగా తానే రాములును హత్య చేశానని చెప్పాడు. హత్య గురించి తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వనందుకు చెన్నయ్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ఎస్ఐ ముక్బుల్ జానీ పాల్గొన్నారు.