సాక్షి, హైదరాబాద్: నగరంలోని యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హార్డ్‌వేర్ షాపులో షార్ట్ సర్య్కూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భారీ శబ్ధాలతో పేయింట్ డబ్బాలు పేలాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది క్రేన్‌ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment