shartcircuit
-
కృష్ణానగర్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హార్డ్‌వేర్ షాపులో షార్ట్ సర్య్కూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భారీ శబ్ధాలతో పేయింట్ డబ్బాలు పేలాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. జీహెచ్ఎంసీ సిబ్బంది క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. -
ఘోర అగ్నిప్రమాదం
ఎలిగేడు(పెద్దపల్లి) : పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో శుక్రవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్షార్ట్సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన గజ్జెల మారుతి ఇంట్లో చీకటి లక్ష్మి, తిరుపతి దంపతులు కొన్నేళ్లుగా అద్దెకుంటున్నారు. తిరుపతి, తన కొడుకు మహేశ్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. ఇంట్లో లక్ష్మి ఒక్కతే ఉంటోంది. శుక్రవారం ఉదయం ఉపాధిహామీ పనులకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి లక్ష్మికి సమాచారం అందించారు. ఆమె అక్కడికి చేరుకునే సరికి మంటలు ఇళ్లంతా వ్యాపించాయి. ఇంట్లోని సిలిండర్, టీవీ సైతం పేలడంతో మంటలు ఆర్పేందుకు వచ్చిన గ్రామస్తులు భయంతో పరుగు తీశారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఇల్లుతో పాటు, బీరువాలో ఉన్న తొమ్మిది తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.1.5 లక్షల నగదు, 70 క్వింటాళ్ల మక్కలు, పట్టాదారు పాసుపుస్తకాలు కాలిపోయాయని బాధితురాలు బోరున విలపించింది. ఘటనాస్థలాన్ని వీఆర్వో ప్రసాద్ సందర్శించారు. నష్టాన్ని అంచనా వేసి, నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి ముప్పిరితోటలో శుక్రవారం షార్ట్‌సర్క్యూట్‌తో స ర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వా న్ని ఆదుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొట్టె ముక్కుల సురేశ్‌రెడ్డి కోరారు. ఘటనాస్థలా న్ని పరిశీలించి, బాధితురాలిని ఓదార్చారు. అనంతరం రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. -
‘మేరా భారత్’ పోస్టర్ ఆవిష్కరణ
ఖమ్మంమయూరిసెంటర్ : వీధి బాలల జీవితాన్ని కళ్లకు కట్టేలా మేరా భారత్ మహాన్ షార్ట్ ఫిలిం నిర్మించడం అభినందనీయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేరా భారత్ షార్ట్ ఫిలిం పోస్టర్‌ను శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భారతదేశ చరిత్రను భావి తరాలకు తెలియచేస్తూ, స్ఫూర్తిదాయకమైన, సందేశాత్మకమైన షార్ట్‌ఫిలింలను నిర్మించాలని ఈ సందర్భంగా ఎంపీ వారికి సూచించారు. చిన్నారులతో షార్ట్‌ఫిలిం నిర్మించిన దర్శక నిర్మాతలను ఎంపీ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలను నిర్మించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లింగాల కమలరాజు, కొప్పురావూరి వెంకటకృష్ణ, అజ్మీరా అశోక్‌నాయక్, ఫిలిం డైరెక్టర్ బేతంపూడి శ్రీకాంత్, నిర్మాత మండె రమణ నటీనటులు అశ్విన్, ప్రదీప్, కెమెరామెన్ లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో ఆస్పత్రి దగ్ధం
– రూ.లక్షల ఆస్తి నష్టం భువనగిరి అర్బన్ షార్ట్ సర్క్యూట్‌తో పట్టణంలోని ఓ ఆస్పత్రి దగ్ధమైంది. ఈ ఘటన భువనగిరిలో శుక్రవారం రాత్రి చేసుకుంటుంది. వివరాలు.. పట్టణంలోని పల్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి విద్యుత్ మెయిన్‌బోర్డులో అర్ధరాత్రి దాటిన తరువాత మంటలు లేచాయి. దీంతో ఆస్పత్రి అంతా మంటలు వ్యాపించి ముందు, పై భాగం, మెడికల్ షాపు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆస్పత్రిలో నుంచి మంటలు, పొగలు వస్తున్న విషయాన్ని గమనించి స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ మేరకు రూ. 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఆస్పత్రి యాజమాని డాక్టర్ ఓవైసి తెలిపారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో ఆస్పత్రి దగ్ధం
– రూ.లక్షల ఆస్తి నష్టం భువనగిరి అర్బన్ షార్ట్ సర్క్యూట్‌తో పట్టణంలోని ఓ ఆస్పత్రి దగ్ధమైంది. ఈ ఘటన భువనగిరిలో శుక్రవారం రాత్రి చేసుకుంటుంది. వివరాలు.. పట్టణంలోని పల్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి విద్యుత్ మెయిన్‌బోర్డులో అర్ధరాత్రి దాటిన తరువాత మంటలు లేచాయి. దీంతో ఆస్పత్రి అంతా మంటలు వ్యాపించి ముందు, పై భాగం, మెడికల్ షాపు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆస్పత్రిలో నుంచి మంటలు, పొగలు వస్తున్న విషయాన్ని గమనించి స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ మేరకు రూ. 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఆస్పత్రి యాజమాని డాక్టర్ ఓవైసి తెలిపారు.