బాధితులకు ఆర్థికసాయం అందిస్తున్న సురేశ్‌రెడ్డి
ఎలిగేడు(పెద్దపల్లి) : పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో శుక్రవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన గజ్జెల మారుతి ఇంట్లో చీకటి లక్ష్మి, తిరుపతి దంపతులు కొన్నేళ్లుగా అద్దెకుంటున్నారు. తిరుపతి, తన కొడుకు మహేశ్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. ఇంట్లో లక్ష్మి ఒక్కతే ఉంటోంది.
శుక్రవారం ఉదయం ఉపాధిహామీ పనులకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి లక్ష్మికి సమాచారం అందించారు. ఆమె అక్కడికి చేరుకునే సరికి మంటలు ఇళ్లంతా వ్యాపించాయి. ఇంట్లోని సిలిండర్, టీవీ సైతం పేలడంతో మంటలు ఆర్పేందుకు వచ్చిన గ్రామస్తులు భయంతో పరుగు తీశారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు.
ఇల్లుతో పాటు, బీరువాలో ఉన్న తొమ్మిది తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.1.5 లక్షల నగదు, 70 క్వింటాళ్ల మక్కలు, పట్టాదారు పాసుపుస్తకాలు కాలిపోయాయని బాధితురాలు బోరున విలపించింది. ఘటనాస్థలాన్ని వీఆర్వో ప్రసాద్ సందర్శించారు. నష్టాన్ని అంచనా వేసి, నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
ముప్పిరితోటలో శుక్రవారం షార్ట్‌సర్క్యూట్‌తో స ర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వా న్ని ఆదుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొట్టె ముక్కుల సురేశ్‌రెడ్డి కోరారు. ఘటనాస్థలా న్ని పరిశీలించి, బాధితురాలిని ఓదార్చారు. అనంతరం రూ.5వేల ఆర్థిక సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment