house Burned
-
అమలాపురంలోని నివాసానికి మంత్రి విశ్వరూప్
-
నిరసనకారులు తగలబెట్టిన ఇంటిని పరిశీలించిన మంత్రి విశ్వరూప్
సాక్షి, అమలాపురం: నిరసనకారులు తగలబెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తన ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరమన్నారు. కోనసీమ సాధన సమితి కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. సంఘ విద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారన్నారు. కార్యకర్తలను కంట్రోల్ చేయడంలో టీడీపీ, జనసేన విఫలమయ్యింది. నిరసనకారుల ఆందోళనల్లో రౌడీషీటర్లు వచ్చారు. రౌడీషీటర్లే విధ్వంసం సృష్టించారని మంత్రి విశ్వరూప్ అన్నారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర' కాగా, జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. అమలాపురం ఎర్ర వంతెన సమీపంలో మంత్రి పినిపే విశ్వరూప్ అద్దెకు ఉంటున్న ఇంటిపై దాడికి దిగి నిప్పు పెట్టారు. అల్లరి మూకలు తమ చేతిలోని పెట్రోల్ డబ్బాలను ఇంట్లోకి విసరటంతో ఇంటిలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు బీభత్సంగా వ్యాపించాయి. ఇంటిలో ఉన్న మంత్రి గన్‌మెన్ శ్రీనివాస్, వంట మనిషి ప్రకాష్‌కు గాయాలయ్యాయి. ఈ సమయంలో మంత్రి విశ్వరూప్‌తో పాటు కుటుంబ సభ్యులెవరూ ఇంటిలో లేకపోవటంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లి అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇంటికి నిప్పు పెట్టారు. ఎమ్మెల్యేపై దాడి జరగకుండా ఆ సమయంలో అక్కడున్న ఆయన అనయాయులు అడ్డుకోగలిగారు. ఇంటిలో ఉన్న ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. -
ఇంటికి నిప్పు పెట్టిన ఎలుక!
ఏలూరు టౌన్: వారంతా రోజువారీ కూలీలు. యథావిధిగా ఉదయాన్నే దీపం వెలిగించి ఇంటి నుంచి పనులకు బయటకు వెళ్లిపోయారు. చిమ్ని లేని దీపం కాస్తా కింద పడిపోయింది. ఇల్లు జమ్ము దడులతో ఉండటంతో వాటికి నిప్పంటుకుంది. మంటలు చెలరేగాయి. అవి పక్క ఇళ్లకు వ్యాపించాయి. దీనికి తోడు ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఐదిళ్లు కాలి బూడిదయ్యాయి. ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మిగిలిన ఇళ్లకు మంటలు వ్యాప్తించకుండా అదుపు చేశారు. అయితే ఆ దీపం కింద పడిపోవటానికి ఎలుక కారణమని భావిస్తున్నారు. ఈ ఘటన మాదేపల్లి సమీపంలోని గురకల పేటలో జరిగింది. ఉరదళ సుబ్బారావు, అనిక దశరథ, పి.తులసి, కెల్లా అప్పలనాయుడు, కెల్లా శాంత ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆస్తి నష్టం సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా. చదవండి: విషాదం: పిల్లల కళ్లెదుటే.. కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్ -
ఇంటికి నిప్పు..
కమలాపూర్(హుజూరాబాద్): గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటికి నిప్పం టించగా ద్విచక్రవాహనంతోపాటు తలుపులు, కిటికీలు, ఇంట్లోని సామగ్రి మొత్తం దగ్ధమైన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నద్దునూరి సమ్మయ్య ఇంట్లోకి రెండు నెలల క్రితం ఉడుము వచ్చింది. దీంతో మూడు నెలల పాటు ఇల్లు వదిలి పెట్టాలనడంతో రెండు నెలలుగా హన్మకొండలో నివాసం ఉంటున్నాడు. కాగా సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి పొగలు, మంటలు వస్తున్నాయని చుట్టుపక్కల వారు ఫోన్ చేసి చెప్పగా అతడు గ్రామానికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పేశారు. అప్పటికే ఇంటి తలుపులు, కిటికీలు, ఇం ట్లోని పల్సర్ ద్విచక్రవాహనం, రెండు బీరువాలు, రెండు డెకోలం మంచాలు, ఒక కుట్టుమిషన్, కూలర్, టీవీ, బీరువాలోని ఐదు తులాల బంగా రు ఆభరణాలు, దుస్తులు, సర్టిఫికెట్లు తదితర సామాగ్రి కాలిబూదిదైంది. సుమారు రూ.5లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుం బీకులు బోరున విలపించారు. పథకం ప్రకారమేనా? దగ్ధమైన సమ్మయ్య ఇంటి ఆవరణను పరిశీలిస్తే పథకం ప్రకారమే ఇదంతా చేసినట్లుగా బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఆవరణలో పడి ఉన్న కట్టర్, ప్రధాన ద్వారానికి బిగించిన బెడెం తెగి ఉన్నాయి. కట్టర్‌తో బెడం కట్ చేసిన దుండగులు ఇంట్లోకి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు. దిలీప్‌పై అనుమానం.. దేశరాజుపల్లి గ్రామంలోనే ఎల్లబోయిన దిలీప్ ఈ పనికి ఒడిగట్టి ఉంటాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దిలీప్, తన కూతురు సుమారు ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత గొడవలు జరగడంతో పెద్దల తీర్పు మేరకు తన కూతురుకు కొంత మొత్తం డబ్బులు చెల్లించి ఏడాది క్రితం విడాకులు తీసుకున్నారన్నారు. తన నుంచి డబ్బులు వసూలు చేశారని మనసులో పెట్టుకొన్న దిలీప్ తన స్నేహతుడు శ్రీనివాస్‌తో కలిసి తాము ఇంట్లో లేని సమయం చూసి ఇదే అదనుగా భావించి తమ ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించి దహనం చేసి ఉంటాడని సమ్మయ్య, అతడి కూతురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దేశరాజుపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారం మేరకు ఎస్సై సందీప్‌కుమార్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన ఇంటిని పరిశీలించి బాధిత కుటంబీకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. బాధితుడు సమ్మయ్య ఫిర్యాదు మేరకు దిలీప్, అతడి స్నేహితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
రాయగడ : అంబొదల గ్రామంలో ఇందిరపొడ వీధిలో కిరాణ షాపుతో ఉన్న ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. బిజయసున్నా ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్ జరి గి అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. ఇంటిలో వస్తు సామగ్రి ధ్వంసమయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాహుల్ బాగ్(35), తన కుమారుడు రణవీర్ బా గ్(4) గాయపడ్డారు. వీరు బిజయసున్నా ఇంటికి బంధువులుగా వచ్చారు. ఈ సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో వీరు గాయపడ్డారు. వీరి లో రణవీర్ బాగ్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ముందుగా అంబొదల ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించగా పరిస్థితి విషమించడంతో బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రణవీ ర్‌బాగ్ పరిస్థితి మరింత విషమించగా బరంపురం తరలించినట్టు తెలిసింది. దీనిపై అంబొదల పోలీ సులు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు. ఈ ఘటన తెలుసుకున్న బిసంకటక్ ఎమ్మెల్యే జగన్నాథసారక ఘటనా స్థలానికి చేరుకొని బాధితుల ను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. -
సాక్ష్యం దొరకకుండా ఇంటికి నిప్పు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్) : ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు ఆపై సాక్ష్యాధారం దొరకుండా ఆ ఇంటికి నిప్పుపెట్టారు. దారుణ ఘాతాకానికి పాల్పడిన దొంగల పనితో ఆ ఇంట్లో వారికి కట్టుబట్టలు మినహా మరేమీ మిగలలేదు. కూడబెట్టుకున్న డబ్బులు చోరీకి గురికాగా, కట్టుకునే బట్టలు కాలిబూడిదయ్యాయి. కనీసం తాము బతికి ఉన్నామనే సర్టిఫికెట్లు కూడా కాలిబూడిద కావటంతో ఆ ఇంట్లోవారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రానున్న రంజాన్ పండుగ నేపథ్యంలో కొత్త బట్టలు కొనుక్కునే స్థోమతలేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్ హబీబ్‌నగర్‌లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలోని హబీబ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ గౌస్ శనివారం రాత్రి గౌతంనగర్‌లో ఉంటున్న తన అత్తగారింటికి వెళ్లాడు. అత్తకు ఆరోగ్యం బాగలేకపోవటంతో భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి ఆమెను పలుకరించేందుకు వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో ఈదురు గాలులు విపరీతంగా వీయటంతో గాలులు తక్కువయ్యాక ఇంటికి వెళ్దామని అనుకుని అక్కడే ఉండిపోయాడు. రాత్రి ఒంటిగంట వరకు ఈదురు గాలులు తక్కువ కాకపోవటంతో అత్తగారింట్లోనే ఉండిపోయాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో స్థానికుడు ఒకరు మీ ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని ఫోన్ చేసి చెప్పటంతో వెంటనే తన ఇంటికి బయలుదేరాడు. అప్పటికే ఇంట్లోనుంచి విపరీతమైన మంటలు వస్తుండటంతో వెంటనే ఫైరింజన్ కార్యాలయానికి ఫోన్ చేయగా వారు మంటలను ఆర్పివేశారు. అనంతరం ఇంట్లోకెళ్లి చూడగా బీరువా పూర్తిగా కాలిపోయి ఉండటం, అందులో 15 తులాల బంగారు అభరణాలు, రూ.మూడున్నర లక్షలు చోరీకి గురి కావటం గమనించారు. దొంగలు బీరువాను పగలగొట్టి అందులో డబ్బులు, బంగారు అభరణాలు ఎత్తుకుపోయారని బాధితుడు తెలిపారు. కట్టుబట్టలే మిగిలాయి.. దొంగలు ఇంటిని దోచుకుని ఇంటికి నిప్పు పెట్టడంతో కట్టుబట్టలు మినహా ఏమీ మిగలలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బీరువాలో దాచిపెట్టిన విలువైన డాక్యుమెంట్లు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు బుక్‌లు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, పిల్లల సర్టిపికెట్లు, ఖరీదైన బట్టలు పూర్తిగా కాలిబూదయ్యాయని బాధితుడు గౌస్ వాపోయారు. తన వ్యాపారానికి సంబంధించి వచ్చిన డబ్బులు, భార్య దాచుకున్న డబ్బులు మొత్తం రూ.మూడున్నర లక్షలు చోరీకి గురైనట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర అగ్నిప్రమాదం
ఎలిగేడు(పెద్దపల్లి) : పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో శుక్రవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్షార్ట్సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన గజ్జెల మారుతి ఇంట్లో చీకటి లక్ష్మి, తిరుపతి దంపతులు కొన్నేళ్లుగా అద్దెకుంటున్నారు. తిరుపతి, తన కొడుకు మహేశ్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. ఇంట్లో లక్ష్మి ఒక్కతే ఉంటోంది. శుక్రవారం ఉదయం ఉపాధిహామీ పనులకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి లక్ష్మికి సమాచారం అందించారు. ఆమె అక్కడికి చేరుకునే సరికి మంటలు ఇళ్లంతా వ్యాపించాయి. ఇంట్లోని సిలిండర్, టీవీ సైతం పేలడంతో మంటలు ఆర్పేందుకు వచ్చిన గ్రామస్తులు భయంతో పరుగు తీశారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఇల్లుతో పాటు, బీరువాలో ఉన్న తొమ్మిది తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.1.5 లక్షల నగదు, 70 క్వింటాళ్ల మక్కలు, పట్టాదారు పాసుపుస్తకాలు కాలిపోయాయని బాధితురాలు బోరున విలపించింది. ఘటనాస్థలాన్ని వీఆర్వో ప్రసాద్ సందర్శించారు. నష్టాన్ని అంచనా వేసి, నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి ముప్పిరితోటలో శుక్రవారం షార్ట్‌సర్క్యూట్‌తో స ర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వా న్ని ఆదుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొట్టె ముక్కుల సురేశ్‌రెడ్డి కోరారు. ఘటనాస్థలా న్ని పరిశీలించి, బాధితురాలిని ఓదార్చారు. అనంతరం రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. -
సిలిండర్ పేలి పూరిళ్లు దగ్ధం
నెల్లిమర్ల: నగర పంచాయతీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో శుక్రవారం మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు అందించిన వివరాలు...పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జికి సమీపంలోనున్న ఓ పూరింట్లో ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో పక్కపక్కనే ఉన్న ఇట్లా అప్పారావు, ఇట్లా అప్పలనర్సమ్మ, ఇట్లా రమణలకు చెందిన మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అప్పారావు కుమార్తెకు తాజాగా వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఖర్చుల నిమిత్తం అప్పు చేసిన నగదు రూ. 75 వేలు, మూడు తులాల బంగారం ఈ ప్రమాదంలో కాలి బూడిదైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిత్యావసరాలు సైతం కాలిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫోన్ చేసినప్పటికీ ఫైర్ ఇంజన్ రావడం ఆలస్యమైంది. దీంతో వాహనం వచ్చేసరికి పూర్తిగా కాలిపోయాయి. రెవెన్యూ అధికారులు ప్రమాద స్థలానికి వచ్చి ఆస్తి నష్టం అంచనా వేశారు. రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రాథమిక అంచనా. -
ఇల్లు దగ్ధం.. మహిళ సజీవ దహనం
సాక్షి, అనంతపురం రూరల్: అనంతపురం నగరంలో శుక్రవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఇందిరానగర్‌లో గుడిసెకు నిప్పంటుకుని ఓ మహిళ సజీవ దహనం అయింది. మృతురాలిని ఒంటరి మహిళ రజియాబీగా గుర్తించారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కళ్లెదుటే పంట డబ్బు ఆహుతి
నిడదవోలు రూరల్: పగలనక, రేయనక కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్మి తెచ్చిన సొమ్మును కళ్లెదుటే అగ్నికీలలు ఆహుతి చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరుమున్నీరైంది ఓ కౌలు రైతు కుటుంబం. ఈ దయనీయ ఘటన శెట్టిపేటలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో రెండు పోర్షన్ల తాటాకింట్లో పాఠంశెట్టి వెంకట్రావు కుటుంబంతోపాటు అతని ఇద్దరు కుమారులు వీరవెంకట సత్యనారాయణ, రామకృష్ణ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కూలీనాలి చేసుకుని జీవించే వీరంతా రాత్రి పడుకున్న తరువాత విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇల్లంతా వ్యాపించాయి. క్షణాల్లో దుస్తులు, నిత్యవసర వస్తువులు, వంటసామగ్రి కాలిబూడిదయ్యాయి. దుస్తుల పెట్టెలో భద్రపరిచిన పంట డబ్బు రూ.80 వేలు కాలిపోయింది. నిడదవోలు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. మొత్తం రూ.2.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అగ్నిమాపకాధికారి జె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
అగ్నికీలల్లో ఆరిపోయిన జ్యోతి
► కొల్లూరులో గృహం దగ్ధమైన ఘటనలో బాలిక సజీవ దహనం ► శోకసంద్రంలో కుటుంబం, బంధువులు కొల్లూరు : చిన్నారులతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో అగ్ని ప్రమాదం ఆరని కుంపటిని రగిల్చింది. బుడిబడి నడకలతో, వచ్చీరాని మాటలతో ఇంట్లో సంతోషాలను పంచుతున్న బాలిక ప్రమాదవశాత్తు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొల్లూరులో సోమవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ బాలిక సజీవ దహనం అవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకూ తోటి చిన్నారులతో ఆటపాటలతో గడిపిన ఆ బాలిక తమ బంధువుల ఇంట్లోకి వెళ్లి అగ్నిప్రమాదంలో చిక్కుకుని మంటలకు ఆహుతవడం కుటుంబ సభ్యులు, బంధువులను శోకసంద్రంలోకి నెట్టివేసింది. స్థానికుల కథనం మేరకు.. కొల్లూరు అంబేడ్కర్ కాలనీకి చెందిన కొలకలూరు గోపి, రజనిలకు ఇద్దరు కుమార్తెలు. విద్యుత్ పనులు చేసుకుంటూ జీవించే గోపి పని నిమిత్తం బయటకు వెళ్లగా, బాలిక తల్లి పొలం పనికి వెళ్లింది. పెద్ద కుమార్తె అయిన జ్యోతి (4) తోటి పిల్లలతో ఆడుకుంటూ తన మేనమామ అయిన చొప్పర ముసలయ్య ఇంటికి వెళ్లింది. ముసలయ్య, ఆయన భార్య శేషమ్మ సైతం పొలం పనులకు వెళ్లారు. అదే సమయంలో ఆ ఇంట్లో విద్యుత్ షార్టు సర్క్యూట్ సంభవించి తాటాకుల ఇంటికి మంటలు వ్యాపించాయి. బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించక బాలిక లోపలే చిక్కుకుపోయింది. ఇంట్లో బాలిక ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు శతవిధాలా చిన్నారిని కాపాడే ప్రయత్నాలు చేసినా, అప్పటికే మంటల తాకిడికి బాలిక సజీవదహనమై మసిబొగ్గుగా మారిపోయింది. ఇంటి వెనుక గోడను కూల్చి జ్యోతి మృతదేహాన్ని వెలుపలికి తీశారు. అప్పటివరకూ బాలిక తప్పించుకుని ప్రాణాలతో ఉండవచ్చునన్న ఆశతో ఎదురు చూసిన తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు తీరా మసిబొగ్గుగా మారిన బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ ఇంటి దీపంగా బావించిన బాలిక అగ్నికి ఆహుతై చివరి చూపునకు కూడా దక్కకుండా పోవడం ఆ కుటుంబాన్ని తీరని వేదనకు గురిచేసింది. ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్, తహసీల్దార్ ఎ.శేషగిరిరావు బాలిక మృతిపై తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
షార్ట సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మండల పరిధిలోని బుస్సాపూర్‌లో శనివారం తెల్లవారుజామున ఓ ఇల్లు దగ్ధమైంది. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. లేకుంటే ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలి ఇరుగుపొరుగు ఇళ్లు కూడా ధ్వంసమై పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వల్లపురెడ్డి కిష్టారెడ్డి రిటైర్డ్ టీచర్. పిల్లలకు పెళ్లి అయి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. దీంతో కిష్టారెడ్డి దంపతులు గ్రామంలో నివాసముంటున్నారు. అయితే కిష్టారెడ్డికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఇంటికి తాళం వేసి చికిత్స నిమిత్తం శుక్రవారం సిద్దిపేటకు భార్యతో కలిసి వెళ్లారు. డాక్టర్‌కు చూపించుకుని ఇంటికి బయలుదేరారు. అయితే మధ్యలో ఓ బంధువు ఆహ్వానం మేరకు వారి ఇంట్లోనే ఆ రాత్రి బస చేశారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం కిష్టారెడ్డి ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పం దించకుండా ఉంటే ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలి పెను ప్రమాదం సంభవించేదని గ్రామస్తులు తెలిపారు. ఇంతలో విషయాన్ని తెలుసుకున్న కిష్టారెడ్డి గ్రా మానికి చేరుకున్నారు. వంట రూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 1.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.