మాదేపల్లి గురకలపేటలో మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక దళం
ఏలూరు టౌన్: వారంతా రోజువారీ కూలీలు. యథావిధిగా ఉదయాన్నే దీపం వెలిగించి ఇంటి నుంచి పనులకు బయటకు వెళ్లిపోయారు. చిమ్ని లేని దీపం కాస్తా కింద పడిపోయింది. ఇల్లు జమ్ము దడులతో ఉండటంతో వాటికి నిప్పంటుకుంది. మంటలు చెలరేగాయి. అవి పక్క ఇళ్లకు వ్యాపించాయి. దీనికి తోడు ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఐదిళ్లు కాలి బూడిదయ్యాయి.
ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మిగిలిన ఇళ్లకు మంటలు వ్యాప్తించకుండా అదుపు చేశారు. అయితే ఆ దీపం కింద పడిపోవటానికి ఎలుక కారణమని భావిస్తున్నారు. ఈ ఘటన మాదేపల్లి సమీపంలోని గురకల పేటలో జరిగింది. ఉరదళ సుబ్బారావు, అనిక దశరథ, పి.తులసి, కెల్లా అప్పలనాయుడు, కెల్లా శాంత ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆస్తి నష్టం సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా.
చదవండి: విషాదం: పిల్లల కళ్లెదుటే..
కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment