
పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎంపీ పొంగులేటి
ఖమ్మంమయూరిసెంటర్ : వీధి బాలల జీవితాన్ని కళ్లకు కట్టేలా మేరా భారత్ మహాన్ షార్ట్ ఫిలిం నిర్మించడం అభినందనీయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేరా భారత్ షార్ట్ ఫిలిం పోస్టర్‌ను శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భారతదేశ చరిత్రను భావి తరాలకు తెలియచేస్తూ, స్ఫూర్తిదాయకమైన, సందేశాత్మకమైన షార్ట్‌ఫిలింలను నిర్మించాలని ఈ సందర్భంగా ఎంపీ వారికి సూచించారు. చిన్నారులతో షార్ట్‌ఫిలిం నిర్మించిన దర్శక నిర్మాతలను ఎంపీ అభినందించారు.
భవిష్యత్తులో మరిన్ని చిత్రాలను నిర్మించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు లింగాల కమలరాజు, కొప్పురావూరి వెంకటకృష్ణ, అజ్మీరా అశోక్‌నాయక్, ఫిలిం డైరెక్టర్ బేతంపూడి శ్రీకాంత్, నిర్మాత మండె రమణ నటీనటులు అశ్విన్, ప్రదీప్, కెమెరామెన్ లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment