
కోల్‌కతా: ప్రముఖ ఆర్థిక వేత్త అశోక్ మిత్రా(90) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. జ్యోతిబసు పశ్చిమబెంగాల్ సీఎంగా ఉన్న సమయంలో మిత్రా పదేళ్లు ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇందిర హయాంలో ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేశారు. సాహితీరంగంలో చేసిన సేవలకు గాను మిత్రాకు సాహిత్య అకాడెమీ పురస్కారం కూడా వచ్చింది.