కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఫకీరమ్మ, కురువ జమ్మన్న దంపతుల కుమారుడు అశోక్(6) ఆడుకుంటూ ఆడుకుంటూ పొలంలో ఉన్న ఇంకుడు గుంతలో పడి చనిపోయాడు. ప్రమాదసమయంలో బాలుడి తల్లిదండ్రులు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.