ఆంధ్రా జట్టు అండర్–16 ఫిజియోగా జిల్లాకు చెందిన అశోక్ నియమితులయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్రా జట్టు అండర్–16 ఫిజియోగా జిల్లాకు చెందిన అశోక్ నియమితులయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. గతేడాది అండర్–25 ఆంధ్రా జట్టుకు ఫిజియోగా చేసిన అనుభవంతో నేడు అండర్–16 జట్టుకు ఎంపిక చేశారన్నారు. అశోక్ ప్రస్తుతం ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో ఫిజియోగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. అశోక్ తన ఫిజియో కోర్సును తిరుపతి, బెంగుళూరులో పూర్తి చేశారన్నారు. జిల్లా నుంచి రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఫిజియోగా ఎంపికపై జిల్లా క్రికెట్ సంఘం హర్షం వ్యక్తం చేశారు.