గుంటూరు జిల్లా అమరావతిలో కృష్ణా నది సాక్షిగా అవినీతి ఏరులై పారుతోందని బీజేపీ నేత అశోక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గుంటూరు: టీడీపీ అరాచకాలతో మిత్రపక్షమైన బీజేపీకి చెడ్డ పేరు వస్తోందని' బీజేపీ నేత అశోక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పై ఆయన గురువారం మండిపడ్డారు.
దేవుని భూములను కొట్టేసిన సిగ్గుమాలిన ఎమ్మెల్యే అంటూ ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లా అమరావతిలో కృష్ణా నది సాక్షిగా అవినీతి ఏరులై పారుతోందని విమర్శించారు. ఇసుక దందాలతో వందల కోట్లు కొల్లగొట్టారంటూ అశోక్ దుయ్యబట్టారు.