kommalapati sridhar
-
చర్చకు కాదు.. రచ్చకు.. కయ్యానికి కాలుదువ్విన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
అమరావతి: ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా తరచూ అధికార పక్షంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు తాజాగా పల్నాడు జిల్లా అమరావతిలోనూ కయ్యానికి కాలుదువ్వారు. అక్కడి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గత కొంతకాలంగా ప్రస్తుత పెదకూరపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావుపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వీటిపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించి అమరేశ్వరస్వామి ఆలయానికి ఆయన చేరుకున్నారు. కానీ, కొమ్మాలపాటి చర్చకు కాకుండా తన బలగంతో రచ్చచేయడానికే అన్నట్లు అక్కడికి బయల్దేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై కొమ్మాలపాటిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ మూకలు రెచ్చిపోయి బస్సుపై దాడిచేశారు. పోలీసులు వెంటనే ఇరుపార్టీల వారిని వెనక్కి పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఘటన పూర్వాపరాలు.. తనపై టీడీపీ నేతలు ఇటీవల కొన్నిరోజులుగా చేస్తున్న ఆరోపణలు, అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆదివారం అమరావతి అమరేశ్వరస్వామి సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సవాల్ విసిరారు. ఇందుకు టీడీపీ నేతలు, కొమ్మాలపాటి శ్రీధర్ స్పందించి తాము కూడా సిద్ధమని ప్రకటించారు. దీంతో వారం రోజులుగా పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో.. సత్తెనపల్లి డీఎప్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఇరుపార్టీల నాయకులకు నోటీసులు జారీచేసి ముఖ్య నేతలపై నిఘా పెట్టారు. అయితే, శనివారం అర్ధరాత్రి వరకు వారంతా ఎక్కడ ఉన్నారో తెలీక పోలీసులు విస్తృతంగా సోదాలు చేశారు. అమరావతితోపాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి అమరావతికి నాలుగు వైపులా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అలాగే, ఆదివారం ఉదయం చుట్టుపక్కల గ్రామాల నుంచి అమరావతికి వచ్చే ఇరుపార్టీల నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉ.9.35కు ఎమ్మెల్యే శంకరరావు అమరేశ్వరస్వామి దేవస్థానం గాలిగోపురం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో స్థానిక ముస్లిం కాలనీ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వైపు దాడులకు తెగబడేందుకు అన్నట్లుగా పెద్దఎత్తున తన మందీమార్బలంతో కొమ్మాలపాటి శ్రీధర్ బయల్దేరారు. దీనిని పోలీసులు పసిగట్టి వారిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. అనంతరం.. కొమ్మాలపాటిని పోలీసులు అదుపులోకి తీసుకుని అమరావతి పోలీస్‌స్టేషన్ వైపు తరలిస్తుండగా టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఒక్కసారిగా అక్కడున్న బస్సుపై వారు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బస్సు అద్దం ధ్వంసమైంది. దీంతో కొమ్మాలపాటిని క్రోసూరు వైపునకు మళ్లించారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అమరేశ్వరస్వామి దేవస్థానం వద్ద నుంచి గాంధీబొమ్మ వైపు వస్తుండగా పోలీసులు వారినీ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు మద్దతుగా నినాదాలు చేస్తూ కొమ్మాలపాటి శ్రీధర్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. డీఎస్పీ ఆదినారాయణ సంయమనంతో వారిని నిలువరించడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. -
అభివృద్ధిపై చర్చకు రావాలని కొమ్మలపాటికి నంబూరి సవాల్
-
అమ్మో.. కొమ్మాలపాటి.. రత్నాలచెరువులో వెంచర్లు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాలచెరువును కొల్లగొట్టిన వైనం ఇది. సాగుచేసుకోమని పేదలకు ఇచ్చిన ఈ చెరువు భూమి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఈ భూముల్ని కొని వెంచర్‌వేసి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సుమారు రూ.70 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. పట్టణంలోని 134 సర్వే నంబర్లో 94 ఎకరాల విస్తీర్ణంలో రత్నాలచెరువు ఉంది. కొన్నేళ్లుగా పేదలు కొందరు గుడిసెలు వేసుకుని నివసించసాగారు. ఇదే ఆక్రమణదారులకు అడ్డాగా మారింది. పేదల పేరుతో పెద్దలు సుమారు 24 ఎకరాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు గ్రామంలో 2004కు ముందు పొలాలు కొని అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వెంచర్ వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్లాట్లు వాయిదాల పద్ధతిలో విక్రయించారు. వాయిదాలు కట్టిన వందలాది మందికి ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయకుండా తిప్పుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అదే వెంచర్‌కు దగ్గరలో ఉన్న రత్నాలచెరువుపై ఆయన కన్నుపడింది. ఈ చెరువు భూమిని సాగుచేసుకునేందుకు ప్రభుత్వం కొంతమంది ఎస్సీలకు పట్టాలిచ్చింది. పట్టాలు ఇచ్చిన భూమిని విక్రయించకూడదని నిబంధన విధించింది. అయినా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి ఎస్సీల వద్ద నుంచి 7.5 ఎకరాలను రూ.35 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ భూమిలో ప్లాట్లు వేసి ప్రజలకు విక్రయించారు. రిజిస్ట్రేషన్లు చేసి రూ.70 కోట్ల మేర సొమ్ము చేసుకున్నారు. ఈ భూమిని తనకే ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి గత టీడీపీ ప్రభుత్వ పాలనలో మంత్రి లోకేశ్ రత్నాలచెరువు భూమి మొత్తాన్ని ఐటీ కంపెనీల పేరుతో తమ అనుచరులకు కట్టపెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అప్పటి ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ జిల్లా కలెక్టర్‌కు ఒక వినతిపత్రం ఇచ్చారు. చెరువులో తాను కొనుగోలు చేసిన 7.5 ఎకరాలను తనకు వదిలిపెట్టాలని కోరారు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తన వద్ద ప్లాట్లు కొన్నవారు తనను డబ్బులు తిరిగి ఇవ్వమంటారనే ఆందోళనతోనే ఆయన ఈ వినతిపత్రం ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికీ ఆ భూమిలో కొంత కొమ్మాలపాటి చేతుల్లోనే ఉంది. రత్నాలచెరువు నకిలీ దస్తావేజుల అక్రమాలపై అధికారులు విచారణ జరుపుతుండడంతో వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ చెరువు భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
కొమ్మాలపాటి.. అవినీతి కోటి
‘పవర్’ను వాడేశాడు.. ఎమ్మెల్యేగా అధికారాన్ని అడ్డదారుల్లో ఉపయోగించాడు.. నిబంధనల్ని పాతేశాడు.. ప్రభుత్వ ఖజానాకే షాక్ ఇచ్చాడు.. లక్షల రూపాయల విద్యుత్ బకాయిలు కట్టకపోవడమేగాక అక్రమంగా కరెంటు వాడుకున్నాడు.. ఆవైపు చూసినవారి గొంతుల్ని పవర్‌తో నొక్కేశాడు.. పలువురు అధికారుల్ని మేనేజ్ చేశాడు.. పెద్దమనిషిగా చలామణి అవుతూ అవినీతిని కొమ్మలుకొమ్మలుగా విస్తరించాడు.. ఇదీ.. తెలుగుదేశం నాయకుడు, గుంటూరు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అవినీతి కథ. సామాన్యుడు ఒక నెల విద్యుత్ బిల్లు కట్టకపోయినా అధికారులు చేసే హడావుడి అంతాఇంతా కాదు. అలాంటిది కొమ్మాలపాటి శ్రీధర్ అక్రమంగా విద్యుత్ నొక్కేస్తుంటే అధికారులు తెలియనట్లే వ్యవహరించారు. కొందరు అధికారానికి భయపడి, మరికొందరు అవినీతికి పాల్పడి మౌనంగా తలవంచారు. ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో గండి పడుతున్నా తమది కాదుగా.. అన్నట్లు వ్యవహరించారు. సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీకి చెందిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సుమారు నాలుగేళ్లుగా విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నారు. ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో శ్రీనాగమల్లేశ్వరి స్పిన్‌టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో స్పిన్నింగ్ మిల్లు, గాయత్రి శ్రీనారాయణస్వామి జిన్నింగ్ మిల్లు ఉన్నాయి. జిన్నింగ్ మిల్లుకు సంబంధించి సర్వీసు నంబరు జీఎన్టీ 3231కి విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో 2016 డిసెంబర్ 15న అధికారులు తనిఖీ చేశారు. బిల్లు చెల్లించనందుకు డీఫాల్ట్ చేసి నోటీసులు ఇచ్చారు. రూ.19 లక్షల విద్యుత్ బిల్లు, రూ.ఐదు లక్షల సర్‌చార్జీ మొత్తం రూ.24 లక్షలు పెండింగ్ ఉండటంతో విద్యుత్ కనెక్షన్‌ను తొలగించారు. ఆ తర్వాత కూడా కొమ్మాలపాటి ఆ బిల్లును చెల్లించలేదు. అప్పట్లో కొమ్మాలపాటి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం, అప్పటి వినుకొండ ఎమ్మెల్యే, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు స్వయానా వియ్యంకుడు కావడంతో ఎవరూ ఆయనవైపు చూడలేకపోయారు. భూగర్భంలో అవినీతి లైను జిన్నింగ్ మిల్లుకు విద్యుత్ సరఫరా నిలిపేయడంతో కొమ్మాలపాటి అక్రమమార్గం ఎంచుకున్నారు. అక్కడికి 400 నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న స్పిన్నింగ్ మిల్లు నుంచి భూగర్భంలో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి జిన్నింగ్‌మిల్లుకు కనెక్షన్ ఇచ్చారు. విద్యుత్ మాల్‌ప్రాక్టీస్‌కు తెరతీశారు. ఈ విషయం తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. విద్యుత్ శాఖ మాచర్ల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ఏ ఆర్మ్‌స్ట్రాంగ్ బిల్లు స్టాప్, బిల్లు చెల్లించని కనెక్షన్లను తనిఖీ చేయాలని నవంబర్ 16, 17 తేదీల్లో ఏడీఈలు, ఏఈలను ఆదేశించారు. దీంతో నవంబర్ 23న అధికారులు తనిఖీ చేయగా భూగర్భ విద్యుత్ లైను బయటపడింది. తరువాత 24, 25, 26 తేదీల్లో విజిలెన్స్ అధికారులు కొమ్మాలపాటి శ్రీధర్‌కు చెందిన జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల్లో తనిఖీలు చేశారు. భూగర్భ మార్గంలో నుంచి విద్యుత్ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. సుమారు నాలుగేళ్లుగా ఇలా ప్రజాధనాన్ని దోపిడీచేస్తున్న కొమ్మాలపాటి అవినీతిని బట్టబయలు చేశారు. జిన్నింగ్ మిల్లుకు విద్యుత్ కనెక్షన్ కట్‌చేసి నోటీసులిచ్చారు. రూ.1.69 కోట్లు చెల్లిస్తేనే తిరిగి కనెక్షన్ జిన్నింగ్మిల్లును పరిశీలించిన విజిలెన్స్ అధికారులు రూ.1.69 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు. పాత బకాయిలు, ఫైను కలిపిన ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఉన్నతాధికారులపై అనుమానాలు జిన్నింగ్ మిల్లుకు 2016 డిసెంబర్ నుంచి ఇప్పుడు 2020 నవంబర్ వరకు సుమారు నాలుగేళ్లపాటు కోటిరూపాయలకు పైగా విలువైన విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నా ఉన్నతాధికారులకు తెలియలేదంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పిన్నింగ్ మిల్లు నుంచి జిన్నింగ్ మిల్లుకు భూగర్భ లైన్ వేశారంటే విద్యుత్ అధికారుల ప్రమేయం ఉండే ఉంటుందని ఆ శాఖలోని కొందరు చెబుతున్నారు. గతనెలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసినా టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయకపోవడం వెనుక ఉన్నతాధికారుల లాలూచీ ఉండొచ్చన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయమై గుంటూరు విజిలెన్స్ ఈఈ విజయకృష్ణను వివరణ కోరగా ఈ విషయాలు బయటకు చెప్పేవి కాదన్నారు. జిన్నింగ్ మిల్లుకు సంబంధించి రూ.1.69 కోట్లు చెల్లించాల్సిన విషయం వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
కొమ్మాలపాటి అవినీతిలో మేటి
సాక్షి, గుంటూరు : రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఇసుక దందా వరకు.. సదావర్తి సత్రం భూములను చేజిక్కించుకోవడం నుంచి ఎర్ర మట్టి దోపిడీ వరకు.. బెట్టింగ్ మాఫీయా నుంచి ‘నీరు–చెట్టు’లో అవినీతి వరకు.. కాదేది ఆయన అక్రమార్జనకు అనర్హం. కన్నుపడితే దౌర్జన్యం చేయడం ఖాయం. ఒక సామాన్య వ్యక్తి నుంచి నేడు రూ.కోట్లకు పడగెత్తిన రాజకీయ నాయకుడిగా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సాగించిన అవినీతి కథలు రాయాలంటే పుస్తకాలే చాలవేమో. కృష్ణమ్మ నది గర్భంలో డ్రెడ్జర్లతో భారీ లోతులో ఇసుక తవ్వకాలు జరిపి.. అమాయక ప్రాణాలను బలిగొన్నా.. బినామీల పేరుతో గ్రావెల్ కొట్టేసినా ఆయనకే చెల్లింది. ఇలా ఇందు లేదు అందు లేదు.. ఎందెందు వెతికినా అందందే అవినీతిని విస్తరించి.. మద్యాన్ని ఎరులై పారించిన ప్రజాప్రతినిధి కొమ్మాలపాటి. రాజధాని ప్రాంతఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ అండతో ఇసుక మాఫియాను నడుపుతూ వేల కోట్లు దోచేశారు కొమ్మాలపాటి శ్రీధర్. అందులో చినబాబు వాటాపోను సుమారు రూ. 500 కోట్లకుపైగా వెనకేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన ప్రతి చోటా ప్రభుత్వ, పోరంబోకు భూములను ఆక్రమించి రెవెన్యూ అధికారుల ద్వారా సొంతం చేసుకున్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దశాబ్దాల క్రితం పట్టాలు ఇచ్చిన భూములను సైతం చెరబట్టారు. నీరు–చెట్టు పేరుతో మట్టిని బొక్కేయడంతోపాటు, అమరావతి మండలంలో అతి ఖరీదైన ఎర్ర మట్టిని తవ్వేసి సుమారుగా రూ. 100 కోట్లు దండుకున్నారు. నియోజవకర్గంలో మద్యం దుకాణాల వద్ద 20 శాతం వాటా గుంజేసుకుంటున్నారు. ఇసుక మాఫియా తీసిన గోతుల్లో పడి సుమారుగా 25 మందికిపైగా అమాయకులు బలయ్యారు. అయినా కొమ్మాలపాటి ధనదాహం మాత్రం తీర లేదు. అమరావతి, అచ్చంపేట మండలాల్లో అక్రమంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ రవాణా కోసం కృష్ణా నది మధ్యలో నుంచి రోడ్డు నిర్మించారు. నీరు–చెట్టులో అవినీతి ప్రవాహం.. నీరు–చెట్లు కార్యక్రమం అధికార పార్టీ ఎమ్మెల్యే కొమ్మాలపాటికి బంగారు బాతుగా మారింది. పథకం పేరుతో నియోజకవర్గంలోని మండలాల్లో నిధులను ఎమ్మెల్యే భారీగా మింగేశారు. బెల్లంకొండ మండలంలో నందిరాజుపాలెం గ్రామానికి చెందిన ఎస్సీలు 28 సంవత్సరాలుగా 40 ఎకరాలు భూమిని సాగు చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 40 ఎకరాలు ఆక్రమించుకొని వాటిలో 10 ఎకరాల్లో నీరు– చెట్టు కింద మట్టిని తవ్వి అవినీతికి పాల్పడ్డారు. పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో కలుపుకుని జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆయన అనుచరులు రూ. 30 కోట్ల వరకూ మట్టిని మింగేశారు. ప్రజల ప్రాణాలను బలిగొన్నారు... నాలుగున్నరేళ్లలో కొమ్మాలపాటి కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక మాఫియా తీసిన గోతుల్లో పడి 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 2016 ఆగస్టు 16న కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు, గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు ప్రాంతాన్ని కలిపే కృష్ణా నది పాయలో పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు చనిపోయారు కృష్ణానదిలో తీసిన భారీ గోతిలో ఓ విద్యార్థి మునుగుతుండగా, పక్కన ఉన్న తోటి విద్యార్థులు అతనిని రక్షించేందుకు వెళ్ళి వారు సైతం మృత్యువాత పడిన సంఘటన ఐదు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అదే ఏడాది గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు శివారులో ఉన్న కృష్ణా నదిలో జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఐదుగురు యువకులు ఇసుక కోసం తీసిన గోతుల్లో పడి జల సమాధయ్యారు. 2017 జనవరి 15న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఇసుక కోసం తవ్విన గోతుల్లో పడి మృత్యువాత పడ్డ వారంతా 20 ఏళ్లులోపు. మీటరు (మూడు అడుగులు) లోతుకంటే ఎక్కువ తవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కృష్ణానదిలో 20 అడుగులు తవ్వేశారు. ఇసుక తవ్వకాలకు యంత్రాలు వినియోగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా, ప్రభుత్వం జీవోలు జారీ చేసినా ఇసుకాసురులు మాత్రం అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కీలక బుకీ మాదినేని బాలజీ కొమ్మాలపాటి శ్రీధర్ మామ మాదినేని సుబ్బయ్య కుమారుడు కావడం గమనార్హం. బాలాజీ సొంతగా బోర్డు నడుపుతూ ఆన్లైన్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు లైన్ ఇస్తూ కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటాడు. ఇతని జోలికి పోలీసులు వెళ్ళకుండా కొమ్మాలపాటి చూసుకుంటారు. బాలాజీ తమ వద్ద భూములు, స్థలాలు బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటూ అనేక మంది బాధితులు 2016 డిసెంబర్లో అప్పటి గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. క్రికెట్ బుకీల ఆట కట్టించేందుకు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావు ఇద్దరు డీఎస్పీలు, ఎస్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బెట్టింగ్ బుకీల కోసం వేట సాగించారు. ఈ బృందం కీలక బుకీ బాలాజీతోపాటు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని పూర్తి స్థాయిలో విచారించడంతో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటకు వచ్చాయి. వీరు ఇచ్చిన సమాచారంతో బాలాజీ సోదరుడు, అమరావతికి చెందిన మండల స్థాయి టీడీపీ నేతతోపాటు జిల్లాలోని అనేక మంది కీలక క్రికెట్ బుకీల పాత్ర ఉన్నట్లు తేలింది. బాలాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి బావమరిది కావడంతో వారి జోలికి వెళ్లొద్దంటూ అధికార పార్టీ ముఖ్యనేతల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో ఆ మరుసటి రోజు ఐదుగురు క్రికెట్ బెట్టర్లను అరెస్టు చూపించారు. అందులో కీలక బుకీ బాలాజీ ఎవరనేది కూడా విలేకరులకు చెప్పకుండా.. కనీసం కోర్టులో హాజరు పర్చకుండా 41 నోటీసు ఇచ్చి వదిలేశారు. అమరావతిలో గతంలో పేకాట కూడా నిర్వహించారు. ఎర్ర మట్టి దోపిడీ.. అమరావతి మండల పరిధిలోని ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములలో కోట్లాది రూపాయల ఎర్ర గ్రావెల్ దోచుకున్నారు. ఎమ్మెల్యే బినామీలైన పెదకూరపాడు మండలం కంభంపాడుకు చెందిన మాదినేని సుబ్బయ్య కుమారుడు శ్రీనివాసరావు, పెదకూరపాడుకు చెందిన ఏటుకూరి గంగాధరరావు ఈ భూముల్లో తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ భూములు కలిగిన ఎండ్రాయి, లేమల్లె గ్రామాలకు చెందిన షేక్ మస్తాన్‌బీ డీకె పట్టా రద్దు చేయిస్తామని బెదిరించి సర్వే నెంబరు 95/1, 95/2లో ఉన్న 1.98 ఎకరాలు లేమల్లెలోని మేకల యేసోబుకు చెందిన 96/2లో ఉన్న ఎకరం భూమిని మాదినేని శ్రీనివాసరావు లీజుకు రాయించుకున్నాడు. దీంతోపాటుగా 2013 నవంబరు 23వ తేదీన చనిపోయిన కట్టెపోగు వందనం భార్య చిట్టెమ్మ పేరు మీద 96/2 నంబరులో ఉన్న 1.25 ఎకరాల భూమిని కూడా 2017 ఏప్రిల్ 1న నోటరీ అఫిడవిట్ ఇచ్చినట్లు ఏటుకూరి గంగాధరరావు పేరు మీద ఫోర్జరి చేసి లీజు అగ్రిమెంట్ సృష్టించినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆర్సీ నెం.402/2017బీ అర్డరులో డీకే పట్టాగా పేర్కొన్న భూములు మైనింగ్ మెమో నెం.1418/టీపీలో మాత్రం పట్టా భూమి అని చూపించారు. మొత్తం మీద 6150 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వేశారు. ప్రస్తుతం కర్లపూడి ఎస్సీ కాలనీకి దగ్గరలో ఉన్న గంగమ్మచెరువు వద్ద ప్రత్తిపాటి బేబమ్మ, ప్రత్తిపాటి బూదమ్మలకు పూర్వార్జితంగా సంక్రమించిన రెండు ఎకరాల భూమిని కొమ్మాలపాటి బంధువులు కొనుగోలు చేసి అక్రమ తవ్వకాలకు తెర తీశారు. -
దత్తత ఉత్తదయిన వేళ...
సాక్షి, పెదకూరపాడు : ‘ఈ గ్రామవాసిగా పెదకూరపాడును దత్తత తీసుకుంటున్నా. గ్రామ దశ, దిశలు మారుస్తా. ఎక్కడా జరగని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా.. జన్మభూమి రుణం తీర్చుకుంటా’.. అంటూ పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన కొమ్మాలపాటి శ్రీధర్ హామీలు గుప్పించారు. అయితే ఆయన ఈ గ్రామానికి చేసింది మాత్రం శూన్యమని, సొమ్మొకరిది, సోకొకరిది అన్న చందంగా 13,14 ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో కాలనీలో రోడ్లు వేసి తన నిధులతో చేసినట్లు బీరాలు పలకడం మినహా ఒరగబెట్టింది ఏమీ లేదని గ్రామస్తులు ఎద్దేవాచేస్తున్నారు. పెదకూరపాడు రైల్వేస్టేషన్లో జన్మభూమి, పల్నాడు ఎక్సెప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలన్నది గ్రామ ప్రజల చిరకాల వాంఛ. ఇందు కోసం ఎన్నోసార్లు రైల్వే అధికారులను కలసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తానంటూ తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, తాజా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు. ఎక్సెప్రెస్ రైలుకు హాల్ట్ కల్పిస్తే హైదరాబాద్, విశాఖపట్నం వెళ్లేవారు గ్రామంలోనే రైలు ఎక్కొచ్చన్న ఆశ కలగానే మిగిలింది. మూతపడ్డ హాస్టళ్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్య లేని కారణంగా పెదకూరపాడులో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం, బీసీ బాలుర వసతి గృహాన్ని రద్దుచేశారు. ఎమ్మెల్యేగా కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నా ఈ హాస్టళ్లను కొనసాగించేందుకు తీసుకున్న చర్యలు ఏమీ లేవని ఎస్సీ, బీసీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సొమ్మొకరిది... సోకు ఒకరిది ఇరుకుగా ఉన్న పెదకూరపాడు ప్రధాన రహదారి తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి స్వగ్రామం పెదకూరపాడులో నిర్మించిన సీసీ రోడ్ల వ్యవహారం సొమ్మొకరది, సోకు ఒకరది అన్న చందంగా మారింది. ఈ గ్రామాన్నికి ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.1.95 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు నిర్మించారు. ఈ నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానివి. 13, 14 ఆర్థిక సంఘం నిధులు రూ.95 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతోనూ సీసీ రోడ్లు నిర్మించారు. పంచాయతీ నిధులు రూ.30 లక్షలు మంజూరయ్యాయి. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్‌ను పక్కన పెట్టి ఆ నిధులతోనూ టీడీపీ వారే రోడ్లు వేశారు. అయితే కొమ్మాలపాటి శ్రీధర్ రహదారులు అంటూ బోర్డులు మాత్రం ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఎమ్మెల్యే నిధులు కింద పెదకూరపాడు గ్రామానికి వచ్చింది రూ.60 లక్షలు. వాటిలో రూ.40 లక్షలే వినియోగించారు. మిగిలిన రూ.20 లక్షలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఏమైంది? ప్రజల చిరకాల కోరిక పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగాలన్నది. మేము అనేక సార్లు రైల్వే అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించాం. అయితే ప్రయోజనం లేదు. ఎమ్మెల్యేగా శ్రీధర్ రైళ్ల హాల్ట్ కూడా సాధించలేకపోయారు. – షేక్ బాలిసైదా, అడ్వకేట్, పెదకూరపాడు చేనేతలకు చేసింది శూన్యం పెదకూరపాడులో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి కొమ్మాలపాటి చేసిన మేలు ఏమీ లేదు. సొంతూరు వ్యక్తి అయినా కనీసం చేనేత సమస్యలపై అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. – గాత్రం కాంతారావు,పెదకూరపాడు -
ని‘శబ్దం’ అతని ఆయుధం
అందరికీ ఆయుధాలు కత్తో, కొడవలో అయితే అతని ఆయుధం మాత్రం నిశబ్దం. ఎందుకంటే.. మూగవాడు కనుక. నారా రోహిత్ తదుపరి సినిమా ‘శబ్దం’లో మూగవాడి పాత్రలో కనిపించనున్నారు. పి.బి. మంజునాథ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మించనున్నారు. ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రత్తిపాటి పుల్లారావు క్లాప్‌నిచ్చారు. పి.బి.మంజినాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం టీమ్ అంతా కష్టపడతాం. ఈ కథకు ‘శబ్దం’ అనే టైటిల్ చాలా యాప్ట్’’ అన్నారు. ‘‘శబ్దం’ సూపర్ హిట్ అవ్వాలని, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ‘‘రోహిత్‌గారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత నారాయణరావు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన హీరో రోహిత్, నిర్మాతలకు థ్యాంక్స్. ఏప్రిల్‌లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది’’అన్నారు మంజునాథ్. -
'మీ అరాచకాలతో బీజేపీకి చెడ్డ పేరు వస్తోంది'
గుంటూరు: టీడీపీ అరాచకాలతో మిత్రపక్షమైన బీజేపీకి చెడ్డ పేరు వస్తోందని' బీజేపీ నేత అశోక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పై ఆయన గురువారం మండిపడ్డారు. దేవుని భూములను కొట్టేసిన సిగ్గుమాలిన ఎమ్మెల్యే అంటూ ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లా అమరావతిలో కృష్ణా నది సాక్షిగా అవినీతి ఏరులై పారుతోందని విమర్శించారు. ఇసుక దందాలతో వందల కోట్లు కొల్లగొట్టారంటూ అశోక్ దుయ్యబట్టారు. -
దేవదాస్ స్టైల్ మార్చాడు మూవీ స్టిల్స్