ని‘శబ్దం’ అతని ఆయుధం | Nara Rohith's 'Shabdam' launched in style | Sakshi
Sakshi News home page

ని‘శబ్దం’ అతని ఆయుధం

Published Mon, Mar 19 2018 12:31 AM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

Nara Rohith's 'Shabdam' launched in style - Sakshi

నారా రోహిత్‌

అందరికీ ఆయుధాలు కత్తో, కొడవలో అయితే అతని ఆయుధం మాత్రం నిశబ్దం. ఎందుకంటే.. మూగవాడు కనుక. నారా రోహిత్‌ తదుపరి సినిమా ‘శబ్దం’లో మూగవాడి పాత్రలో కనిపించనున్నారు. పి.బి. మంజునాథ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మించనున్నారు. ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సివిల్‌ సప్లైస్‌ మినిస్టర్‌ ప్రత్తిపాటి పుల్లారావు క్లాప్‌నిచ్చారు.

పి.బి.మంజినాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం కోసం టీమ్‌ అంతా కష్టపడతాం. ఈ కథకు ‘శబ్దం’ అనే టైటిల్‌ చాలా యాప్ట్‌’’ అన్నారు. ‘‘శబ్దం’ సూపర్‌ హిట్‌ అవ్వాలని, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ‘‘రోహిత్‌గారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత నారాయణరావు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన హీరో రోహిత్, నిర్మాతలకు థ్యాంక్స్‌. ఏప్రిల్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది’’అన్నారు మంజునాథ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement