
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కాగా సెక్షన్ 11 ప్రకారం పిటిషన్ అర్హతపై పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది. గతంలో నూరుశాతం విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయాలంటూ తెలంగాణ జీవో విడుదల చేయగా, విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని విడుదల చేయడం వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ తెలంగాణ హైకోర్టులో కృష్ణా జిల్లా రైతు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment