
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో టీ సర్కారు ఉల్లంఘనలపై ఏపీ రైతులు తెలంగాణ హైకోర్టుకు ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో కృష్ణా జిల్లా రైతు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలంటూ పిటిషన్ వేశారు. నూరుశాతం విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయాలంటూ జూన్ 28న తెలంగాణ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని విడుదల చేయడం వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ చర్యల వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటారంటూ పిటిషన్‌లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment