పిరియా సాయిరాజ్, బెందాళం అశోక్
సాక్షి, కంచిలి (శ్రీకాకుళం): అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు...మంచితనం కలిగిన వ్యక్తి మరొకరు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అన్యాయం, అరాచకాలపై నిరసనలు, నిలదీతలు ఎదుర్కొన్న అభ్యర్థి ఒకరు.. జగనన్న స్ఫూర్తితో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా నీరాజనాలు అందుకున్న అభ్యర్థి మరొకరు. వీరే టీడీపీ బెందాళం అశోక్, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్. ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన ఈ అభ్యర్థుల గుణగణాలను ఓసారి పరిశీలిస్తే..
పిరియా సాయిరాజ్
♦ సేవాభావం గల వ్యక్తిత్వం.
♦ సొంత లాభం ఆశించరు.
♦ 2009లో ఎమ్మెల్యేగా వ్యవహరించిన కాలంలో అవినీతి మచ్చలేకుండా పరిపాలన చేశారు.
♦ వచ్చిన గౌరవ వేతనం కూడా పూర్తిగా కిడ్నీబాధితుల కోసం కేటాయించారు.
♦ ఎందరో నిరుద్యోగ యువకులకు తనకు పరిచయాలున్న ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల్లో వేయించారు.
♦ మెడికల్ అవసరాలు ఉన్నవారికి వ్యక్తిగతంగా సహాయం చేస్తుంటారు.
♦ గల్ఫ్ దేశాల్లో కాలం చెల్లిన వీసాలతో చిక్కుకున్న వారిని తిరిగి రప్పించారు.
♦ ఉద్దానం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా ప్లాంట్‌లను నెలకొల్పారు.
♦ సోంపేటలో తన సొంత నిధులతో డయాలసిస్ యూనిట్ మెషీన్ ఏర్పాటు చేశారు.
♦ రెండు అంబులెన్స్ వాహనాలు ఏర్పాటు చేసి ఉచితంగా రోగులకు సేవలందిస్తున్నారు.
♦ సోంపేటలో టెలీమెడిసిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి విశాఖపట్నంలో ఉన్న పలువురు వైద్యనిపుణులతో ఇక్కడి నుంచే రోగులకు అవసరమైన సలహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించుతున్నారు.
♦ ఒక్క పైసా కూడా ఆశించకుండా పరిపాలన చేసిన పేరుంది.
బెందాళం అశోక్
♦ 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
♦ ప్రజాసమస్యలు పరిష్కరించడంలో కంటే సొంత లాభమే చూసుకొంటారనే ఆరోపణలు ఉన్నాయి.
♦ వృత్తిపరంగా వైద్యుడు అయినప్పటికీ సేవాగుణం అంతగా లేదు.
♦ ఐదేళ్ల పదవీకాలంలో బందుప్రీతి, సొంతలాభం చూసుకొనే పరిపాలన చేశారనే విమర్శలు ఉన్నాయి.
♦ తాత్కాలిక అంగన్‌వాడీ న్యూట్రిషన్ పోస్టుల నియామకానికి రూ.2కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
♦ అనుమతులు లేకుండా బాహుదా, మహేంద్రతనయ నదుల్లో ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేసి తమ్ముళ్లతో తవ్వకాలు చేపట్టి, పెద్ద ఎత్తున దందా చేçపట్టి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
♦ నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారుల నుంచి నెలవారీ మామూళ్ల వసూలు చేస్తున్నారే ఆరోపణలు.
♦ కాంట్రాక్టు పనులన్నీ బినామీలకు అప్పగించి, తద్వారా కమీషన్లు వసూళ్లు.
♦ ఏ పని చేయాలన్న ఒక రేటును నిర్ణయించి దర్జాగా వసూళ్లు చేయడం.
♦ సొంతపార్టీ వాళ్ల వద్ద కూడా మొహమాటం లేకుండా అశోక్ తండ్రి ప్రకాశ్, మిగతా ముఖ్య అనుచరులు లంచాలు డిమాండ్ చేయడం.
♦ స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటే, నిరుద్యోగుల నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేయడం, వసూలు చేయడం.
Comments
Please login to add a commentAdd a comment