![Bhaagamathie Director Ashok Next an International Period film - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/21/Director%20Ashok.jpg.webp?itok=uQELJxcB)
దర్శకుడు అశోక్
పిల్ల జమీందార్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అశోక్. తరువాత సుకుమారుడు, చిత్రాంగథ సినిమాలతో నిరాశపరిచినా.. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భాగమతి సినిమాతో మరోసారి సత్తా చాటాడు. డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో అశోక్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. త్వరలో ఈ యువ దర్శకుడు ఓ అంతర్జాతీయ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.
1914 నాటి కథతో తెరకెక్కనున్న ఈసినిమాను పెన్ ఎన్ కెమెరా ప్రొడక్షన్స్ కంపెనీ, కెనడియన్ ఫిలిం కౌన్సిల్ తో కలిసి నిర్మించనుంది. బ్రిటీష్ పరిపాలన కాలంలో కొమగట మరు అనే స్టీమ్ షిప్‌లో కెనడా వెళ్లేందుకు కొందరు భారతీయులు ప్రయత్నించగా అక్కడి ప్రభుత్వం వారు దేశంలోకి ప్రవేశించేందుకు అనుమంతించలేదు. ఈ సంఘటననే కథగా ‘కొమగట మరు 1914’ అనే పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నాడు అశోక్.
Comments
Please login to add a commentAdd a comment