Period Film
-
తంగలాన్ నాకో కొత్త అనుభవం
‘‘నేను విదేశాలు వెళ్లినప్పుడు మీరు బాలీవుడ్డా అని అడుగుతుంటారు. నేను కోలీవుడ్, టాలీవుడ్ అని చెబుతుంటాను. అంటే... వారు ఎక్కువగా హిందీ చిత్రాలే చూసేవారు. కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు చూస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’..లాంటి సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. దక్షిణాది సినిమాలు ఇప్పుడు ఓ మార్క్‌ని క్రియేట్ చేస్తున్నాయి. రాజమౌళిగారు ఆస్కార్‌ను మనకు తీసుకొచ్చారు. ఆయనతో ఓ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు విక్రమ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. పా. రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ– ‘‘తంగలాన్’ ఎమోషనల్ అండ్ రా ఫిల్మ్. రెగ్యులర్ సాంగ్స్, ఫైట్స్.. ఇలాంటి తరహా సినీ గ్లామర్ ‘తంగలాన్’లో లేదు. నా పాత్రకు డైలాగ్స్ అంతగా ఉండవు. లైవ్ సౌండింగ్లో సినిమా చేశాం. నాకు కొత్త ఎక్స్పీరియన్స్. మేకప్‌కు మూడు గంటలు పట్టేది. మీనింగ్‌ఫుల్ సినిమాలు చేస్తుంటారు పా. రంజిత్‌గారు. ‘తంగలాన్’తో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇక నేను చేసిన ‘9 నెలలు’ చిత్రానికి సురేందర్‌రెడ్డి, వినయ్‌లు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా చేశారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి ఈ ఈవెంట్‌కు వచ్చారు. లైఫ్ సర్కిల్లా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘విక్రమ్‌గారితో నేను చేసిన తొలి చిత్రమిది. ఆయన అంకితభావం, టైమింగ్ సూపర్. ‘తంగలాన్’ సినిమా ప్రేక్షకులను మెప్పి స్తుంది’’ అన్నారు పా. రంజిత్. ‘‘విక్రమ్ ట్రెమండస్ యాక్టర్. వరల్డ్ సినిమా లవర్స్‌కు ‘తంగలాన్’ ఓ గ్రేట్ ట్రీట్‌లా ఉంటుంది’’ అన్నారు కేఈ జ్ఞానవేల్ రాజా. ‘‘విక్రమ్ సార్ ఓ నటుడుగా తనను తానే మళ్లీ ఆవిష్కరించుకుంటుంటారు’’ అని అతిథిగా పాల్గొన్న సత్యదేవ్ అన్నారు. దర్శకులు వేణు ఊడుగుల, కరుణకుమార్, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ అతిథులుగా పాల్గొన్నారు. -
వెండితెరపై యుద్ధానికి సిద్ధం అవుతున్న స్టార్ హీరోలు
వెండితెరపై కథానాయకుడు కత్తి దూస్తే.. గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధం చేస్తే... విల్లు ఎక్కుపెడితే చూసే ప్రేక్షకులకు ఓ థ్రిల్. రెగ్యులర్‌గా వచ్చే ఫైట్స్‌కి భిన్నంగా సిల్వర్ స్క్రీన్‌పై ‘వార్’ కనిపిస్తే ‘వావ్’ అనకుండా ఉండలేరు. కొందరు హీరోలు వెండితెరపై యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. ఆ వారియర్స్ గురించి ఓ లుక్ వేయండి. దిక్కులెల్ల గెలిచినోడు.. ‘కొండల కోనల్లో కోటి పులులు పట్టినోడు, ముక్కోటి చుక్కలెక్కి దిక్కులెల్ల గెలిచినోడు.. ఒక్కడే ఒక్క వీరుడురా.. వాడే కంగ’.. కంగువా’ సినిమాలో హీరోగా సూర్య పాత్రను చిత్రబృందం వివరించిన తీరు ఇది. దీన్నిబట్టి ఈ సినిమాలో సూర్య పాత్రను ఈ చిత్రదర్శకుడు శివ చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్ది ఉంటారని ఊహించవచ్చు. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో కనిపిస్తారు సూర్య. ఇప్పటికే ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. అంతేకాదు..‘కంగువా’ సినిమాలో ఈ సీన్స్ హైలైట్‌గా ఉంటాయని కోలీవుడ్ సమాచారం. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్ అయ్యే ఓ పాయింట్‌తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటించారు. ‘కంగువా’ తొలి భాగం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ది వారియర్ విభిన్న సినిమాలు, వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారు హీరో మోహన్‌లాల్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్ అరైజ్’ అనేది ఉపశీర్షిక. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయింది. కాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ లుక్ కొన్ని సీన్స్‌లో మోహన్‌లాల్ వారియర్‌గా కనిపిస్తారన్నట్లుగా స్పష్టం చేస్తోంది. దీనికి తోడు క్యాప్షన్‌లో ‘వారియర్’ ప్రస్తావన ఉండటంతో మోహన్‌లాల్ వారియర్‌గా కనిపించే నిడివి కూడా ఎక్కువే అని ఊహిస్తున్నారు ఆయన అభిమానులు. తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోషన్ ఓ హీరోగా నటిస్తున్నాడు. జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందకిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే మోహన్‌లాల్ నటించి, తొలిసారి దర్శకత్వం వహించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘బరోజ్’. ఈ చిత్రంలో ఓ నిధిని కాపాడే యోధుడిగా కనిపిస్తారాయన. స్వయంభూ వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం.. వంటి యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు హీరో నిఖిల్. ఎందుకంటే ‘స్వయంభూ’ సినిమా కోసం. ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌లో నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపిస్తారు. నిఖిల్ శిక్షణ పూర్తయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తి స్థాయిలో ్రపారంభం కానుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇలా ‘వార్’ బ్యాక్‌డ్రాప్‌లో దక్షిణాదిన మరికొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. -
మహారాణి పాత్రలో నటించనున్న రష్మిక మందన్నా!
మహారాణిగా నిర్ణయాలు తీసుకోనున్నారట హీరోయిన్ రష్మికా మందన్నా. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్ ఫిల్మ్ రూపొందనుంది. ఈ చిత్రానికి ‘ఛావా’ అనే టైటిల్ అనుకుంటున్నారట. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ కౌశాల్ పోషించనున్నారు. శంభాజీ భార్య మహారాణి ఏసుబాయి భోంస్లే పాత్రలో రష్మికా మందన్నా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా కథ నచ్చి రష్మికా మందన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ కాలపు యాక్సెంట్ నేర్చుకోవడం కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని భోగట్టా. యుద్ధాల కోసం శంభాజీ పక్క దేశాలకు వెళ్లినప్పుడు, రాజమహల్లో రాణిగా ఏసుబాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎలాంటి రాజకీయ వ్యూహాలను రచించారు? అనే కోణంలో కూడా ఈ సినిమా కథ ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారట లక్ష్మణ్. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో ఆరంభించాలనుకుంటున్నారని టాక్. ఇక ఇప్పటికే హిందీలో ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలు చేసిన రష్మికా మందన్నా ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా రూపొందు తున్న ‘పుష్ప: ది రూల్’లో రష్మికా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘ఆర్ఆర్ఆర్’ పీరియడ్ డ్రామనే..!
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. రాజమౌళితో పాటు ఇతర చిత్రయూనిట్ అంతా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ బైటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ సినిమా ఎనౌన్స్ అయిన దగ్గర నుంచి మూవీ పీరియాడిక్ డ్రామా అన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా యన్.టి.ఆర్ ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంగీత దర్శకుడు కీరవాణి, ఆర్ఆర్ఆర్ స్టోరిపై హింట్ ఇచ్చారు. ఈ సినిమా పని తాను మార్చిలో ప్రారంభిస్తానన్న కీరవాణి, ఈ సినిమాలో తన మ్యూజిక్ పీరియడిక్, ట్రెండీల ఫ్యూజన్ల ఉండబోతుందన్నారు. దీంతో సినిమా కూడా పీరియాడిక్ జానర్లోనే తెరకెక్కుతుందన్న టాక్‌కు మరింత బలం చేకూరినట్టైంది. మరి ఇప్పటికైన చిత్రయూనిట్ స్పందిస్తారేమో చూడాలి. -
ఆస్కార్
భారతదేశం నుండి వెళ్లిన ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’.. చిత్రం ‘లఘు కథాంశ చిత్రాల’ కేటగిరీ కింద ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది! అవార్డు చిత్రాల దర్శకుడు రేకా చటాబ్జి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రుతుస్రావాన్ని కథాంశంగా తీసుకుని గ్రామీణ నేపథ్యంలో సిఖ్యా ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే ఈ ఏడాది ‘క్లీవ్‌లాండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘బెస్ట్ డాక్యుమెంటరీ షార్’్ట అవార్డ్ పొందింది. లాస్ ఏంజెలిస్ లోని ఓక్‌ఉడ్ స్కూల్ విద్యార్థులు తమ క్లాస్ టీచర్ మెలిస్సా బెర్టన్ నేతృత్వంలో చేపట్టిన ‘ది ప్యాడ్ ప్రాజెక్ట్’లో భాగంగా ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ రూపుదాల్చింది. చిత్రంలో.. ఢిల్లీ సమీపంలోని హపూర్ గ్రామంలో కొంతమంది మహిళలు రుతుస్రావం చుట్టూ ఉన్న దురభిప్రాయాలు, దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. ‘ఫ్లయ్’ అనే బ్రాండ్ నేమ్‌తో తామే సొంతంగా శానిటరీ ప్యాడ్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తారు. స్ఫూర్తిదాయకమైన ఈ చిత్రంతో పాటు.. ‘బ్లాక్ షీప్’, ‘ఎండ్ గేమ్’, ‘లైఫ్‌బోట్’, ‘లాస్ కమాండోస్’, ‘మై డెడ్ డాడ్స్ పోర్నో టేప్స్’, ‘ఎ నైట్ ఎట్ ది గార్డెన్’, ‘63 బాయ్‌కాట్’, ‘ఉమెన్ ఆఫ్ ది గులాగ్, ‘జియాన్’ చిత్రాలు కూడా ఈ కేటగిరీ కింద నామినేషన్‌కు నిలబడ్డాయి. -
వెనక్కి వెళ్దామా...
సినిమా అంటేనే మ్యాజికల్ ప్రపంచం. సడెన్‌గా టైమ్ మిషన్‌లో పెట్టి ముందుకు తీసుకెళ్లగలరు, లేదా వెనక్కీ తీసుకెళ్లగలరు. ఇప్పుడు ఇలానే టైమ్ మిషన్ ఎక్కించి మనందర్నీ ఒక 60 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ ఓ పీరియాడికల్ ప్రేమ కథ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఎక్కువ శాతం ఇటలీలో షూటింగ్ జరుపుకోనుంది. ఆల్రెడీ 1960 ఏళ్ల కాలం నాటి లుక్ తీసుకురావడానికి ఆర్ట్ డైరెక్టర్ యస్. రవీందర్ కొన్ని సెట్స్ డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పూర్తి స్థాయి పాతకాలపు లుక్ రావడం కోసం ఇటలీలోని పురాతనపు, పాత మోడల్ వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారట. ఈ పీరియాడికల్ ప్రేమకథ పర్ఫెక్ట్గా ఉండటం కోసం టీమ్ చాలా శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో ప్రభాస్ భవిష్యవాణి చెప్పే (జ్యోతిష్యుడిగా) వ్యక్తిగా కనిపిస్తారని టాక్. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది. -
భాగమతి దర్శకుడికి బంపర్ ఆఫర్
పిల్ల జమీందార్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అశోక్. తరువాత సుకుమారుడు, చిత్రాంగథ సినిమాలతో నిరాశపరిచినా.. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భాగమతి సినిమాతో మరోసారి సత్తా చాటాడు. డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో అశోక్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. త్వరలో ఈ యువ దర్శకుడు ఓ అంతర్జాతీయ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. 1914 నాటి కథతో తెరకెక్కనున్న ఈసినిమాను పెన్ ఎన్ కెమెరా ప్రొడక్షన్స్ కంపెనీ, కెనడియన్ ఫిలిం కౌన్సిల్ తో కలిసి నిర్మించనుంది. బ్రిటీష్ పరిపాలన కాలంలో కొమగట మరు అనే స్టీమ్ షిప్లో కెనడా వెళ్లేందుకు కొందరు భారతీయులు ప్రయత్నించగా అక్కడి ప్రభుత్వం వారు దేశంలోకి ప్రవేశించేందుకు అనుమంతించలేదు. ఈ సంఘటననే కథగా ‘కొమగట మరు 1914’ అనే పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నాడు అశోక్. -
చిత్ర నిర్మాణ రంగంలోకి వైగో
సాక్షి, చెన్నై : ప్రముఖ రాజకీయ నాయకుడు, ఎండీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన కన్నకీ ఫిలింస్ పతాకంపై చారిత్రకారిణి వేలు నాచ్చియార్ జీవిత కథను చిత్రంగా నిర్మించనున్నారు. వేలు నాచ్చియార్ నాటకం తమిళనాటు ప్రసిద్ధి చెందింది. ఈ నాటకాన్ని సోమవారం సాయంత్రం స్ధానిక మైలాపూర్‌లోని నారదగానసభలో ప్రదర్శిం చారు. ఈ నాటక ప్రదర్శనకు వైగో, నడిగర్‌సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధక్షుడు విశాల్, నాజర్ పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన చరిత్రకారిణి వేలు నాచ్చయార్ చరిత్రను చిత్రంగా నిర్మించనున్నానని వెల్ల డించారు. విశాల్ మాట్లాడుతూ తాను ముఖ్యమైన అంశం గురించి ప్రభుత్వంతో చర్చించాల్సి ఉన్నా, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైగో కోరడంతో వచ్చానన్నారు. బ్రిటీష్ ప్రభుత్వానికి పన్ను కట్టడాన్ని ఎదిరించి వేలు నాచ్చియార్ పోరాడారని, తాము వినోదపు పన్ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై పోరాడుతున్నామన్నారు. పన్ను విషయంలో ప్రభుత్వం నుంచి సాధకమైన నిర్ణయం వస్తుందనే నమ్మకం ఉందని విశాల్ పేర్కొన్నారు. -
కంగన... విశాల్... సెకండ్ వరల్డ్ వార్!
నిజంగా ఇదో చిత్రమైన కాంబినేషనే! కంగనా రనౌత్... బాలీవుడ్లో ఈ పేరు వినగానే విభిన్న తరహా పాత్రలు చేసే నటి గుర్తుకొస్తారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ పేరు వినగానే వైవిధ్యమైన కథాంశంతో కూడిన సినిమాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఓ కొత్త సినిమా మొదలైంది. పేరు - ‘రంగూన్’. గమ్మత్తేమిటంటే, ఇటీవలే తెలుగులో వచ్చిన క్రిష్ ‘కంచె’ సినిమా లాగే ఈ సినిమా కథ కూడా 1940ల నాటి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలోనే నడుస్తుంది. ఈ పీరియడ్ ఫిల్మ్‌లో షాహిద్ కపూర్, సయీఫ్ అలీ ఖాన్లు హీరోలు. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కంగన ఒక నటిగా కనిపించనుండడం విశేషం. నటిగా తనను తీర్చిదిద్దిన వ్యక్తితోనే ప్రేమలో పడే పాత్ర ఆమెది. ఇక సినిమాలో ముఖ్యమైన మూడో పాత్ర - ఒక సైనికుడిది. గతంలో ‘ఓంకార’ సినిమాలో విశాల్ భరద్వాజ్‌తో కలసి పనిచేసిన షాహిద్ కపూర్‌కు అదే దర్శకుడితో ఇది రెండో సినిమా. ఎప్పటికప్పుడు పాత్రల్లో కొత్తదనం కోసం, అభినయంలో ఆత్మ సంతృప్తి కోసం వెతికే కంగనా రనౌత్ మరోసారి దుమ్ము రేపుతారేమో చూడాలి.