మహారాణిగా నిర్ణయాలు తీసుకోనున్నారట హీరోయిన్ రష్మికా మందన్నా. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్ ఫిల్మ్ రూపొందనుంది. ఈ చిత్రానికి ‘ఛావా’ అనే టైటిల్ అనుకుంటున్నారట. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ కౌశాల్ పోషించనున్నారు.
శంభాజీ భార్య మహారాణి ఏసుబాయి భోంస్లే పాత్రలో రష్మికా మందన్నా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా కథ నచ్చి రష్మికా మందన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ కాలపు యాక్సెంట్ నేర్చుకోవడం కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని భోగట్టా.
యుద్ధాల కోసం శంభాజీ పక్క దేశాలకు వెళ్లినప్పుడు, రాజమహల్‌లో రాణిగా ఏసుబాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎలాంటి రాజకీయ వ్యూహాలను రచించారు? అనే కోణంలో కూడా ఈ సినిమా కథ ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారట లక్ష్మణ్. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో ఆరంభించాలనుకుంటున్నారని టాక్. ఇక ఇప్పటికే హిందీలో ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలు చేసిన రష్మికా మందన్నా ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా రూపొందు తున్న ‘పుష్ప: ది రూల్’లో రష్మికా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment